Delhi CM: కేజ్రీకి కరోనా.. స్వల్ప లక్షణాలతో హోమ్ ఐసోలేషన్!
- Author : Balu J
Date : 04-01-2022 - 11:30 IST
Published By : Hashtagu Telugu Desk
చాప కింద నీరులా కరోనా మహమ్మారి విస్తురిస్తూనే ఉంది. సామాన్యులు, సెలబ్రిటీలు, ప్రముఖులు అనే తేడా లేకుండా కొవిడ్ బారిన పడుతున్నారు. తాజాగా ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌కు కరోనా వైరస్ సోకింది. ఆయనకు స్వల్పంగా కోవిడ్ లక్షణాలు ఉన్నాయని, దీంతో హోమ్ ఐసోలేషన్‌లో ఉన్నట్లు ట్విటర్‌లో వెల్లడించారు. గత కొన్ని రోజుల నుంచి తనతోపాటు పలు కార్యక్రమాల్లో పాల్గొన్నవారంతా కరోనా నిర్ధారణ పరీక్షలు చేయించుకోవాలని తెలిపారు.
I have tested positive for Covid. Mild symptoms. Have isolated myself at home. Those who came in touch wid me in last few days, kindly isolate urself and get urself tested
— Arvind Kejriwal (@ArvindKejriwal) January 4, 2022