HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Devotional
  • >No Entry For Women In Sabarimala

శబరిమలలో మహిళలకు నో ఎంట్రీ

  • Author : Vamsi Chowdary Korata Date : 03-03-2026 - 10:45 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
sabarimala temple women entry
sabarimala temple women entry
Sabarimala Temple  కేరళలోని ప్రఖ్యాత శబరిమల అయ్యప్ప ఆలయ ఆచారాలకు సంబంధించిన వివాదం మరోసారి కీలక మలుపు తిరిగింది. అన్ని వయసుల మహిళలు ఆలయంలోకి ప్రవేశించవచ్చంటూ 2018లో సుప్రీంకోర్టు ఇచ్చిన చారిత్రాత్మక తీర్పును సవాలు చేయాలని ట్రావెన్‌కోర్ దేవస్వం బోర్డు (TDB) నిర్ణయించింది. సోమవారం జరిగిన బోర్డు సమావేశంలో ఈ మేరకు తీర్మానం ఆమోదించింది. గతంలో ఇదే తీర్పును అమలు చేయడానికి ప్రయత్నించిన బోర్డు, ఇప్పుడు దానికి వ్యతిరేకంగా న్యాయపోరాటానికి సిద్ధం కావడం గమనార్హం.

సుప్రీంకోర్టు తీర్పు వెలువడిన తర్వాత కేరళ వ్యాప్తంగా భక్తులు, హిందూ సంఘాల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. అయ్యప్ప స్వామి నైష్ఠిక బ్రహ్మచారి అని, ఆలయ సంప్రదాయాలను గౌరవించాలని భక్తులు పెద్ద ఎత్తున నిరసనలు చేపట్టారు. క్షేత్రస్థాయిలోని ఈ మనోభావాలను, ప్రస్తుత పరిస్థితులను పరిగణనలోకి తీసుకుని పాత తీర్పును పునఃసమీక్షించాలని కోరుతూ సుప్రీంకోర్టును ఆశ్రయించాలని బోర్డు నిర్ణయించింది.

2018 సెప్టెంబర్ 28న అప్పటి సీజేఐ జస్టిస్ దీపక్ మిశ్రా నేతృత్వంలోని ధర్మాసనం 4:1 మెజారిటీతో మహిళల ప్రవేశానికి అనుకూలంగా తీర్పు ఇచ్చింది. అయితే, ఆ బెంచ్‌లోని ఏకైక మహిళా న్యాయమూర్తి జస్టిస్ ఇందు మల్హోత్రా మాత్రం మత విశ్వాసాల్లో కోర్టుల జోక్యం సరికాదని భిన్నాభిప్రాయం వ్యక్తం చేశారు. ఇప్పుడు దేవస్వం బోర్డు కూడా ఇదే పాయింట్‌ను ప్రధానంగా ప్రస్తావిస్తూ న్యాయపోరాటానికి సిద్ధమవుతోంది.

ఇప్పటికే ఈ అంశంపై పలు రివ్యూ పిటిషన్లు సుప్రీంకోర్టులోని ఏడుగురు సభ్యుల విస్తృత ధర్మాసనం వద్ద విచారణలో ఉన్నాయి. తాజాగా ఆలయ నిర్వాహక బోర్డే స్వయంగా రంగంలోకి దిగడంతో ఈ కేసు మరింత ప్రాధాన్యం సంతరించుకుంది. బోర్డు నిర్ణయం పట్ల అయ్యప్ప భక్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • ayyappa
  • Ayyappa Darshan
  • Justice Deepak Misra
  • Justice Indu Malhotra
  • kerala
  • sabarimala
  • Sabarimala Temple
  • supreme court verdict
  • TRAVANCORE DEVASWOM BOARD
  • Women Entry

Related News

Union Cabinet approves name change of Kerala to 'Keralam '

సుదీర్ఘ నిరీక్షణకు తెర .. కేరళ ఇక పై ‘కేరళం’.. పేరు మార్పుకు కేంద్ర కేబినెట్ ఆమోదం

ఇకపై ‘కేరళం’గా పేర్కొనే ప్రతిపాదనకు మంగళవారం కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. సుదీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న ఈ అంశంపై రాష్ట్ర ప్రభుత్వం పలు మార్లు కేంద్రాన్ని అభ్యర్థించగా తాజాగా ఆ ప్రక్రియ వేగం అందుకుంది.

    Latest News

    • షాకింగ్ నిజాలు చెప్పిన హీరోయిన్ స్నేహ..

    • గల్ఫ్ దేశాల్లో ఎంతమంది భారతీయులు ఉన్నారంటే..!

    • యూట్యూబ్‌లోనూ ప్రధాని మోదీ రికార్డు

    • నటుడు శివాజీరాజా తండ్రి రామరాజు కన్నుమూత

    • టీమిండియాపై మళ్లీ నోరుపారేసుకున్న ఆమిర్!

    Trending News

      • శబరిమలలో మహిళలకు నో ఎంట్రీ

      • ఖమేనీ వద్ద ఎంత ఆస్తి ఉందో తెలుసా?

      • రోహిత్-విరాట్ టీమ్ ఇండియా జెర్సీలో ఎప్పుడు క‌నిపించ‌నున్నారు?

      • భార‌త్ సెమీస్ చేరాలంటే.. ఎన్ని ప‌రుగుల తేడాతో గెల‌వాలో తెలుసా?!

      • మరికాసేప‌ట్లో టీమిండియా- వెస్టిండీస్ మ్యాచ్‌.. వెద‌ర్ రిపోర్ట్ ఇదే!

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2026 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd