Omicron: ఆరోగ్య భీమా పాలసీలోకి ఓమిక్రాన్ చికిత్స – IRDAI
కోవిడ్-19 చికిత్స ఖర్చులను కవర్ చేసే ఆరోగ్య బీమా పాలసీలు ఓమిక్రాన్ వేరియంట్‌కు చికిత్స ఖర్చును కూడా కవర్ చేస్తాయని ఐఆర్డీఏఐ తెలిపింది. ఓమిక్రాన్ కేసుల వ్యాప్తి నేపథ్యంలో ఐఆర్డీఏఐ ఈ ఆదేశాలను జారీ చేసింది .
- By Hashtag U Published Date - 10:10 AM, Tue - 4 January 22

కోవిడ్-19 చికిత్స ఖర్చులను కవర్ చేసే ఆరోగ్య బీమా పాలసీలు ఓమిక్రాన్ వేరియంట్‌కు చికిత్స ఖర్చును కూడా కవర్ చేస్తాయని ఐఆర్డీఏఐ తెలిపింది. ఓమిక్రాన్ కేసుల వ్యాప్తి నేపథ్యంలో ఐఆర్డీఏఐ ఈ ఆదేశాలను జారీ చేసింది . రెగ్యులేటర్ ఏప్రిల్ 1, 2020 ప్రకటనను ప్రస్తావిస్తూ దీనిలో సాధారణ, ఆరోగ్య బీమా కంపెనీలు అందించే హాస్పిటలైజేషన్ చికిత్స ఖర్చులను కవర్ చేసే అన్ని నష్టపరిహారం ఆధారిత ఆరోగ్య-బీమా ఉత్పత్తులు, కరోనా కారణంగా ఆసుపత్రిలో చేరే ఖర్చులను భరిస్తాయని స్పష్టం చేసింది. కరోనా చికిత్స ఖర్చులను కవర్ చేసే అన్ని సాధారణ, ఆరోగ్య బీమా కంపెనీలు జారీ చేసే అన్ని ఆరోగ్య బీమా పాలసీలు కూడా పాలసీ ఒప్పందం నిబంధనలు, షరతుల ప్రకారం ఓమిక్రాన్ వేరియంట్‌కి చికిత్స ఖర్చులను కవర్ చేస్తాయని స్పష్టం చేసింది.