Corona In TS:పెరుగుతున్న కరోనా కేసులకు బాధ్యత ఎవరు తీసుకోవాలి?
తెలంగాణ ప్రభుత్వం చేస్తున్న తప్పులకు ప్రజలు బలికావాల్సి వస్తోంది. పెరుగుతున్న కరోనా కేసుల దృష్ట్యా పలు రాష్ట్రాలు వీకెండ్ లక్డౌన్, ఆంక్షలు విధించి కరోనాను కట్టడి చేస్తోంటే తెలంగాణ ప్రభుత్వం మాత్రం అత్యంత బాధ్యత రాహిత్యంగా ప్రవర్తించి కేసులు పెరగడానికి కారణంగా మారుతోంది.
- Author : Siddartha Kallepelly
Date : 04-01-2022 - 11:29 IST
Published By : Hashtagu Telugu Desk
తెలంగాణ ప్రభుత్వం చేస్తున్న తప్పులకు ప్రజలు బలికావాల్సి వస్తోంది. పెరుగుతున్న కరోనా కేసుల దృష్ట్యా పలు రాష్ట్రాలు వీకెండ్ లక్డౌన్, ఆంక్షలు విధించి కరోనాను కట్టడి చేస్తోంటే తెలంగాణ ప్రభుత్వం మాత్రం అత్యంత బాధ్యత రాహిత్యంగా ప్రవర్తించి కేసులు పెరగడానికి కారణంగా మారుతోంది.
న్యూ ఈయర్ వేడుకల్లో మాస్ గ్యాదరింగ్ ఉండే అవకాశముంటుంది కాబట్టి ఆ సమయంలో లక్డౌన్ పెట్టమని కనీసం ఆంక్షలైనా పెట్టాలని వైద్యులు సూచించారు. కానీ ప్రభుత్వం మాత్రం ఈవెంట్స్ కి పర్మిషన్ ఇవ్వడమే కాకుండా, వైన్స్ బార్ల టైమింగ్స్ కూడా పెంచింది. ఫలితంగా దాదాపు 7 నెలల తర్వాత తెలంగాణలో కరోనా కేసుల సంఖ్య పెరుగుతోంది.
మంగళవారం అయితే తెలంగాణలో కరోనా కేసులు తీవ్రంగా పెరిగాయి. చాలా రోజుల తర్వాత కరోనా కేసుల సంఖ్య వెయ్యి దాటింది. రాష్ట్రంలో ఒక్కరోజే 1052 కరోనా కేసులు నమోదైనట్లు వైద్యారోగ్యశాఖ తెలిపింది. ఇక కరోనా వల్ల ఇద్దరు మృతి చెందగా 240 మంది కోలుకున్నట్లు తెలిపారు. ప్రస్తుతం రాష్ట్రంలో 4,858 యాక్టివ్ కేసులు ఉన్నట్లు వివరించారు.
మరోవైపు రాష్ట్రంలో ఓమిక్రాన్ కేసులు కూడా రోజురోజుకి పెరుగుతున్నాయి. మంగళవారం ఒక్కరోజే పది ఓమిక్రాన్ కేసులు నమోదైనట్లు తేలింది.
కేసులు పెరగడానికి ప్రధాన కారణం న్యూ ఈయర్ వేడుకలని తెలుస్తోంది. న్యూ ఈయర్ నుండి కేసులు పెరుగుతున్నయని ఆరోజు జరిగిన ఈవెంట్స్ లో మాస్ గ్యాదరింగ్ వల్లే వైరస్ వ్యాప్తి చెందిందని, న్యూ ఈయర్ వేడుకలకు చాలామంది యువకులు గోవా లాంటి ప్రాంతాలకు వెళ్ళొచ్చారని అలాంటి కారణాలు కూడా కేసులు పెరగడానికి కారణమని వైద్యులు అభిప్రాయపడుతున్నారు. వైరస్ పెరిగితే ప్రజలు అన్ని రకాలుగా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని వైద్యులు పేర్కొన్నారు. ప్రభుత్వ అనాలోచిత నిర్ణయాల వల్లే కేసులు పెరుగుతున్నాయని, ఇప్పటికైనా కేసుల కట్టడికి ప్రభుత్వం సీరియస్ నిర్ణయాలు తీసుకోవాలని వైద్యులు కోరుతున్నారు.

Firbessveaejmhn Imresizer