Minister Anita : డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తో హోంమంత్రి అనిత భేటీ
Home Minister Anita : విజయనగరం జిల్లా గుర్ల గ్రామంలో డయేరియా పరిస్థితులు, రాష్ట్రంలో కొన్ని విమానాశ్రయాలు, హోటళ్లకు వచ్చిన బాంబు బెదిరింపుల విషయాలపైనా కూడా పవన్ అరా తీశారు
- By Sudheer Published Date - 10:48 PM, Tue - 29 October 24

మంగళవారం ఏపీ హోంమంత్రి అనిత (AP Home Minister Anita)..డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) తో భేటీ అయ్యారు. ఈ భేటీ లో వివిధ అంశాలపై ఇద్దరు చర్చించారు. దీపావళి సందర్భంగా ప్రజలు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, రాష్ట్రంలో శాంతి భద్రతల పరిరక్షణ, భద్రతా ఏర్పాట్లు వంటి అంశాలపై చర్చ నడిచింది. అలాగే, విజయనగరం జిల్లా గుర్ల గ్రామంలో డయేరియా పరిస్థితులు, రాష్ట్రంలో కొన్ని విమానాశ్రయాలు, హోటళ్లకు వచ్చిన బాంబు బెదిరింపుల విషయాలపైనా కూడా పవన్ అరా తీశారు.
దీపావళి సందర్బంగా అగ్నిప్రమాదాలు జరిగే అవకాశం ఉండటంతో 185 అగ్నిమాపక కేంద్రాలను అప్రమత్తం చేసినట్లు అనిత పవన్‌కు తెలిపారు. అక్రమంగా బాణసంచా తయారీ జరుగుతుంటే 100, 101 నెంబర్లకు ఫిర్యాదు చేయవచ్చని, పోలీసు మరియు ఫైర్ విభాగాలు తగిన చర్యలు తీసుకుంటాయని వివరించారు.
ఈ సందర్బంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ.. పర్యావరణానికి హాని చేయని బాణసంచా వినియోగంతో దీపావళి జరుపుకోవాలని ప్రజలకు సూచించారు. అలాగే, కోనసీమ జిల్లా మండపేట మండలంలో టపాసుల పేలుళ్ల వంటి ఘటనలు జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.
Read Also : Jammu And Kashmir: ఇండియన్ ఆర్మీ చేతిలో ఉగ్రవాది.. 12 హ్యాండ్ గ్రెనేడ్లు, పిస్టల్ స్వాధీనం!