HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Andhra Pradesh
  • >Thithide Filed A Police Complaint Against Madhuri And Tanuja For Divulging In Tirumala

తిరుమలలో దివ్వెల మాధురి, తనూజపై పోలీసులకు తితిదే ఫిర్యాదు

  • Author : Vamsi Chowdary Korata Date : 06-03-2026 - 12:21 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Divvela Madhuri
Divvela Madhuri

Divvela Madhuri  తిరుమలలో దివ్వెల మాధురి టీటీడీ నిబంధనలు మరోసారి ఉల్లంఘించారు. బిగ్‌బాస్ ఫేమ్ తనూజ బర్త్ డే కావడంతో.. తిరుమలలో కేక్ కట్ చేయించారు. శ్రీవారి సన్నిధిలో కేక్‌లపై నిషేధం ఉంది.. అయినా సరే ఓ గెస్ట్ హౌస్‌లో ఈ వేడుకలు నిర్వహించారు. ఈ వీడియో ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేయడంతో వైరల్ అయ్యింది. ఈ ఘటనపై టీటీడీ స్పందించింది.. పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు పేర్కొన్నారు.

తిరుమలలో బిగ్‌బాస్ ఫేమ్ దివ్వెల మాధురి మరోసారి నిబంధనలు ఉల్లంఘించారు. కొండపైకి కేక్ తీసుకొచ్చి కట్ చేయడంపై వివాదం రేగింది. తాజాగా ఈ అంశంపై టీటీడీ స్పందించింది. ‘దివ్వెల మాధురి, తనూజ అనే ఇద్దరు వ్యక్తులు నిన్న తిరుమలలో బర్త్ డే వేడుకలు చేసుకున్నట్లు టీటీడీ దృష్టికి వచ్చింది. తిరుమలలో ఇలాంటి వేడుకలు చేసుకోవడం పూర్తిగా నిషేధించడం జరిగింది. ఆమె ఆ వీడియో చిత్రీకరించి సోషియల్ మీడియాలో పోస్ట్ చేయడం సరైన పద్ధతి కాదు. వీరిపై చట్టపరమైన చర్యలు తీసుకునేందుకు ఇప్పటికే టీటీడీ విజిలెన్స్ పోలీసులుకు ఫిర్యాదు చేయడం జరిగింది. పోలీసులు సదరు ఘటనపై విచారణ చేస్తున్నారు’ అంటూ టీటీడీ ప్రకటన విడుదల చేసింది.

ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్, దివ్వెల మాధురి, బిగ్‌బాస్ ఫేమ్ తనూజలు తిరుమల శ్రీవారి దర్శనం కోసం వచ్చారు. అక్కడ శ్రీవిభవ అతిథిగృహంలో బస చేశారు. అయితే తనూజ పుట్టిన రోజు కావడంతో తిరుమలకు కేక్ తీసుకొచ్చి కట్ చేశారు. ఈ సెలబ్రేషన్స్‌ను వీడియో తీసి ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేయడంతో వైరల్ అయ్యింది. టీటీడీ నిబంధల ప్రకారం తిరుమలకు కేక్ తీసుకెళ్లకూడదుక, కట్ చేయకూడదు. నిబంధనల్ని ఉల్లంఘించి కేక్ తెప్పించి కట్ చేయడంపై టీటీడీ సీరియస్ అయ్యింది. చర్యలు తీసుకోవాలని పోలీసులకు ఫిర్యాదు చేశారు. గతంలో తిరుమలకు వచ్చిన సమయంలో దువ్వాడ శ్రీనివాస్, మాధురిలు.. ఏకంగా శ్రీవారి ఆలయం ముందు, పుష్కరణి సమీపంలో ఫొటోషూట్ చేయడంపై వివాదం రేగింది. ఈ ఘటనలో తిరుమల పోలీసులు కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే. తాజాగా మరోసారి కేక్ కటింగ్ వివాదం రేగింది. అయితే ఈ వివాదంపై దివ్వెల మాధురి స్పందించాల్సి ఉంది.

టీటీడీ నిబంధనల ప్రకారం తిరుమలలో ఎలాాంటి ఫోటోషూట్‌లు, రీల్స్ చేయకూడదు, రాజకీయ ప్రసంగాలపై కూడా నిషేధం విధించిన సంగతి తెలిసిందే. ఈ నిబంధనల గురించి తిరుమల శ్రీవారి ఆలయం దగ్గర మైకులో కూడా ప్రచారం చేస్తున్నారు. అయినా సరే కొందరు మాత్రం పద్దతి మార్చుకోవడం లేదు.. తిరుమలలో నిబంధనలు ఉల్లంఘిస్తున్నారు. ఇటీవల బిగ్‌బాస్ ఫేమ్ గీతూ రాయల్ రీల్ చేయడం వివాదం రేపింది. అంతకముందు కూడా తమిళనాడుకు చెందిన ఓ జంట శ్రీవారి ఆలయం దగ్గర ఫోటోషూట్ చేసిన సంగతి తెలిసిందే. అయితే ఆ దంపతులు టీటీడీ నిబంధనల గురించి తెలియదని చెప్పి క్షమాపణలు కోరారు.. అలాగే చేసిన తప్పుకు పరిహారంగా తిరుమల శ్రీవారికి సేవ చేస్తామంటూ ఓ వీడియోను కూడా విడుదల చేసిన సంగతి తెలిసిందే. తిరుమల వచ్చిన భక్తులు నిబంధనల్ని పాటించాలని టీటీడీ సూచిస్తోంది.

 

 


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • birthday celebrations
  • Chairman TTD
  • Divvela Madhuri
  • in Tirumala
  • police complaint
  • Tanuja
  • Tirumala Tirupathi Devasthanam
  • ttd
  • YSR Congress Party

Related News

It is because of CM Chandrababu that it is not raining: Former Minister

Buggana Rajendranath: సీఎం చంద్రబాబు వల్లే వర్షాలు పడడం లేదు మాజీ మంత్రి

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడి వల్లే రాష్ట్రంలో వర్షాలు పడటం లేదంటూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ (YCP) సీనియర్ నేత, మాజీ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి తీవ్ర విమర్శలు చేశారు. నంద్యాలలో జరిగిన ఒక కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. ప్రకృతి వైపరీత్యాలు, వర్షాలు పడకపోవడానికి పాలకుల మనస్తత్వమే కారణమంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. “ఏలుకునే రాజు మనస్తత్వం బాగుంటే

  • Cancellation of VIP break darshans from July to September

    TTD VIP Break Darshan: జూలై నుండి సెప్టంబ‌ర్ వ‌ర‌కు వీఐపీ బ్రేక్ ద‌ర్శ‌నాల ర‌ద్దు

  • YS Jagan pays tribute to YSR.

    YSR: వైఎస్సార్‌కు వైఎస్‌ జగన్‌ నివాళులు

  • 116-year-old grandmother to have divine darshan of Srivaru; TTD Chairman BR Naidu issues orders.

    TTD: 116 ఏళ్ల వయసులో కాలినడకన తిరుమలకు..!

Latest News

  • Revanth Reddy: “తాత.. నువ్వు పూరీలు వేస్తేనే తింటాను”

  • Bandi Bhageerath: బండి భగీరథ్‌కు హైకోర్టు బెయిల్ మంజూరు

  • BSNL శాటిలైట్ ఫోన్‌ను విడుదల చేసింది

  • Musi Riverfront: మూసీ పునరుజ్జీవనానికి గ్రీన్ సిగ్నల్.. రూ.7 వేల కోట్లతో ప్రాజెక్టుకు ప్రభుత్వం ఆమోదం

  • Alcohol: మందు కొడితే మంచి నిద్ర వస్తుందా..? నిజమెంత?

Trending News

    • Kissing Day: ఆవేశపూరితమైన ముద్దు నిమిషానికి 6.4 కేలరీల ఖర్చు చేస్తుంది

    • Kalyan Ram : సంక్రాంతి 2027కు సిద్ధమవుతున్న అనిల్ రావిపూడి.. కళ్యాణ్ రామ్ ఫస్ట్ లుక్‌ పోస్టర్ విడుదల !

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd