Maoists : ఛత్తీస్ గడ్ బస్తర్ ఎన్ కౌంటర్.. మావోయిస్టుల అధికారిక స్పందన
Maoists : ఛత్తీస్ గడ్ ఎన్ కౌంటర్ పోరాటంలో 14 మంది మావోలు మృతి చెందారని.. కాల్పుల్లో గాయపడ్డ మిగతా 17 మందిని భద్రతా బలగాలు పట్టుకుని కాల్చి చంపాయని మావోయిస్టు పార్టీ ఆరోపించింది.
- By Kavya Krishna Published Date - 09:19 PM, Sun - 13 October 24

Maoists : 31 మంది మావోయిస్టుల ప్రాణాలు కోల్పోయిన ఛత్తీస్ గడ్ బస్తర్ ఎన్ కౌంటర్‌పై మావోయిస్టు పార్టీ అధికారికంగా స్పందించింది. ఎన్ కౌంటర్ సమయంలో 14 మంది మావోలు మరణించగా, మిగిలిన 17 మందిని భద్రతా బలగాలు పట్టుకుని కాల్చి చంపాయని మావోయిస్టు పార్టీ ఆరోపించింది. ఈ సంఘటన జరిగిన 9 రోజుల తర్వాత బస్తర్ డివిజనల్ కమిటీ కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా (మావోయిస్టు) పత్రికా ప్రకటన విడుదల చేసింది.
ప్రకటనలో, ఎన్ కౌంటర్ జరిగిన రోజు ఉదయం 6 గంటల నుంచి భద్రతా బలగాలు చుట్టుముట్టాయని, భోజనం చేస్తున్న సమయంలో దాడి చేసారని తెలిపారు. ఆ రోజు 6 సార్లు ఎదురు కాల్పులు జరిగాయని పేర్కొన్నారు. ఉదయం 6:30 గంటల నుంచి 11 గంటల వరకు కాల్పులు జరిగాయని, గ్రామాన్ని చుట్టుముట్టిన భద్రతా బలగాలు శిబిరాన్ని ఖాళీ చేసేందుకు ప్రయత్నిస్తున్న సమయంలో మరో వైపు నుంచి కూడా కాల్పులు మొదలయ్యాయని వివరించారు.
Bandi Sanjay : ఈ రెండు పార్టీల మధ్య జరిగిన చీకటి ఒప్పందం ఏంటి..?: బండి సంజయ్
విరామం లేకుండా కాల్పులు
భద్రతా బలగాలు విరామం లేకుండా జరిపిన కాల్పుల్లో 8 మంది మావోయిస్టులు మరణించగా, 12 మంది గాయపడ్డారని వెల్లడించారు. 15 నిమిషాల తరువాత మళ్లీ కాల్పులు జరిగాయని, ఆ కాల్పుల్లో మరో నలుగురు మావోయిస్టులు గాయపడినట్లు చెప్పారు. అక్కడి నుండి 30 నిమిషాల దూరంలో మావోయిస్టులు ఎల్ ఫార్మేషన్‌లో కూర్చుని కాల్పులు జరిపారని వివరించారు. ఉదయం 11:30 నుండి రాత్రి 9 గంటల వరకు 11 సార్లు కాల్పులు జరిగి, ఈ కాల్పుల్లో 14 మంది మావోయిస్టులు ప్రాణాలు కోల్పోయారని పేర్కొన్నారు.
ఈ ప్రకటనలో, మృతి చెందిన మావోయిస్టులకు నివాళులర్పించేందుకు బస్తర్ డివిజనల్ కమిటీ కృషి చేస్తుందని, ప్రజల ఆత్మను ఉద్ధరించడానికి ప్రతి గ్రామంలో సంస్మరణ సభలు నిర్వహించాలని విజ్ఞప్తి చేసింది. విప్లవకారులు , ప్రజలు తమ కలలను సాకారం చేసుకునేందుకు దృఢ సంకల్పంతో పని చేయాలని ఈ కమిటీ తెలిపింది.
Weight Loss: బరువు తగ్గడానికి నీరు సహాయపడుతుందా..?