Vijayawada: రేపట్నుంచే 32వ పుస్తక మహోత్సవం ప్రారంభం
- By Balu J Published Date - 02:49 PM, Fri - 31 December 21

ఈ నెల 11వ తేదీ వరకు జరిగే పుస్తక మహోత్సవాన్ని రాష్ట్ర గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ప్రారంభించనున్నట్లు విజయవాడ బుక్ ఫెస్టివల్ సొసైటీ కన్వీనర్ విజయకుమార్ తెలిపారు. విజయవాడ స్వరాజ్ మైదానంలో నిర్వహించే పుస్తక మహోత్సవంలో 210 స్టాల్స్ ను ఏర్పాటు చేశామని.. 10 శాతం రాయితీతో పుస్తకాలను అందించనున్నట్లు తెలిపారు. రేపు సాయంత్రం నుంచి ప్రారంభమయ్యే ఈ పుస్తక మహోత్సవం ప్రతిరోజూ మధ్యాహ్నం 2 గంటల నుంచి రాత్రి 8 గంటల 30 నిమిషాల వరకు పుస్తక ప్రియులకు అందుబాటులో ఉంటుందని తెలిపారు.