Speed News
-
UP: చౌధరీ చరణ్ సింగ్ కు భారతరత్న ఇవ్వాలి -అఖిలేశ్ యాదవ్
యూపీ అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తుండగా.. ఓటర్లను ఆకట్టుకునేందుకు అన్ని పార్టీలు విశ్వప్రయత్నం చేస్తున్నాయి. సమాజ్ వాదీ పార్టీ అధినేత అఖిలేశ్ యాదవ్ సరికొత్త డిమాండ్ ను తెరపైకి తీసుకొచ్చారు. మాజీ ప్రధాని చౌధరీ చరణ్ సింగ్ కు భారతరత్న ఇవ్వాలని డిమాండ్ చేశారు. చరణ్ సింగ్ జయంతిని రైతు దినోత్సవంగా జరుపుకుంటారు. ఈ సందర్భంగా ఆయనను అఖిలేశ్ గుర్తు చేసుకున్నారు. రైతుల కోసం సర్వస్
Published Date - 05:19 PM, Thu - 23 December 21 -
Bomb Blast : పేలుడు ఎవరిపనో తెలుసుకుంటున్నాం- ఎస్పీ
పంజాబ్ లోని లూథియానా కోర్టులో హై గ్రేడ్ పేలుడు సంభవించింది. ఆ పేలుడుకు ఒకరు మరణించగా, ముగ్గురు గాయపడ్డారు. సెషన్స్ కోర్టు కాంప్లెక్స్‌లోని వాష్‌రూమ్‌లో గురువారం ఈ సంఘటన జరిగింది.
Published Date - 04:48 PM, Thu - 23 December 21 -
ఆస్పత్రికి 60ఏళ్ల అంధ ఏనుగు
60ఏళ్ల వయస్సు అంధ ఏనుగును కాపాడేందుకు యూపీ ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ తీసుకుంది. మధుర లోని ఎలిఫెంట్ కన్జర్వేషన్ అండ్ కేర్ సెంటర్ రక్షించి పునరావాసం కల్పించిన ఆ ఏనుగు ప్రస్తుతం అనేక వ్యాధులతో బాధపడుతుంది.
Published Date - 04:45 PM, Thu - 23 December 21 -
Video : కబడ్డీ ఆడుతూ కిందపడిపోయిన స్పీకర్
కబడ్డీ ఆడుతూ స్పీకర్ తమ్మినేని అదుపుతప్పి కింద పడిపోయిన ఘటన స్థానికంగా కలకలం రేపింది. శ్రీకాకుళం జిల్లా ఆముదాలవలసలో సీఎం కప్ క్రికెట్ టోర్నీ ప్రారంభించిన అనంతరం తమ్మినేని కబడ్డీ ఆడారు. ఈ క్రమంలోనే ఆయన అదుపుతప్పి కింద పడిపోయారు. స్పీకర్ తమ్మినేని కిందపడిపోయిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. స్పీకర్ కు అనారోగ్య సమస్యలు ఉండటంతో వ్యక్తిగత సిబ్బంది వెంటనే తమ్మిన
Published Date - 04:12 PM, Thu - 23 December 21 -
Andhra pradesh: వైసీపీ అంటే ‘ఏమీ చేతకాని ప్రభుత్వం’- జీవీఎల్
బీజేపీ రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు వైసీపీ సర్కారుపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఆర్థిక వైఫల్యం అనే అంశంపై ఎవరైనా అధ్యాయనం చేయాల్సి వస్తే అందుకు ఏపీనే సరైన రాష్ట్రం అని వ్యాఖ్యానించారు. తాజాగా ఓటీఎస్ పేరుతో కొత్త దోపిడీకి శ్రీకారం చుట్టారని విమర్శించారు. కేంద్రం నిధులు ఇస్తున్నా ఉపయోగించుకోవడంలేదని వెల్లడించారు. యూపీ తర్వాత కేంద్రం నుంచి అత్యధికంగా నిధుల
Published Date - 04:12 PM, Thu - 23 December 21 -
Drugs: 26 లక్షల విలువైన డ్రగ్స్ పట్టివేత!
నూతన సంవత్సర వేడుకల కోసం గోవా నుంచి హైదరాబాద్‌కు అక్రమంగా డ్రగ్స్ తరలిస్తున్న ముగ్గురిని సైబరాబాద్ పోలీసులు గురువారం అరెస్టు చేశారు. సుమారు 183 గ్రాముల కొకైన్, 44 ఎండీఎంఏ (ఎక్‌స్టాసీ) డ్రగ్, మూడు మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్లు సైబరాబాద్ పోలీస్ కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర తెలిపారు. స్వాధీనం చేసుకున్న డ్రగ్ విలువ రూ.26,28,000 ఉంటుందని, వారిపై ఎన్డీపీఎస్ చట్టం కింద కేస
Published Date - 04:03 PM, Thu - 23 December 21 -
Crime: వీఎన్ఆర్ కళాశాల విద్యార్ధి ఆత్మహత్య
హైదరాబాద్ బాచుపల్లిలోని వీఎన్ఆర్ ఇంజనీరింగ్ కళాశాల వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. 13వ అంతస్తు నుంచి దూకి బీటెక్ విద్యార్ధి ఆత్మహత్య చేసుకున్నాడు. అలర్ట్ అయిన కాలేజ్ సిబ్బంది గుట్టు చప్పుడు కాకుండా మృతదేహాన్ని గాంధీ ఆసుపత్రికి తరలించారు. విషయం తెలుసుకున్న ఏబీవీపీ కార్యకర్తలు కాలేజీ దగ్గర ఆందోళనకు దిగారు. క్యాంపస్‌లోకి చొరబడి ఫర్నీచర్ ధ్వంసం చేశారు. పరిస్ధితి ఉద్రిక
Published Date - 03:54 PM, Thu - 23 December 21 -
Cinema: ఏపీలో థియేటర్లను సీజ్ చేసిన అధికారులు
ఇటీవలే ఆంధ్రప్రదేశ్ లో సినిమా టిక్కెట్ల రేట్లు పై అటు సినిమా ఇండస్ట్రీ కి ఇటు ప్రభుత్వానికి మధ్య జరుగుతున్న వివాదంలో థియేటర్ల యాజమాన్యాలు బలవుతున్నాయి. తాజాగా గురువారం ఏపీలో నిబంధనలు పాటించని పలు థియేటర్లను అధికారుల సీజ్ చేశారు. చిత్తూరు జిల్లా మదనపల్లిలో 7, కుప్పంలో 4 థియేటర్లును సబ్ కలెక్టర్ ఆదేశాల మేరకు అధికారులు సీజ్ చేశారు. సీఎం జగన్‌తోనే సినీ
Published Date - 03:42 PM, Thu - 23 December 21 -
Viral : పిక్ ఆఫ్ ది డే.. ఆ నలుగురు ఓకేచోట!
టాలీవుడ్ మోస్ట్ ఎవైటెడ్ మూవీ RRR టీమ్ మొత్తం సినిమా ప్రమోషన్‌లో బిజీగా ఉన్నారు. రిలీజ్ డేట్ దగ్గర పడుతుండటంతో మేకర్స్, లీడ్ యాక్టర్స్ హైప్ ని కొనసాగించడానికి తమ వంతు ప్రయత్నాలు చేస్తున్నారు. ఇటీవల దర్శకధీరుడు రాజమౌళి, నటులు రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ ప్రమోషనల్ ఈవెంట్ కోసం ముంబై వెళ్లారు. అక్కడ వారు రానా దగ్గుబాటిని అతని ముంబై ఫ్లాట్‌లో కలుసుకున్నారు. అతనితో సరదాగా గడి
Published Date - 03:31 PM, Thu - 23 December 21 -
Thirupathi: శ్రీవారి దర్శనానికి విచ్చేసిన శ్రీలంక ప్రధాని కుటుంబం..
శ్రీలంక ప్రధాని మహీంద రాజపక్స కుటుంబ సమేతంగా తిరుమల శ్రీవారి దర్శనానికి విచ్చేశారు. రాజపక్స కుటుంబం రెండు రోజుల పాటు తిరుమలలో గడపనుంది. ఈ మధ్యాహ్నం భారత్ చేరుకున్న శ్రీలంక ప్రధానికి రేణిగుంట విమానాశ్రయంలో ఏపీ డిప్యూటీ సీఎం నారాయణస్వామి, చిత్తూరు జిల్లా కలెక్టర్ ఎం.హరినారాయణన్ హార్దిక స్వాగతం పలికారు. ఈ రాత్రికి తిరుమలలో బస చేయనున్న రాజపక్స కుటుంబం రేపు ఉదయం శ్రీవా
Published Date - 03:27 PM, Thu - 23 December 21 -
India: కుమారుడు అడిగాడని..తండ్రి తపన- మహీంద్రా ట్వీట్
కుమారుడు అడిగాడని.. తన కోరికను తీర్చేందుకు ఆ తండ్రి పడిన తపన, అన్వేషణ, శ్రమ ఓ అద్భుత ఆవిష్కారానికి దారితీసింది.
Published Date - 03:10 PM, Thu - 23 December 21 -
India: పంజాబ్ కోర్టులో భారీ బ్లాస్ట్
పంజాబ్ లోని లుధియానా కోర్టులో భారీ పేలుడు చోటు చేసుకుంది. ఈ ఘటనలో ఇద్దరు మృతి చెందగా పలువురికి గాయాలయ్యాయి. కోర్టు కాంప్లెక్స్ లోని మూడవ అంతస్థులో ఈ పేలుడు సంభవించిందని స్థానికులు చెబుతున్నారు. బ్లాస్ట్ బాత్రూం లో చోటు చేసుకోగా పేలుడు తీవ్రతకు గోడలు అద్దాలు ధ్వంసం అయ్యాయి. పోలీసుల విచారణ నేపథ్యంలో బ్లాస్టుకు గల కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది. గురువారం మధ్యాహ్నం 12:22 గంటల
Published Date - 02:40 PM, Thu - 23 December 21 -
CBN: రైతుల కష్టాలు చూస్తుంటే బాధగా ఉంది!
జాతీయ రైతు దినోత్సవం సందర్భంగా టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు శుభాకాంక్షలు తెలిపారు. రైతు సంతోషంగా ఉన్నప్పుడే రాష్ట్రం, దేశం సుభిక్షంగా ఉంటుందని ఆయన అన్నారు. దేశానికి అన్నపూర్ణగా పేరుగాంచిన ఆంధ్రప్రదేశ్ లో ఈ రోజు రైతు పడుతున్న కష్టాలు చూస్తుంటే బాధగా ఉందంటూ సోషల్ మీడియాలో ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ‘‘దుక్కి దున్నిన నాటి నుండి పంటను అమ్మి డబ్బు చేతికొచ్చే వరకు రై
Published Date - 01:30 PM, Thu - 23 December 21 -
Cinema: ఏపీ ప్రభుత్వంపై నాని సంచలన వ్యాఖ్యలు
‘శ్యామ్ సింగరాయ్’ చిత్రబృందం ఈరోజు మీడియా సమావేశాన్ని నిర్వహించింది. ఈ సందర్భంగా నాని మాట్లాడుతూ… సినిమా టికెట్ల ధరలను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తగ్గించిందని, ఇది సరైన నిర్ణయం కాదని అన్నారు. టికెట్ ధరలను తగ్గించడం ద్వారా ప్రేక్షకులను ప్రభుత్వం అవమానించిందని అయన చెప్పారు. సినిమా థియేటర్ల కంటే పక్కనున్న కిరాణా షాపులకు ఎక్కువ కలెక్షన్లు వస్తున్నాయి నాని అన్నారు. ట
Published Date - 01:18 PM, Thu - 23 December 21 -
India: విచారణకు హాజరైన కంగనా..
ప్రముఖ బాలీవుడ్ నటి కంగనా రనౌత్ ముంబైలోని ఖార్ పోలీసు స్టేషన్ లో విచారణ నిమిత్తం హాజరయ్యారు. కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన వివాదాస్పద సాగు చట్టాలకు వ్యతిరేకంగా ఢిల్లీ సరిహద్దుల్లో ఉద్యమం చేస్తున్న రైతులను ఆమె తీవ్రవాదులతో పోల్చారు. ఈ వివాదాస్పదమైన వ్యాఖ్యలపై ముంబైలోని ఖార్ పోలీసు స్టేషన్ లో ఎప్ఐఆర్ నమోదు చేశారు. ముంబై పోలీసులు కంగనా రనౌత్ ను జనవరి 25 వరకు అరెస్టు చే
Published Date - 01:05 PM, Thu - 23 December 21 -
Telangana: KCR ఫామ్‌హౌస్‌లో యువకుడి మృతి పట్ల RSP సంచలన వ్యాఖ్యలు
కేసీఆర్ ఫామ్ హౌస్‌లో యువకుడు మరణించిన ఘటన రాష్ట్ర వ్యాప్తంగా కలకలం సృష్టిస్తోంది. యువకుడి మరణంతో ప్రభుత్వం పై అటు కుటుంబ సభ్యులు, ఇటు ప్రతి పక్షాలు పెద్ద ఎత్తున విరుచుకుపడుతున్నారు. ఈ నేపథ్యంలో బిఎస్పి నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ ఫామ్ హౌస్‌లోని యువకుడి మృతిపై అనుమానాలు ఉన్నాయని వెంటనే యువకుడి అనుమానాస్పద మృతిపై సీబీఐ విచారణ చేపట్టాలని
Published Date - 12:35 PM, Thu - 23 December 21 -
China: లాక్ డౌన్ విధించిన ప్రభుత్వం
చైనా లోని జియాన్ ప్రాతంలో గురువారం నుండి లాక్ డౌన్ విధించనున్నారు. చైనాలో కరోనా మహమ్మారిని అరికట్టేందుకు విధించిన లాక్ డౌన్ లలో ఇదే అతిపెద్దది కావడం విశేషం. డెల్టా వేరియెంట్ విజృంభిస్తున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్టు అధికార వర్గాలు తెలిపాయి. ఈ నిర్ణయంతో దాదాపు కోటి 30 లక్షల మంది ప్రజలు లాక్ డౌన్లో ఉండనునట్టు అంచనా. నిత్యావసర సరుకులకోసం, ఇతర ఎమర్జెన్సీ సమయాల్లో ఒ
Published Date - 12:21 PM, Thu - 23 December 21 -
India: హైదరాబాద్ లో మున్నవార్ ఫారూఖీ షో
స్టాండప్ కమిడియన్ మున్నవార్ ఫారూఖీ 2022 జనవరి 9న హైదరాబాద్ లో షో నిర్వహిస్తున్నట్టు ట్విట్టర్ వేదికగా ప్రకటించారు. ఆధారాలు లేకుండా హిందువుల మనోభావాలు రెచ్చగొట్టే విధంగా ఫారూఖ్ మాట్లాడాడని బీజేపీ నేత ఆరోపణ చేయడంతో అరెస్ట్ చేశారు బెంగళూరు పోలీసులు. బెంగళూరులో మున్నావర్ ఫారూకీ షో నిర్వహణకు వ్యతిరేకంగా కొన్ని హిందూ సంఘాలు సోషల్ మీడియా ద్వారా ప్రభుత్వాన్ని హెచ్చరించాయి.
Published Date - 11:43 AM, Thu - 23 December 21 -
Omicron: ఒమిక్రాన్ తో ఆసుపత్రిలో చేరాల్సిన పరిస్థితులు తక్కువే
మన దేశంలోనూ కరోనా ఒమిక్రాన్ పాజిటివ్ కేసులు 236కు, తెలంగాణలో వీటి సంఖ్య 38కు చేరుకుంది. అయితే, ఒమిక్రాన్ కేసుల వ్యాప్తి ఎక్కువగా ఉన్నప్పటికీ.. ఈ వైరస్ కారణంగా అనారోగ్య తీవ్రత తక్కువగానే ఉంటున్నట్టు అమెరికా వైద్యులు తాజాగా పేర్కొన్నారు. అంతేకాదు డెల్టా వేరియంట్ తో పోలిస్తే ఒమిక్రాన్ ప్రభావం తక్కువగా ఉంటున్నట్టు రెండు బ్రిటిష్ తాజా అధ్యయనాలు కూడా తేల్చడం ఊరటనిచ్చేదే. ఒమి
Published Date - 11:12 AM, Thu - 23 December 21 -
Cinema: ఏపీలో 50 థియేటర్ల మూసివేత!
ఆంధ్రప్రదేశ్ లో సినిమా టికెట్ల వ్యవహారం రోజురోజుకు ముదురుతోంది. టికెట్ ధరలను తగ్గిస్తూ ఏపీ ప్రభుత్వం జీవో 35ని విడుదల చేసిన సంగతి తెలిసిందే. దీంతో సినీ నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లు, థియేటర్ యజమానులు హైకోర్టును ఆశ్రయించగా.. జీవో 35ని రద్దు చేస్తూ, టికెట్ ధరలను పెంచుకునేందుకు అవకాశం కల్పిస్తూ హైకోర్టు సింగిల్ బెంచ్ తీర్పును వెలువరించింది. దీంతో ఏపీ ప్రభుత్వం హైకోర్టు డి
Published Date - 11:02 AM, Thu - 23 December 21