Delhi: జగన్ ను కలిసిన ఆమ్రపాలి
- By hashtagu Published Date - 01:11 PM, Tue - 4 January 22

ప్రధానమంత్రి కార్యాలయం(PMO) లో డిప్యూటీ సెక్రటరీగా పని చేస్తున్న ఆమ్రపాలి ఢిల్లీ పర్యటనలో వున్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ని కలుసుకున్నారు. ఢిల్లీలోని జగన్ నివాసానికి వెళ్లి, ఆయనతో కాసేపు భేటీ అయ్యారు. విశాఖపట్నంకు చెందిన ఆమ్రపాలి ఏపీ కేడర్ ఐఏఎస్ అధికారిణి. అయితే రాష్ట్ర విభజన తర్వాత ఆమె ఏపీ నుంచి తెలంగాణ కేడర్ కు మారారు. ప్రస్తుతం ప్రధాని మోదీ కార్యాలయంలో డిప్యూటీ సెక్రటరీగా ఆమె పనిచేస్తున్నారు.