Wayanad : 10న వయనాడ్‌లో పర్యటించనున్న ప్రధాని మోడీ
ఆగస్టు 1న కేంద్ర హోంమంత్రి అమిత్ షా మాట్లాడుతూ, భారీ వర్షాల గురించి కేంద్రం కేరళకు ముందస్తు హెచ్చరికలు చేసిందని చెప్పారు.
- By Latha Suma Published Date - 01:52 PM, Thu - 8 August 24

Wayanad Landslides: ఇటివల కేరళలోని వాయనాడ్‌లో భారీ వర్షాల కారణంగా కొండచరియలు విరిగిపడి భారీగా ప్రాణ, ఆస్తి నష్టం జరిగిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ప్రస్తుత పరిస్థితులను సమీక్షించేందుకు ప్రధాని నరేంద్రమోడీ(PM Narendra Modi) వయనాడ్‌లో పర్యటించనున్నారు. ఆగస్టు 10వ తేదీన కొండచరియలు విరిగిపడిన ప్రాంతాల్లో పర్యటించనున్నారు.
We’re now on WhatsApp. Click to Join.
జిల్లాలోని కొండచరియలు విరిగిపడిన చూరల్‌మల, ముండక్కై గ్రామాల పరిస్థితిని ప్రధాని మోడీ సమీక్షించనున్నారు. కొండచరియలు విరిగిపడిన ప్రాంతాలను సందర్శించిన తర్వాత, ప్రధాని మోడీ ప్రస్తుతం 10,000 మందికి పైగా ఉన్న సహాయక శిబిరాన్ని కూడ సందర్శించనున్నారు. 417 మంది ప్రాణాలను బలిగొన్న విషాదకరమైన కొండచరియల విపత్తు నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోడీ శనివారం కేరళలోని వయనాడ్ జిల్లాలో పర్యటించనున్నారు.
కాగా, వాయనాడ్ కొండచరియలను “జాతీయ విపత్తు”గా ప్రకటించాలని లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీతో సహా కేరళ, తమిళనాడు మరియు మహారాష్ట్రకు చెందిన పలువురు ఎంపీలు కేంద్రాన్ని కోరిన విషయం తెలిసిందే. పరిహారం పెంచాలని, సమగ్ర పునరావాస ప్యాకేజీని ఇవ్వాలని ప్రతిపక్ష పార్టీలకు చెందిన ఎంపీలు లోక్‌సభలో కేంద్రాన్ని డిమాండ్ చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో మోడీ వయనాడ్ పర్యటకు ప్రాధాన్యత సంతరించుకుంది.
మంగళవారం కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ మాట్లాడుతూ.. కొండచరియలు విరిగిపడిన బాధితులకు ప్రపంచ స్థాయి పునరావాస సౌకర్యాలు కల్పిస్తామని చెప్పారు. దేశానికి, ప్రపంచానికి ఆదర్శంగా నిలిచే పునరావాస నమూనాను అమలు చేయడమే మా లక్ష్యం అని ముఖ్యమంత్రి పేర్కొన్నారు.
Read Also: RBI Hikes UPI Limit : ఫోన్ పే ..గూగుల్ పే వాడేవారికి గుడ్ న్యూస్