Forgery Case:బీజేపీ చీఫ్ సోము వీర్రాజు అల్లుడిపై చీటింగ్ కేసు
ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు అల్లుడు వెంకట నరసింహంపై చీటింగ్, ఫోర్జరీ కేసు నమోదు అయింది.
- By Hashtag U Published Date - 10:13 AM, Tue - 4 January 22

ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు అల్లుడు వెంకట నరసింహంపై చీటింగ్, ఫోర్జరీ కేసు నమోదు అయింది. కొవ్వూరు టైన్ పోలీస్ స్టేషన్ లో గత నెల 4వ తేదీన రాజమండ్రికి చెందిన గద్దె జయరామకృష్ణ అనే వ్యక్తి సోము వీర్రాజుపై ఫిర్యాదు చేశారు. తమ ఆస్తి పత్రాలను ఫోర్జరీ చేసి కొవ్వూరు ఎస్‌బీఐ బ్యాంకులో కవల వెంకట నరసింహం లోన్ తీసుకున్నారని ఫిర్యాదులో పేర్కోన్నారు. ఈ క్రమంలో సోమువీర్రాజు అల్లుడు వెంకట నరసింహంపై ఐపీసీ 406, 419, 420, 465 సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు.