Speed News
-
Kavitha : వెలుగుమట్ల, ట్రిపుల్ ఆర్ బాధితులతో గవర్నర్‌ను కలిసిన టీఆర్ఎస్ అధ్యక్షురాలు కవిత
తెలంగాణ రక్షణ సేన (టీఆర్ఎస్) అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత, ధర్మ సమాజ్ పార్టీ అధ్యక్షుడు విశారదన్ మహారాజ్, వెలుగుమట్ల, ట్రిపుల్ ఆర్, పరిగి బాధితులతో కలిసి తెలంగాణ గవర్నర్ శివప్రతాప్ శుక్లాను మంగళవారం లోక్ భవన్‌లో కలిశారు. భూ బాధితులకు న్యాయం చేయాలని కోరుతూ గవర్నర్‌కు వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా వెలుగుమట్లలో ఇళ్ల కూల్చివేతలు, ట్రిపుల్ ఆర్ అలైన్‌మెంట్ మార్పులు,
Date : 26-05-2026 - 2:42 IST -
YS Sharmila : రాజారెడ్డి, YSR పేర్లపై రాజకీయాలు చేయొద్దు.. టీడీపీకి షర్మిల కౌంటర్
దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి, వైఎస్ రాజారెడ్డి పేర్లను రాజకీయంగా ఉపయోగిస్తున్నారంటూ టీడీపీపై వైఎస్ షర్మిల తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. తమపై జరుగుతున్న ప్రచారం రాజకీయ అక్కసుతో చేస్తున్నదేనని ఆమె ఆరోపించారు. దివంగతులపై ఆరోపణలు చేస్తూ రాజకీయ లబ్ధి పొందాలని ప్రయత్నించడం సరికాదని షర్మిల పేర్కొన్నారు. నిజంగా ఆరోపణల్లో వాస్తవం ఉంటే గతంలో అధికారంలో
Date : 26-05-2026 - 2:32 IST -
Janasena : రాయలసీమపై జనసేన ఫోకస్.. బాలినేనికి కీలక బాధ్యతలు?
రాయలసీమ ప్రాంతంలో పార్టీ బలోపేతంపై జనసేన అధిష్ఠానం దృష్టి సారించించింది. ఈ క్రమంలో సీనియర్ నాయకుడు బాలినేని శ్రీనివాసరెడ్డి సేవలను రాయలసీమలో వినియోగించుకోవాలని పార్టీ అధిష్టానం భావిస్తుంది. ఉమ్మడి ప్రకాశం జిల్లా కమిటీ రద్దు తర్వాత ఈ పరిణామం ప్రాధాన్యత సంతరించుకుంది. పార్టీ సంస్థాగత నిర్మాణాన్ని బలోపేతం చేయడం, కేడర్ విస్తరణను వేగవంతం చేయడం లక్ష్యంగా జనసేన
Date : 26-05-2026 - 1:21 IST -
HYDRAA : కోకాపేటలో హైడ్రా యాక్షన్.. ఎఫ్‌టీఎల్ పరిధిలో అక్రమ నిర్మాణాల తొలగింపు
హైదరాబాద్‌లో హైడ్రా దూకుడు కొనసాగిస్తుంది. గండిపేట్ మండలం కోకాపేటలోని కొత్త చెరువు పరిధిలో హైడ్రా (HYDRAA) అధికారులు మెరుపు దాడులు నిర్వహించారు. చెరువు FTL, బఫర్ జోన్ పరిధిలో అక్రమంగా నిర్మించిన భారీ కాంపౌండ్ వాల్స్, తాత్కాలిక కట్టడాలను అధికారులు తెల్లవారుజామున జేసీబీల సహాయంతో కూల్చివేశారు. భారీ పోలీసు బందోబస్తు మధ్య చేపట్టిన ఈ ఆకస్మిక ఆపరేషన్‌తో స్థానికంగా కలకలం రేగి
Date : 26-05-2026 - 12:56 IST -
Telangana : కొత్త డిజైన్లతో ఇందిరమ్మ చీరలు.. లబ్ధిదారులకు త్వరలో అందుబాటులోకి
రాష్ట్రవ్యాప్తంగా మహిళా సంఘాలకు పంపిణీ చేయనున్న ఇందిరమ్మ చీరల సరికొత్త డిజైన్లను తెలంగాణ ప్రభుత్వం విడుదల చేసింది. మహిళా సంక్షేమం, సాధికారత కార్యక్రమాల్లో భాగంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ కొత్త నమూనాలను అధికారికంగా ఆవిష్కరించారు. ఇందిరమ్మ చీరల పథకంలో భాగంగా ఈసారి కొత్త డిజైన్లు, ఆకర్షణీయమైన రంగుల కలయికలతో చీరలను రూపొందించినట్లు అధికారులు తెలిపారు. ఈ కార్యక్రమం
Date : 26-05-2026 - 12:46 IST -
IPS Officers : కోయంబత్తూరు బాలిక కేసు దర్యాప్తులో ఐపీఎస్ అధికారుల వింత ప్రవర్తన.. ముగ్గురు సస్పెండ్
కోయంబత్తూరు బాలికపై దాడి కేసులో మీడియా సమావేశం సందర్భంగా ఐపీఎస్ అధికారుల ప్రవర్తన తీరు వివాదస్పదమైంది. ఈ వివాదంలో విమర్శలు ఎదుర్కొన్న ముగ్గురు ఐపీఎస్ అధికారులను తమిళనాడు ప్రభుత్వం సస్పెండ్ చేసింది. సోషల్ మీడియాలో వైరల్ అయిన వీడియోలతో ప్రభుత్వం చర్యలకు ఉపక్రమించింది కోయంబత్తూరు జిల్లాలో 10 ఏళ్ల బాలికను అపహరించి లైంగిక వేధింపులకు గురిచేసిన ఘటన రాష్ట్ర
Date : 26-05-2026 - 10:51 IST -
CNG Price Hike :పెట్రోల్ నుంచి సీఎన్‌జీ వరకు.. వరుస ధరల పెంపులతో సామాన్యుడికి షాక్
దేశవ్యాప్తంగా ఇంధన ధరలు మరోసారి పెరగడంతో వినియోగదారులపై భారం మరింత పెరిగింది. ఢిల్లీలో మంగళవారం నుంచి కంప్రెస్డ్ నేచురల్ గ్యాస్ (CNG) ధరలను కిలోకు రూ.2 పెంచడంతో, ప్రస్తుతం కిలో ధర రూ.83.09కి చేరింది. గత 15 రోజుల్లో సీఎన్‌జీ ధరలు నాలుగోసారి పెరగడం గమనార్హం. ఇటీవల కిలోకు రూ.1 పెంచిన కొద్ది రోజులకే మరోసారి ధరలు పెంచడం వినియోగదారుల్లో ఆందోళన కలిగిస్తోంది. ఢిల్లీతో పాటు దేశంలోని ప్ర
Date : 26-05-2026 - 9:56 IST -
Telangana : తెలంగాణలో రుతుపవనాలు మరింత ఆలస్యం
నైరుతి రుతుపవనాలు జూన్ 5 తర్వాతే తెలంగాణ రాష్ట్రంలోకి ప్రవేశించే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ తెలిపింది. ఎల్ నినో ప్రభావం కారణంగా రుతుపవనాల కదలిక మందగించిందని.. ఈ ఏడాది సాధారణం కంటే తక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని ఐఎమ్‌డి పేర్కొంది. సాధారణంగా నైరుతి రుతుపవనాలు ఈ నెలాఖరుకు రాష్ట్రంలోకి ప్రవేశించే అవకాశం ఉన్నప్పటికీ.. ఎల్ నినో ప్రభావం కారణంగా అవి జూన్ 5 నుంచి 10 మధ్
Date : 26-05-2026 - 9:22 IST -
ACB Raids : మాజీ ఏపీ భవన్ అధికారి ఇళ్లలో ఏసీబీ సోదాలు.. కోట్ల విలువైన అక్రమ ఆస్తుల గుర్తింపు
న్యూఢిల్లీలోని ఆంధ్రప్రదేశ్ భవన్ మాజీ స్పెషల్ ఆఫీసర్ కడూరు చిన్నప్పన్నకు భారీగా అక్రమ ఆస్తులు ఉన్నట్లు ఆరోపణలు ఉన్నాయి. ఆదాయానికి మించిన ఆస్తులు కూడబెట్టిన ఆరోపణలపై ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించారు. చిన్నప్పన్న అక్టోబర్ 2019 నుంచి ఏపీ భవన్‌లో స్పెషల్ లైజనింగ్ ఆఫీసర్‌గా విధులు నిర్వర్తించగా, ఆయన పదవీకాలం జూన్ 2024 వరకు పొడిగించబడింది. ఈ సమయంలో తన పేరుతో పాటు క
Date : 26-05-2026 - 9:07 IST -
Kerala CM : నేడు ప్రధాని మోదీతో కేరళ సీఎం భేటీ.. పలు కీలక అంశాలపై చర్చ
కేరళ ముఖ్యమంత్రి వి.డి. సతీశన్ నేడు న్యూఢిల్లీలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీని కలవనున్నారు. ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత ప్రధాని మోదీని ఆయన తొలిసారి కలవనుండటంతో దీనికి రాజకీయ ప్రాధాన్యత ఏర్పడింది. కేరళలో యునైటెడ్ డెమోక్రటిక్ ఫ్రంట్ (యూడీఎఫ్) ప్రభుత్వం ఇటీవల అధికారంలోకి వచ్చిన నేపథ్యంలో ఈ భేటీ ఆసక్తికరంగా మారింది. అధికారికంగా సమావేశ అజెండా వెల్లడి
Date : 26-05-2026 - 8:48 IST -
Accident : ఇబ్రహీంపట్నంలో తప్పిన పెను ప్రమాదం.. డివైడర్‌పైకి ఎక్కిన సితార ట్రావెల్స్ బస్సు
ఇబ్రహీంపట్నం కూలింగ్ కెనాల్ వంతెన వద్ద పెను ప్రమాదం తృటిలో తప్పింది. విజయవాడ వైపు వెళ్తున్న ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు అదుపుతప్పి డివైడర్‌పైకి ఎక్కడంతో ప్రయాణికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. అయితే బస్సులో ఉన్న 38 మంది ప్రయాణికులు సురక్షితంగా బయటపడటంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. AP 39 TK 3741 నంబర్ గల సితార ట్రావెల్స్ బస్సు విజయవాడ వైపు ప్రయాణిస్తుండగా.. ఇబ్రహీంపట్నం కూలిం
Date : 26-05-2026 - 8:39 IST -
Gunturu : గుంటూరు రైల్వే స్టేషన్ పరిసరాల్లో అనుమానాస్పదంగా తిరుగుతన్న వ్యక్తులు.. స్థానికుల్లో ఆందోళన
గత రెండు రోజులుగా గుంటూరులో ఇతర రాష్ట్రాల నుండి వచ్చిన కొంతమంది అనుమానస్పదంగా తిరుగుతుడటం స్థానికుల్లో ఆందోళన కలిగిస్తుంది.. వీరంతా పెద్ద సంఖ్యలో ప్రజలు గుంటూరు రైల్వే స్టేషన్ సమీపంలో కనిపిస్తున్నారు. పగలంతా రోడ్లపై తిరుగుతూ, రాత్రిపూట స్టేషన్ దగ్గరే ఉంటున్నారు. ముఖ్యంగా వీరిలో మహిళలు అధిక సంఖ్యలో కనిపిస్తున్నారు. వారితో పాటు వచ్చిన పురుషులు ఎక్కడివారనే దాన
Date : 25-05-2026 - 10:45 IST -
Road Accident : నిజామాబాద్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం
నిజామాబాద్ జిల్లాలోని ఇందల్వాయి మండలం, జాతీయ రహదారి 44పై చంద్రాయనపల్లి వద్ద వాహనాలు ఒకదానికొకటి ఢీకొన్నాయి. రహదారిపై అతివేగంగా ప్రయాణిస్తున్న ఒక లారీ టైరు అకస్మాత్తుగా పగిలిపోవడంతో, ఆ లారీ రోడ్డుపైనే ఒక్కసారిగా ఆగిపోయింది. దీంతో లారీ వెనుక వస్తున్న వాహనాలు వరుసగా ఒకదానికొకటి ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో మొత్తం ఏడు కార్లు అతివేగంగా ఢీకొన్నాయి. అదే సమయంలో, కార్ల వెనుక నుండ
Date : 25-05-2026 - 10:33 IST -
HYD : హోటళ్లలో తనిఖీలు చేసిన ఫుడ్ సేఫ్టీ అధికారులు.. వెలుగులోకి ఆందోళనకర అంశాలు
సైబరాబాద్ పరిధిలో ఆహార భద్రత ప్రమాణాలను పర్యవేక్షించే చర్యల్లో భాగంగా సీఎంసీ (CMC) ఫుడ్ సేఫ్టీ బృందాలు మాధాపూర్‌లోని ఒక రెస్టారెంట్‌లో తనిఖీలు నిర్వహించాయి. ఈ తనిఖీల్లో పలు ఆందోళనకర అంశాలు వెలుగులోకి వచ్చాయి. తనిఖీల సమయంలో సిబ్బంది ఏప్రాన్లు, హెయిర్‌నెట్స్ ధరించి పరిశుభ్రతా నిబంధనలు పాటిస్తున్నట్లు గుర్తించిన అధికారులు.. మరోవైపు ఆహార నిల్వలు, భద్రత విషయంలో పలు లోపాల
Date : 25-05-2026 - 9:50 IST -
AP : ఎంఎస్ఎంఈ గ్రోత్ సమ్మిట్ – 2026లో కీలక ఒప్పందాలు చేసుకున్న ఏపీ ప్రభుత్వం
ఎంఎస్ఎంఈ గ్రోత్ సమ్మిట్ 2026లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సూక్ష్మ, చిన్న మధ్యతరహా పరిశ్రమల అభివృద్ధికి కీలక అడుగులు వేసింది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు 38 కొత్త ఎంఎస్ఎంఈ పార్కులకు శంకుస్థాపన చేశారు. అనంతరం స్టార్టప్‌లు, ఎంఎస్ఎంఈల ప్రోత్సాహానికి వివిధ సంస్థలతో ప్రభుత్వం పలు కీలక ఒప్పందాలు కుదుర్చుకుంది. ఆర్టీఐహెచ్ ఆధ్వర్యంలో గ్రామీణ ప్రాంతాల్లో ఏర్పాటు చేస్తున్న ర
Date : 25-05-2026 - 9:29 IST -
Girl Missing : టెక్నాలజీతో మిస్సింగ్ బాలిక ఆచూకీ.. 25 నిమిషాల్లో గుర్తించిన ఎన్‌టీఆర్ జిల్లా పోలీసులు
అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగిస్తూ ఎన్‌టీఆర్ జిల్లా పోలీసులు మరోసారి తమ సత్తాని చాటారు. విశాఖపట్నం జిల్లా గాజువాక పోలీస్ స్టేషన్ పరిధిలో నమోదైన మిస్సింగ్ కేసులోని బాలికను ఫేషియల్ రికగ్నిషన్ సిస్టమ్ (FRS) సాయంతో గుర్తించి కేవలం 25 నిమిషాల్లో క్షేమంగా అదుపులోకి తీసుకున్నారు. ఈ నెల 24వ తేదీన గాజువాక పోలీస్ స్టేషన్‌లో నమోదైన మిస్సింగ్ కేసుకు సంబంధించిన బాలిక వ
Date : 25-05-2026 - 8:18 IST -
Murder : భర్తను హత్య చేసిన భార్య.. వడదెబ్బ అంటూ డ్రామా..!
ఇటీవల కాలంలో భార్య చేతిలో భర్తలు హత్యకు గురవుతున్నారు. వివాహేతర సంబంధాల కారణాలతోనే పలు హత్యలు జరిగిన సంగంతి తెలిసింది. తాజాగా వడదెబ్బ ముసుగులో ఓ మహిళ తన భర్తను హత్య చేసిన ఘటన వెలుగులోకి వచ్చింది. విశాఖపట్నం భీమిలి మండలంలో నాగమణి అనే మహిళ తన భర్త సూరిబాబును చున్నీతో మెడ బిగించి హత్య చేసింది. అనంతరం వడదెబ్బతో పడిపోయాడని నమ్మించి ఆసుపత్రికి తీసు
Date : 25-05-2026 - 8:11 IST -
AIADMK: అన్నాడీఎంకేకు షాక్..ముగ్గురు ఎమ్మెల్యేల రాజీనామా
తమిళనాడు రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. ప్రతిపక్ష అన్నాడీఎంకేకు చెందిన ముగ్గురు ఎమ్మెల్యేలు తమ పదవులకు రాజీనామా చేసి, ముఖ్యమంత్రి విజయ్ నేతృత్వంలోని అధికార తమిళగ వెట్రి కళగంలో (టీవీకే) చేరారు. ఈ పరిణామం రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. మధురాంతకం ఎమ్మెల్యే మరగతం కుమార్వేల్, ధరాపురం ఎమ్మెల్యే సత్యభామ, పెరుందురై ఎమ్మెల్యే జయకుమార్ తమ రాజీనామా
Date : 25-05-2026 - 4:34 IST -
Nirmala Sitharaman: ఆర్థిక సవాళ్లపై నిర్మలా సీతారామన్ కీలక వ్యాఖ్యలు
దేశంలో ఇంధన ధరలు మరోసారి పెరగడంపై కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ సోమవారం స్పందించారు. పెట్రోల్, డీజిల్‌పై ఎక్సైజ్ సుంకాలను తగ్గిస్తే ప్రభుత్వం దాదాపు రూ.లక్ష కోట్ల ఆదాయం నష్టపోతుందని వెల్లడించారు. పశ్చిమాసియా సంక్షోభం కారణంగా అంతర్జాతీయంగా సవాళ్లు ఎదురవుతున్నప్పటికీ దేశ ఆర్థిక వ్యవస్థ పటిష్ఠంగా ఉందన్నారు. కొందరు పనిగట్టుకొని ప్రజల్లో భయాందోళనలు సృష్
Date : 25-05-2026 - 3:07 IST -
ORR CAR : స్పీడ్ మోజు.. ఓఆర్ఆర్‌పై 200 కి.మీ వేగంతో కార్ డ్రైవింగ్
ఓ యువకుడి స్పీడ్ మోజు చివరకు కటకటాలపాలు చేసింది. నగరంలోని ఔటర్ రింగ్ రోడ్ (ORR)పై గంటకు 200 కిలోమీటర్లకు పైగా వేగంతో కారు నడిపి, ఆ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో పోలీసులు కేసు నమోదు చేసి అరెస్టు చేశారు. ఈ ఘటన మే 19న జరిగినప్పటికీ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో పోలీసులు విచారణ చేపట్టారు. విచారణలో నిందితుడు అల్కాపూర్‌కు చెందిన శ్రీకరింగుల సాయిరామ్‌గా గుర్తించారు.
Date : 25-05-2026 - 1:19 IST