HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Speed News
  • >Team India Target In 2022

Team India:కొత్త ఏడాదిలో టీమిండియా టార్గెట్స్ ఇవే

భారత క్రికెట్‌ జట్టుకు గత ఏడాది మిశ్రమ ఫలితాలను మిగిల్చింది. దీంతో కొత్త ఏడాదిలో మరిన్ని విజయాలపై కన్నేసింది కోహ్లీసేన. టెస్ట్ ఫార్మేట్ వరకూ కొత్త ఏడాదిలో తొలి టార్గెట్ సఫారీ గడ్డపై సిరీస్ విజయం.

  • Author : Hashtag U Date : 03-01-2022 - 10:20 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Team India Cricket
Team India Cricket

భారత క్రికెట్‌ జట్టుకు గత ఏడాది మిశ్రమ ఫలితాలను మిగిల్చింది. దీంతో కొత్త ఏడాదిలో మరిన్ని విజయాలపై కన్నేసింది కోహ్లీసేన. టెస్ట్ ఫార్మేట్ వరకూ కొత్త ఏడాదిలో తొలి టార్గెట్ సఫారీ గడ్డపై సిరీస్ విజయం. సెంచూరియన్ టెస్టులో దక్షిణాఫ్రికాను చిత్తు చేసిన భారత్ సిరీస్‌లో 1-0 ఆధిక్యాన్ని అందుకుంది. ఇదే జోరు కొనసాగించి మిగిలిన రెండు టెస్టుల్లో ఒక్కటి గెలిచినా సఫారీ గడ్డపై చారిత్రక సిరీస్ విజయాన్ని కైవసం చేసుకుంటుంది. గత ఏడు పర్యాయాలు సఫారీ టూర్‌కూ వచ్చినా టెస్ట్ సిరీస్ విజయం మాత్రం అందని ద్రాక్షగా మిగిలింది. దీంతో ప్రస్తుత ఫామ్ చూస్తే ఈసారి సౌతాఫ్రికాలో సిరీస్ సాధించడం కోహ్లీసేన ముందున్న మొదటి లక్ష్యంగా చెప్పొచ్చు.

అలాగే కొత్త ఏడాదిలో భారత్‌ ముందున్న రెండో టార్గెట్ ఆసియాకప్‌. ఆసియా కప్ చరిత్రలోనే మోస్ట్ సక్సెస్‌ఫుల్ టీమ్‌గా రికార్డున్న భారత్ ఇప్పటి వరకూ ఏడుసార్లు టైటిల్ గెలుచుకుంది. గత రెండు పర్యాయాలు రోహిత్‌శర్మ కెప్టెన్సీలోనే ఆసియా కప్‌ను కైవసం చేసుకుంది. ఇప్పుడు వన్డే కెప్టెన్‌గా రోహిత్‌ పగ్గాలు అందుకున్న నేపథ్యంలో 2022 ఆసియాకప్‌లో ఆధిపత్యం కొనసాగించాలని భావిస్తోంది.

ఇంగ్లాండ్ గడ్డపై అరుదైన టెస్ట్ సిరీస్ విజయం కూడా భారత్‌ను ఊరిస్తోంది. గత ఏడాది ఐదు టెస్టుల సిరీస్‌లో టీమిండియా 2-1 ఆధిక్యంలో నిలిచింది. అయితే కోవిడ్ కారణంగా చివరి మ్యాచ్ వాయిదా పడింది. ఈ మ్యాచ్‌ను జూన్‌లో నిర్వహించేందుకు రెండు దేశాల బోర్డులు అంగీకరించాయి. ఆ సిరీస్‌కు కొనసాగింపుగానే జరగనున్న ఈ టెస్టును భారత్ డ్రా చేసుకున్నా ఇంగ్లాండ్‌ గడ్డపై టెస్ట్ సిరీస్‌ విజయాన్ని అందుకుంటుంది.

ఇదిలా ఉంటే ఆస్ట్రేలియా వేదికగా జరగనున్న టీ ట్వంటీ ప్రపంచకప్‌ భారత్‌కు సవాల్‌గానే చెప్పాలి. గత ఏడాది టీ ట్వంటీ ప్రపంచకప్‌లో పేలవ ప్రదర్శనతో కనీసం సెమీస్ కూడా చేరలేకపోయిన మన జట్టు ఈసారి మాత్రం టైటిల్ అందుకోవడమే లక్ష్యంగా బరిలోకి దిగబోతోంది. కొత్త కెప్టెన్‌ రోహిత్‌శర్మకు ఈ ఏడాది మేజర్ ఛాలెంజ్‌ ఇదే అనడంలో సందేహం లేదు. ఇక ఏడాది చివర్లో జరగనున్న బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ గెలవడం కూడా భారత్‌ ముందున్న మరో టార్గెట్. మొత్తం మీద తీరిక లేని క్రికెట్ షెడ్యూల్ మధ్య భారత జట్టు ఈ లక్ష్యాల్లో ఎన్ని అందుకుంటుందో వేచి చూడాలి.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • cricket
  • sports
  • team india

Related News

Womens T20 World Cup

మహిళల టీ20 వరల్డ్ కప్‌.. ప్రైజ్ మ‌నీ ఎంతంటే?

జూన్ 12 నుండి ప్రారంభం కానున్న మహిళల టీ20 వరల్డ్ కప్ కోసం ఐసీసీ 82.64 కోట్ల రూపాయల బహుమతి మొత్తాన్ని ప్రకటించింది.

    Latest News

    • Andhra Pradesh: ఏపీలో రూ.82.49 కోట్లతో ఫైవ్ స్టార్ హోటల్

    • వామ్మో చర్చి పాస్టర్‌ ఇంట్లో 2.27 కోట్లు

    • అక్షయ తృతీయ ఎప్పుడు? ఆ రోజు ఏం చేయాలి?!

    • టీ20 వ‌ర‌ల్డ్ క‌ప్ 2026లో మ్యాచ్ ఫిక్సింగ్‌?!

    • Rajinikanth: కోలీవుడ్‌లో మరో షాక్.. రజనీ ‘జైలర్ 2’ సీన్స్ లీక్!

    Trending News

      • ట్రంప్ కీల‌క వ్యాఖ్య‌లు.. ఇరాన్ వార్ ముగిసిన‌ట్లేనా?

      • గాయాల‌తో ఐపీఎల్‌కు దూర‌మ‌వుతున్న ఆట‌గాళ్లు!

      • సూర్య‌కుమార్ యాద‌వ్‌.. ఆడిన 5 మ్యాచ్‌ల్లో 106 పరుగులు మాత్రమే!

      • BJP MP Tejasvi Surya: ఏపీ విభజనపై ఎంపీ తేజస్వి సూర్య ఫైర్

      • అంపైర్ల పొరపాటు.. జరిమానా విధించాలని డిమాండ్!

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2026 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd