HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Life Style
  • >Benefits And Risks Of Eating Curd

Helath Tips : రాత్రిపూట పెరుగు తింటే ఏమవుతుంది..?

Helath Tips : రాత్రిపూట పెరుగు తినడం వల్ల కలిగే లాభాలు , నష్టాలు ఇక్కడ ఉన్నాయి. పెరుగులో క్యాల్షియం, ప్రొటీన్ , ఇతర పోషకాలు పుష్కలంగా ఉంటాయి, కానీ అధిక కొవ్వు పదార్ధాలతో పెరుగు బరువు పెరగడానికి దారితీస్తుంది. పెరుగును ఉదయం లేదా మధ్యాహ్నం తినవచ్చు. ఈ సమయంలో పెరుగు తింటే తేలికగా జీర్ణమవుతుంది. కానీ శ్వాస సమస్యలు ఉన్నవారు రాత్రిపూట పెరుగు తినకూడదు.

  • Author : Kavya Krishna Date : 31-12-2024 - 6:30 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Curd At Night
Curd At Night

Helath Tips : భోజనం ముగిశాక పెరుగు లేకుంటే చాలా మందికి కడుపు నిండదు. మరికొందరు పెరుగు కాకపోతే మజ్జిగ తాగుతారు. పెరుగు తినడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. పెరుగు తినడం వల్ల కాల్షియం, విటమిన్ డి , విటమిన్ బి12 శరీరానికి సమృద్ధిగా అందుతాయి. అయితే రాత్రిపూట పెరుగు తినడం మంచిదా చెడ్డదా అని ఆలోచించారా?

రాత్రి సమయంలో, శరీరంలోని జీవక్రియ మందగిస్తుంది. ఇలాంటి సమయాల్లో జీర్ణ సమస్యలు ఉన్నవారు పెరుగు తింటే సమస్యలు పెరిగే అవకాశం ఉంది. పెరుగులో కొవ్వు , ప్రోటీన్లు ఉంటాయి. ఇవి జీర్ణం కావడానికి సమయం పడుతుంది. కాబట్టి జీర్ణ సమస్యలున్నవారు రాత్రిపూట పెరుగు తింటే సమస్యలు పెరుగుతాయి. కాబట్టి జీర్ణ సమస్యలు ఉన్నవారు రాత్రిపూట పెరుగు తినకూడదు. దగ్గు, జలుబు, ఆస్తమాతో బాధపడేవారు రాత్రిపూట పెరుగు తింటే అధ్వాన్నంగా ఉంటుంది. కాబట్టి రాత్రిపూట పెరుగు తినకపోవడమే మంచిది.

Dalai Lama : దలైలామా వారసత్వంపై ఉత్కంఠ

పెరుగును ఉదయం లేదా మధ్యాహ్నం తినవచ్చు. ఈ సమయంలో పెరుగు తింటే తేలికగా జీర్ణమవుతుంది. కానీ శ్వాసకోశ సమస్యలు లేని వారు రాత్రిపూట పెరుగు తినవచ్చు. కానీ జీర్ణ సమస్యలుంటే మాత్రం తినకూడదు. ఎలాంటి సమస్య లేని వారు ఎప్పుడు కావాలంటే అప్పుడు పెరుగు తినవచ్చు. కానీ పెరుగు కొవ్వు లేకుండా ఉంటే మంచిది.

అధిక బరువు తగ్గాలనుకునే వారు పెరుగు తినకూడదు. ఇందులో కొవ్వు శాతం ఎక్కువ. స్కిమ్డ్ మిల్క్‌తో తయారైన పెరుగు తినండి. ఇది బరువు తగ్గడంలో సహాయపడుతుంది. తమ బరువును అదుపులో ఉంచుకోవడానికి ప్రయత్నించే వారు స్కిమ్డ్ మిల్క్‌తో చేసిన పెరుగును కూడా తీసుకోవాలి. ఇలా పెరుగు తినడం వల్ల బరువు అదుపులో ఉంటుంది.

పెరుగు తినడం వల్ల జీర్ణశక్తి మెరుగుపడుతుంది. కాబట్టి మధ్యాహ్నం పూట తినడం మంచిది. పెరుగు తినడం వల్ల జీర్ణవ్యవస్థలోని మంచి బ్యాక్టీరియాకు మేలు జరుగుతుంది. రోగనిరోధక శక్తిని పెంచుతుంది. పెరుగులో క్యాల్షియం, ప్రొటీన్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి ఎముకలను ఆరోగ్యంగా ఉంచుతాయి. కండరాల నిర్మాణంలో సహాయపడుతుంది. చర్మాన్ని ఆరోగ్యవంతంగా మార్చుతుంది. శిరోజాలను రక్షిస్తుంది. అందువల్ల పెరుగులో అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి.

Wednesday: బుధవారం రోజు ఈ పనులు చేస్తే చాలు.. అదృష్టం పట్టిపీడించడం ఖాయం!


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • calcium
  • curd benefits
  • diet tips
  • digestion
  • health tips
  • metabolism
  • nutrition
  • weight loss

Related News

Weight Loss

Weight Loss: బరువు తగ్గడం ఇంత ఈజీనా.. ఇది తెలియక ఇన్నాళ్లు ఎన్నో అవస్థలు!

మామూలుగా బరువు పెరగడం అన్నది చాలా ఈజీ. కానీ బరువు తగ్గడం అన్నది మాత్రం అంత సులువైన విషయం కాదని చెప్పాలి. బరువు తగ్గడం కోసం రకరకాల ఎక్సర్సైజులు చేయడం, జిమ్ లో వర్కౌట్ చేయడం, వాకింగ్ చేయడం, డైట్లు ఫాలో అవ్వడం లాంటివి చేస్తూ ఉంటారు. ఇలా ఎన్ని చేసినా కూడా కొన్నిసార్లు బరువు తగ్గరు. దీంతో చాలామంది ఇబ్బంది పడుతూ ఉంటారు. కానీ ఇప్పుడు చెప్పినట్టు కొన్ని ఆహార నియమాలు పాటిస్తే బరువ

    Latest News

    • LPG Cylinder Subsidy: సబ్సిడీతో ఇక ఏడాదికి 4 సిలిండర్లే!

    • Arjun Tendulkar: కొడుకు అర్జున్‌ ప్రదర్శనపై సచిన్‌ ప్రశంసల జల్లు

    • H1B visa: వీసాలపై అమెరికా ఉక్కుపాదం.. హెచ్‌-1బీ వీసా ఫీజు పెంపు

    • తెలంగాణను తాకిన నైరుతి రుతుపవనాలు

    • చంద్రబాబును కలిసిన పెద్దాయన సత్యనారాయణ

    Trending News

      • Kalita Majhi: అప్పట్లో ఇంటి పనిమనిషి.. నేడు బెంగాల్‌ మంత్రి

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2026 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd