HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Andhra Pradesh
  • >Acb Raids In Ex Ap Bhavan Officer Houses

ACB Raids : మాజీ ఏపీ భవన్ అధికారి ఇళ్ల‌లో ఏసీబీ సోదాలు.. కోట్ల విలువైన అక్రమ ఆస్తుల గుర్తింపు

  • Author : Prasad Date : 26-05-2026 - 9:07 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
ACB raids
ACB raids

న్యూఢిల్లీలోని ఆంధ్రప్రదేశ్ భవన్ మాజీ స్పెషల్ ఆఫీసర్ కడూరు చిన్నప్పన్నకు భారీగా అక్ర‌మ ఆస్తులు ఉన్న‌ట్లు ఆరోప‌ణ‌లు ఉన్నాయి. ఆదాయానికి మించిన ఆస్తులు కూడబెట్టిన ఆరోపణలపై ఏసీబీ అధికారులు దాడులు నిర్వ‌హించారు. చిన్నప్పన్న అక్టోబర్ 2019 నుంచి ఏపీ భవన్‌లో స్పెషల్ లైజ‌నింగ్‌ ఆఫీసర్‌గా విధులు నిర్వర్తించగా, ఆయన పదవీకాలం జూన్ 2024 వరకు పొడిగించబడింది. ఈ సమయంలో తన పేరుతో పాటు కుటుంబ సభ్యులు, ఇతరుల పేర్లపై కూడా ఆస్తులు కొనుగోలు చేసినట్లు ఏసీబీ అధికారులు అనుమానిస్తున్నారు. విశాఖపట్నం, విజయనగరం, రాజమండ్రి, తాడేపల్లి, కృష్ణలంక, విజయవాడ ప్రాంతాల్లో ఆదివారం, సోమవారం ఏకకాలంలో సోదాలు చేపట్టారు. ఈ తనిఖీల్లో విశాఖపట్నంలోని తగరపువలసలో ఐదు ప్లాట్లు, అనకాపల్లి జిల్లా పరవాడ మండలం మర్రిపాలెంలో మూడు ప్లాట్లు, రుషికొండలోని పెబుల్ బీచ్ టవర్స్‌లో ఫ్లాట్ కొనుగోలు ఒప్పందం, అలాగే విశాఖపట్నంలో మరో ఫ్లాట్‌ను అధికారులు గుర్తించారు. అంతేకాకుండా జెరోధా బ్రోకింగ్ లిమిటెడ్‌లో సుమారు రూ.45.15 లక్షల పెట్టుబడులు, రెండు వాహనాలను కూడా అధికారులు గుర్తించినట్లు సమాచారం. ఈ ఆస్తుల విలువ కోట్ల రూపాయల్లో ఉంటుందని అంచనా వేస్తున్నారు. కేసుకు సంబంధించిన పూర్తి వివరాలను సేకరిస్తున్న ఏసీబీ అధికారులు దర్యాప్తును కొనసాగిస్తున్నారు.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • ACB
  • acb raids
  • andhra pradesh
  • ap
  • delhi
  • Ex Ap Bhavan Officer

Related News

Complaint filed against actor Prakash Raj at the police station.

Prakash Raj: నటుడు ప్రకాష్ రాజ్ పై పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు

ప్రముఖ నటుడు ప్రకాశ్ రాజ్‌పై ఆంధ్రప్రదేశ్ బీజేపీ ఉపాధ్యక్షుడు విష్ణువర్ధన్ రెడ్డి, ఇతర బీజేపీ నేతలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. హిందూ సమాజాన్ని కించపరిచేలా, కుల, మత విద్వేషాలను రెచ్చగొట్టేలా ప్రకాశ్ రాజ్ వ్యాఖ్యలు చేస్తున్నారని ఆరోపిస్తూ కదిరి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు దాఖలు చేసినట్లు బీజేపీ నేతలు తెలిపారు. ఈ మేరకు చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరారు. విష్ణువర్ధన

  • Vip Break Darshan For 116 Y

    TTD : 116 ఏళ్ల భక్తికి టీటీడీ గౌరవం .. నవనీతమ్మకు వీఐపీ బ్రేక్ దర్శనం : బీఆర్‌ నాయుడు

  • Big shock for YouTuber Ravan

    YouTuber Ravan : యూట్యూబర్‌ రావణ్‌పై ‘ఉపా’ చట్టం కింద కేసు నమోదు

  • Tender coconut claims a life

    ప్రాణం తీసిన కొబ్బరి బొండం

  • Another 'corrupt whale' caught in the ACB net: Bundles of cash and gold found at DSP Bhimreddy's house.

    ACB Raids: ఏసీబీ వలలో మరో అవినీతి తిమింగలం.. డీఎస్పీ భీంరెడ్డి ఇంట్లో కట్టల కొద్దీ నోట్లు, బంగారం

Latest News

  • Revanth Reddy: “తాత.. నువ్వు పూరీలు వేస్తేనే తింటాను”

  • Bandi Bhageerath: బండి భగీరథ్‌కు హైకోర్టు బెయిల్ మంజూరు

  • BSNL శాటిలైట్ ఫోన్‌ను విడుదల చేసింది

  • Musi Riverfront: మూసీ పునరుజ్జీవనానికి గ్రీన్ సిగ్నల్.. రూ.7 వేల కోట్లతో ప్రాజెక్టుకు ప్రభుత్వం ఆమోదం

  • Buggana Rajendranath: సీఎం చంద్రబాబు వల్లే వర్షాలు పడడం లేదు మాజీ మంత్రి

Trending News

    • Kissing Day: ఆవేశపూరితమైన ముద్దు నిమిషానికి 6.4 కేలరీల ఖర్చు చేస్తుంది

    • Kalyan Ram : సంక్రాంతి 2027కు సిద్ధమవుతున్న అనిల్ రావిపూడి.. కళ్యాణ్ రామ్ ఫస్ట్ లుక్‌ పోస్టర్ విడుదల !

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd