HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Andhra Pradesh
  • >Roja Campaign On Behalf Of Dmk In Tamil Nadu

తమిళనాడులో డీఎంకే తరపున రోజా ప్రచారం

  • Author : Vamsi Chowdary Korata Date : 02-03-2026 - 12:15 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Mk Stalin Roja
Mk Stalin Roja

MK Stalin  తమిళనాడు శాసనసభ ఎన్నికలకు సమయం దగ్గరపడుతోంది. అన్ని రాజకీయ పార్టీలు ప్రచారంలో తలమునకలయ్యాయి. ఈ నేపథ్యంలో, తమిళ రాజకీయాల్లో వైసీపీ ఫైర్‌బ్రాండ్, మాజీ మంత్రి ఆర్కే రోజా సందడి చేశారు. ముఖ్యమంత్రి, డీఎంకే అధినేత స్టాలిన్ పుట్టినరోజు (మార్చి 1) వేడుకల్లో పాల్గొన్న ఆమె, రాబోయే ఎన్నికల్లో డీఎంకేకు మద్దతుగా తన గళాన్ని వినిపించారు.

ఈ సందర్భంగా స్టాలిన్ అందిస్తున్న అద్భుతమైన సంక్షేమ పథకాలను రోజా ఆకాశానికెత్తారు. ముఖ్యంగా తమిళనాడులో మహిళల ఆర్థిక భద్రత కోసం ప్రతినెలా వారి ఖాతాల్లో నేరుగా వెయ్యి రూపాయలు జమ చేయడం వంటి పథకాలు మహిళా సాధికారతకు నిదర్శనమని ఆమె కొనియాడారు. ఇదే తరుణంలో ఆంధ్రప్రదేశ్ రాజకీయాలను ప్రస్తావిస్తూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై ఆమె తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఏపీలో మహిళలకు నేరుగా నగదు అందిస్తామని హామీ ఇచ్చి రెండేళ్లు గడుస్తున్నా, ఇప్పటివరకు ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదని విమర్శించారు.

తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ పట్ల ప్రజల్లో ఉన్న ఆదరణను చూసి ప్రతిపక్షాలకు భయం పట్టుకుందని రోజా వ్యాఖ్యానించారు. ఇటీవల మహిళల ఖాతాల్లో ఒకేసారి ఐదు వేల రూపాయలు జమ చేయడంతో విపక్ష నేతలకు ఏం చేయాలో పాలుపోవడం లేదని ఎద్దేవా చేశారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యాన్ని తాను పూర్తిస్థాయిలో సమర్థిస్తున్నానని, దీనివల్ల కూలి పనులకు వెళ్లే పేద మహిళలకు, విద్యార్థులకు ఎంతో ఆర్థిక వెసులుబాటు కలుగుతుందని అభిప్రాయపడ్డారు. ఇంతటి గొప్ప మనసున్న నాయకుడిని తమిళ ప్రజలు భారీ మెజారిటీతో మళ్లీ గెలిపించుకోవాలని, సంక్షేమ పథకాల ద్వారా పొందుతున్న లబ్ధికి ప్రతిఫలంగా స్టాలిన్‌కు ఓటు వేసి రుణం తీర్చుకోవాలని ఆమె పిలుపునిచ్చారు. ఒకవైపు ఏపీ రాజకీయాల్లో చురుగ్గా ఉంటూనే, తమిళ గడ్డపై డీఎంకే తరపున రోజా గళం విప్పడం ఇప్పుడు రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చకు దారితీసింది.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • andhra pradesh politics
  • AP CM Chandrababu Naidu
  • Chief Minister MK Stalin
  • CM MK Stalin
  • dmk
  • RK Roja
  • roja selvamani
  • Tamil Nadu elections
  • welfare schemes
  • women empowerment

Related News

Chandrababu Naidu

Chandrababu Naidu: వైసీపీపై సీఎం చంద్రబాబు ఫైర్

చిత్తూరు జిల్లా కండ్రిగలో జరిగిన సంజీవని ప్రజావేదిక సభలో ముఖ్యమంత్రి చంద్రబాబు వైసీపీపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. 11 విషయాలు చెబుతానంటూ గత ప్రభుత్వ హయాంలో జరిగిన 11 అరాచక, విధ్వంసకర ఘటనలను ఏకరువు పెట్టారు. ఈ నిర్వాకాల వల్లే వైసీపీని తాను ‘గొడ్డలి పార్టీ’ అని పిలుస్తున్నానని, ఆ పార్టీ ముమ్మాటికీ గొడ్డలి పార్టీనేనని స్పష్టం చేశారు. ప్రజాస్వామ్యంలో గొడ్డలి పార్

  • 10-Year-Old Girl Kidnapped and Murdered in Coimbatore... CM Vijay Shares Emotional Post!

    Cm Vijay: కోయంబత్తూరులో పదేళ్ల బాలిక కిడ్నాప్, హత్య..సీఎం విజయ్ ఎమోషనల్ పోస్ట్!

  • Let Us Make Mahanadu a Success: Minister Nara Lokesh

    Nara Lokesh: మహానాడును విజయవంతం చేద్దాం : మంత్రి నారా లోకేశ్‌

  • Janasena MLA Arava Sridhar Resigns from Whip Post

    Arava Sridhar: జనసేన ఎమ్మెల్యే అరవ శ్రీధర్ విప్ పదవికి రాజీనామా

Latest News

  • Krishna Jayashankar : బాడీ షేమింగ్ నుంచి బంగారు పతకం వరకు.. కృష్ణ జయశంకర్ సరికొత్త చరిత్ర!

  • Telangana : గవర్నర్ కోటా ఎమ్మెల్సీ నామినేషన్లపై సుప్రీంకోర్టులో విచారణ

  • Asaduddin Owaisi : యూసీసీ, నమాజ్ వివాదంపై ఒవైసీ ఘాటు స్పందన

  • Karnataka : కర్ణాటక కొత్త సీఎంగా డీకే శివకుమార్? నేడు సీఎల్పీ కీలక సమావేశం

  • BJP : గ్రేట‌ర్ ఎన్నిక‌ల ఓట్ల కోస‌మే ఎన్టీఆర్ విగ్ర‌హావిష్క‌ర‌ణ‌.. కాంగ్రెస్‌పై టీబీజేపీ చీఫ్ ఫైర్‌

Trending News

    • fake news: లిక్కర్ కేసులో నా భార్యకు నోటీసులు రావడం అంతా అబద్ధం.. కేశినేని చిన్ని !

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd