Telangana: విద్యాసంస్థలకు సెలవులు
- By hashtagu Published Date - 10:53 AM, Tue - 4 January 22

తెలంగాణలోని అన్ని విద్యా సంస్థలకు రాష్ట్ర ప్రభుత్వం సెలవులు ప్రకటించింది. ఈ నెల 8 నుంచి 16వ తేదీ వరకు సెలవులు ఇవ్వాలని ముఖ్యమంత్రి కేసీఆర్ విద్యాశాఖకు ఆదేశాలు జారీ చేశారు. సంక్రాంతి పండుగ నేపథ్యంలో 9 రోజులు సెలవులను ప్రకటించారు. 16వ తేదీ తర్వాత కరోనా వైరస్ పరిస్థితులను బట్టి సెలవులపై తదుపరి నిర్ణయం తీసుకోనున్నారు.
మరోవైపు ఒమిక్రాన్ నేపథ్యంలో సభలు, ర్యాలీలను నిర్వహించకుండా చర్యలు తీసుకోవాలని అధికారులకు ముఖ్యమంత్రి సూచించారు. వైద్య, ఆరోగ్యశాఖపై సమీక్ష సందర్భంగా కేసీఆర్ ఈ మేరకు ఆదేశాలు జారీ చేశారు.