RBI Hikes UPI Limit : ఫోన్ పే ..గూగుల్ పే వాడేవారికి గుడ్ న్యూస్
జస్ట్ చేతిలో స్మార్ట్ ఫోన్ ఉందా...అందులో ఫోన్ పే , గూగుల్ పే ఉందా..ఈ రెండిటిలో ఏది ఉన్న సరే క్షణాల్లో డబ్బు అవతలి వారి ఖాతాల్లోకి జమ చేస్తూ వస్తున్నాం
- Author : Sudheer
Date : 08-08-2024 - 1:47 IST
Published By : Hashtagu Telugu Desk
గతంలో రూ. 500 నుండి లక్షల వరకు డబ్బు(Money Transfer)ను ఇతర బ్యాంకు ఖాతాల్లోకి వేయాలంటే తప్పకుండా బ్యాంకు(Bank)కు వెళ్లి క్యూ లో ఉండి..వారి ఖాతాల్లో డబ్బు జమ చేసే వాళ్ళం. కానీ ఇప్పుడు ఏ బ్యాంకు కు వెళ్లాల్సిన పనిలేదు..క్యూ లైన్లో గంటల కొద్దీ నిల్చువాల్సిన పని లేదు. జస్ట్ చేతిలో స్మార్ట్ ఫోన్ (Smart Phone) ఉందా…అందులో ఫోన్ పే (Phone Pay) , గూగుల్ పే (Google Pay) ఉందా..ఈ రెండిటిలో ఏది ఉన్న సరే క్షణాల్లో డబ్బు అవతలి వారి ఖాతాల్లోకి జమ చేస్తూ వస్తున్నాం.
We’re now on WhatsApp. Click to Join.
కాకపోతే రోజుకు కేవలం లక్ష రూపాయిల వరకు మాత్రమే పంపించగలిగేవాళ్ళం. కానీ ఇప్పుడు RBI గుడ్ న్యూస్ తెలిపింది. రోజుకు లక్ష నుండి రూ.5 లక్షల వరకు పంపించుకోవచ్చని తెలిపింది. ఆదాయపు పన్ను, ఆస్తి పన్ను, ముందస్తు పన్ను చెల్లింపులు చేసేవారు ఒక లావాదేవీలో రూ.ఐదు లక్షల వరకు చెల్లించే అవకాశం కల్పిస్తున్నట్లు తెలిపింది. ద్వైమాసిక ద్రవ్య పరపతి విధాన నిర్ణయాల వెల్లడి సందర్భంగా ఆర్‌బీఐ ఈ ప్రకటన చేసింది.
Read Also : Minister Ponguleti : పెను ప్రమాదం నుండి బయటపడ్డ మంత్రి పొంగులేటి