HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Telangana
  • >Driving At 200 Kmph On Orr Thrill Of Speed

ORR CAR : స్పీడ్ మోజు.. ఓఆర్ఆర్‌పై 200 కి.మీ వేగంతో కార్ డ్రైవింగ్‌

  • Author : Prasad Date : 25-05-2026 - 1:19 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Orr Car
Orr Car

ఓ యువకుడి స్పీడ్ మోజు చివరకు కటకటాలపాలు చేసింది. నగరంలోని ఔటర్ రింగ్ రోడ్ (ORR)పై గంటకు 200 కిలోమీటర్లకు పైగా వేగంతో కారు నడిపి, ఆ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో పోలీసులు కేసు నమోదు చేసి అరెస్టు చేశారు. ఈ ఘటన మే 19న జరిగినప్పటికీ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో పోలీసులు విచారణ చేపట్టారు. విచారణలో నిందితుడు అల్కాపూర్‌కు చెందిన శ్రీకరింగుల సాయిరామ్‌గా గుర్తించారు. నర్సింగి టోల్‌గేట్ నుంచి అప్పా జంక్షన్ వైపు సుమారు గంటకు 200 కిలోమీటర్ల వేగంతో కారు నడిపినట్లు పోలీసులు వెల్లడించారు. సోషల్ మీడియాలో షేర్ చేసిన వీడియోలో సాయిరామ్ ప్రమాదకరంగా అతివేగంతో వాహనం నడుపుతూ కనిపించాడు. టోల్ టికెట్ తీసుకున్న అనంతరం కారుని 200 కిమీ వేగంతో డ్రైవ్ చేశాడు. డ్రైవ్ చేసే ట‌ప్పుడు కారులో సాంగ్స్ పెద్ద సౌండ్ పెట్టుకుని డ్రైవ్ చేశాడు.

ఈ వీడియోను అతను తన సోషల్ మీడియా హ్యాండిల్ **”runningeagle310″**లో పోస్ట్ చేశాడు. సోష‌ల్ మీడియా వీడియో ఆధారాల ఆధారంగా పోలీసులు సాయిరామ్‌ను అరెస్టు చేసి, అతని కారును స్వాధీనం చేసుకున్నారు. ప్రజల భద్రతకు ప్రమాదం కలిగించేలా వ్యవహరించినందుకు అతనిపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. అయితే అత‌ను 200 కి.మీ వేంగంతో డ్రైవ్ చేస్తూ సోష‌ల్ మీడియాలో పెట్టేదాకా పోలీసుల‌కు తెలియ‌క‌పోవ‌డంపై నెటిజ‌న్లు ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు. ఓఆర్ఆర్‌పై స్పీడ్ గ‌న్లు ఎమైయ్యాయ‌ని నెటిజ‌న్లు ప్ర‌శ్నిస్తున్నారు. వరుస ప్రమాదాలు జరుగుతున్నా ఔటర్ రింగ్ రోడ్ పై పోలీసుల నిఘా లేక‌పోవడం ఆందోళ‌న క‌లిగించేలా ఉంద‌ని వాహ‌న‌దారులు, నెటిజ‌న్లు ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు.

 


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • 200 km
  • ORR
  • ORR Car
  • Speed
  • telangana

Related News

Online Petrol

Petrol Price : మ‌రోసారి పెరిగిన పెట్రోల్, డీజిల్ ధ‌ర‌లు.. ప‌దిరోజుల్లో నాలుగు సార్లు

దేశ వ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ ధ‌ర‌లు మ‌రోసారి భారీగా పెరిగాయి. గ‌త ప‌దిరోజుల్లో నాలుగు సార్లు పెట్రోల్‌, డిజిల్ ధ‌ర‌లు పెరిగాయి. లీట‌ర్ పెట్రోల్‌పై రూ. 2.84, లీట‌ర్ డీజిల్ పై రూ.2.86 చొప్పున పెరిగింది. పెరిగిన ధ‌ర‌లు ఈ రోజు ఉద‌యం 6గంట‌ల నుంచి అమ‌లవుతున్నాయి. పెరిగిన ఇంధ‌న ధ‌ర‌లు సామాన్య ప్ర‌జ‌ల‌పై మ‌రింత ప్ర‌భావం చూపనుంది. పశ్చిమ ఆసియా యుద్ధం కారణంగా భారతదేశంలోని ప్రభుత్వ ర

  • Fire Accidnet

    FIRE ACCIDENT : ఎల్ అండ్ టీ కార్యాల‌యంలో అగ్నిప్ర‌మాదం

  • Cm Convoy

    CM Revanth Reddy : సీఎం రేవంత్ కాన్వాయ్‌లోని వాహ‌నాలు తగ్గింపు

  • Bus Accident

    Road Accident : కోదాడ స‌మీపంలో లారీని ఢీకొట్టిన ప్ర‌వేట్ ట్రావెల్స్ బ‌స్సు

  • 34 Dead Due to Heatstroke in Telangana

    Sunstroke: తెలంగాణలో వడదెబ్బతో 34 మంది మృతి

Latest News

  • Avika Gor: లుక్ కోసం సర్జరీ: అవికా గోర్

  • ORR CAR : స్పీడ్ మోజు.. ఓఆర్ఆర్‌పై 200 కి.మీ వేగంతో కార్ డ్రైవింగ్‌

  • fake news: లిక్కర్ కేసులో నా భార్యకు నోటీసులు రావడం అంతా అబద్ధం.. కేశినేని చిన్ని !

  • Chiranjeevi: ఎగ్జిబిటర్లకు చిరంజీవి బిగ్ షాక్

  • AP Liqour Scam : లిక్క‌ర్ స్కాం కేసు.. విజ‌య‌వాడ ఎంపీ కేశినేని చిన్ని భార్య‌కు ఈడీ నోటీసులు

Trending News

    • Cm Vijay: కోయంబత్తూరులో పదేళ్ల బాలిక కిడ్నాప్, హత్య..సీఎం విజయ్ ఎమోషనల్ పోస్ట్!

    • Iran: ఇరాన్‌ గగనతలం మూసివేత.. అమెరికా దాడుల హెచ్చరికలు

    • Oil Crisis: సంక్షోభం రాబోతుంది.. ‘రెడ్‌ జోన్‌’లోకి చమురు మార్కెట్‌

    • Silver Chappal: అల్లుడికి అత్తింటివారు కిలోన్నర వెండి చెప్పులు

    • Beer Price Drop: మందుబాబులకు కిక్కిచ్చే న్యూస్..రూ.185 బీర్ ధర రూ.110 కి..70 రూ .ల తగ్గింపు

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd