HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Sports
  • >Team India For Australia One Day Series In 2022

సఫారీలతో వన్డే సిరీస్.. ఆ నలుగురికి లాస్ట్ ఛాన్స్

ఐపీఎల్ మెగా వేలానికి టైమ్ దగ్గర పడుతోంది. ఫిబ్రవరి 12, 13 తేదీల్లో బెంగళూరు వేదికగా ఆటగాళ్ల వేలం జరగబోతోంది. దేశవాళీ క్రికెటర్లతో పాటు విదేశీ స్టార్ ప్లేయర్స్ అందరూ వేలంలో తమ అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నారు. గఅయితే భారత జట్టులో నలుగురు సీనియర్ క్రికెటర్లకు మాత్రం రానున్న సౌతాఫ్రికాతో వన్డే సిరీస్ పరీక్షగానే చెప్పాలి.

  • Author : Hashtag U Date : 04-01-2022 - 3:07 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Team India
Team India

ఐపీఎల్ మెగా వేలానికి టైమ్ దగ్గర పడుతోంది. ఫిబ్రవరి 12, 13 తేదీల్లో బెంగళూరు వేదికగా ఆటగాళ్ల వేలం జరగబోతోంది. దేశవాళీ క్రికెటర్లతో పాటు విదేశీ స్టార్ ప్లేయర్స్ అందరూ వేలంలో తమ అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నారు. గఅయితే భారత జట్టులో నలుగురు సీనియర్ క్రికెటర్లకు మాత్రం రానున్న సౌతాఫ్రికాతో వన్డే సిరీస్ పరీక్షగానే చెప్పాలి. ఐపీఎల్ వేలంలో మంచి ధర దక్కించుకోవాలంటే ఈ వన్డే సిరీస్ లో ఆ నలుగురు రాణించాల్సిందే. ఒక విధంగా ఆ నలుగురు సీనియర్ ప్లేయర్స్ కూ ఈ సిరీస్ చివరి అవకాశమని భావిస్తున్నారు. ఆ నలుగురిలో ముందు చెప్పుకోవాల్సింది ఓపెనర్ శిఖర్ ధావన్ గురించే. చాలా కాలంగా జాతీయ జట్టుకు దూరమైన ధావన్ ను సౌతాఫ్రికాతో సిరీస్ కు ఎంపిక చేశారు. గత 6 ఐపీఎల్ సీజన్లలోనూ 500కు పైగా పరుగులు చేసిన ధావన్ అంతర్జాతీయ క్రికెట్ లో ఫామ్ అందుకోవడం అతని కెరీర్ పరంగానూ ముఖ్యమే. గత సీజన్ వరకూ ఢిల్లీ క్యాపిటల్స్ కు ఆడిన ధావన్ కు ఆ ఫ్రాంచైజీ 5.2 కోట్లు చెల్లించింది. ఐపీఎల్ లో ఫామ్ ప్రకారం వేలంలో ధావన్ కు ఈ ధర మళ్ళీ రావాలంటే సఫారీ గడ్డపై మెరుపులు మెరిపించాల్సిందే.

మరో సీనియర్ ఆటగాడు భువనేశ్వర్ కుమార్ కు కూడా ఈ సిరీస్ చివరి అవకాశంగా చెప్పొచ్చు. ఒకప్పుడు భారత పేస్ దళంలో ప్రధాన బౌలర్ గా అదరగొట్టిన భువి తర్వాత గాయాలతో సతమతమై లైన్ అండ్ లెంగ్త్ కోల్పోయాడు. గత రెండు ఐపీఎల్ ఎడిషన్లలో కేవలం 9 వికెట్లు మాత్రమే తీయగలిగాడు భువనేశ్వర్. దీంతో సౌతాఫ్రికాతో వన్డే సిరీస్ లో రాణించకుంటే ఈ స్టార్ పేసర్ తక్కువ ధరకే పరిమితమవక తప్పదు. సన్ రైజర్స్ హైదరాబాద్ గత సీజన్ వరకూ 8.5 కోట్లు చెల్లించింది.మరోవైపు సీనియర్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ కు కూడా సఫారీలతో జరిగే వన్డే సిరీస్ కీలకం కానుంది. చాలా రోజుల తర్వాత మూడు ఫార్మేట్లలోనూ జాతీయ జట్టుకు ఆడుతున్నప్పటకీ గత ఐపీఎల్ సీజన్ లో పెద్దగా ప్రభావం చూపలేకపోయాడు. 13 మ్యాచ్ లలో కేవలం 7 వికెట్లు మాత్రమే పడగొట్టాడు. దీంతో ఐపీఎల్ ఫ్రాంచైజీలను ఆకట్టుకోవాలంటే సౌతాఫ్రికా గడ్డపై తన స్పిన్ మ్యాజిక్ చూపించాల్సిందే. గత సీజన్ వరకూ అశ్విన్ ఏడాదికి 7.6 కోట్లు అందుకున్నాడు.

ఇక రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మాజీ స్పిన్నర్ యజ్వేంద్ర చాహల్ కూడా సఫారీ గడ్డపై సత్తా చాటేందుకు ఎదురుచూస్తున్నాడు. ఐపీఎల్ 2021 సీజన్ లో రషీద్ ఖాన్ తో కలిసి అత్యధిక వికెట్లు తీసిన స్పిన్నర్ గా నిలిచిన చాహల్ వచ్చే మూడు సీజన్లలో మంచి ధర దక్కించుకోవాలంటే సౌతాఫ్రికాపై రాణించక తప్పదు. ఆర్సీబీ తరపున సీజన్ కు 6 కోట్లు అందుకున్న చాహల్ 114 ఐపీఎల్ మ్యాచ్ లలో 139 వికెట్లు పడగొట్టాడు. మొత్తం మీద దక్షిణాఫ్రికాతో జరిగే వన్డే సిరీస్ ఈ నలుగురి సీనియర్ల ఐపీఎల్ ధరను నిర్ణయిస్తుందనడంలో ఎటువంటి సందేహం లేదు.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • australia one day series
  • cricket
  • sports

Related News

Gautam Gambhir replied to MS Dhoni's

MS Dhoni : కోచ్ సాబ్.. మీ స్మైల్ సూపర్..ఎంఎస్ ధోనీ ఆసక్తికర పోస్ట్

MS Dhoni అహ్మదాబాద్ వేదికగా జరిగిన టీ20 ప్రపంచకప్ 2026 ఫైనల్‌లో న్యూజిలాండ్‌పై భారత్ 96 పరుగుల తేడాతో ఘన విజయం సాధించి విశ్వవిజేతగా నిలిచింది. ఈ చారిత్రక విజయం తర్వాత, భారత క్రికెట్‌లోని ఇద్దరు దిగ్గజాలైన మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ, ప్రస్తుత కోచ్ గౌతమ్ గంభీర్‌ల మధ్య సోషల్ మీడియాలో జరిగిన సంభాషణ అభిమానులను ఎంతగానో ఆకట్టుకుంటోంది. వారిద్దరి మధ్య ఉన్న పాత విభేదాల ఊహాగానాలకు ఈ సంఘటన

  • Suryakumar Yadav

    Suryakumar Yadav: సూర్యకుమార్ యాదవ్ ఆసక్తికర వ్యాఖ్యలు..నెక్ట్స్ టార్గెట్ ఒలింపిక్స్‌లో గోల్డ్ మెడల్

  • MS Dhoni's Reaction To Wife Sakshi

    బుమ్రా క్యాచ్ పట్టడంతో ఎగిరి గంతేసిన సాక్షి..ధోనీ రియాక్షన్ చూస్తే నవ్వులే

  • Sunil Gavaskar

    సెమీస్ ముందు ఇండియాకు గ‌వాస్క‌ర్ వార్నింగ్

Latest News

  • Sunstroke : వడదెబ్బతో చనిపోతే తెలంగాణ సర్కార్ రూ.4 లక్షల పరిహారం

  • Royal Stag Boom Box : రాయల్ స్టాగ్ బూమ్ బాక్స్‌తో హోరెత్తిన విశాఖ తీరం

  • టీమిండియా నెక్స్ట్ టార్గెట్ ఇదేనా?!

  • Myra : భారతీయ ప్రయాణికుల కోసం సరికొత్త టెక్నాలజీ

  • కొలెస్ట్రాల్ ఉందా? అయితే ఈ జ్యూస్ తాగండి!

Trending News

    • హనుమాన్ జన్మోత్సవం.. పూజా ముహూర్తం, పరిహారాలివే!

    • క‌న్నీళ్లు ఆపుకుని ఫైన‌ల్ మ్యాచ్ ఆడిన ఇషాన్ కిష‌న్‌!

    • Prabhakar Prasad: అమెరికా లో చాయ్ అమ్ముతూ ఇండియన్ ఎంత సంపాదిస్తున్నాడో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే !!

    • టీ20 వరల్డ్ కప్ ఫైనల్‌లో స‌రికొత్త రికార్డు క్రియేట్ చేసిన భార‌త్‌!

    • టీ20 వ‌ర‌ల్డ్ క‌ప్ ఫైన‌ల్‌లో చ‌రిత్ర సృష్టించిన శాంస‌న్‌!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd