HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > World
  • >Thank You Modi For Standing With Israel

ఇజ్రాయెల్‌కు అండగా నిలబడ్డందుకు మోదీకి థాంక్స్

  • Author : Vamsi Chowdary Korata Date : 03-03-2026 - 10:25 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Netanyahu Modi Phone Call
Netanyahu Modi Phone Call

Netanyahu Modi Phone Call  క్షేత్రస్థాయిలో క్షిపణుల వర్షం కురుస్తున్నా, శిథిలాల మధ్య నిలబడి శత్రువుకు హెచ్చరికలు జారీ చేస్తూనే.. తన పాత స్నేహితుడిని స్మరించుకున్నారు ఇజ్రాయెల్ ప్రధాని బెన్యామిన్ నెతన్యాహు. ఇరాన్ దాడుల్లో 9 మంది ప్రాణాలు కోల్పోయిన బాధాకరమైన సమయంలో భారత ప్రధాని మోదీ నుంచి అందిన సంఘీభావం తమకు కొండంత అండగా నిలిచిందని ఆయన ఆనందం వ్యక్తం చేశారు. అలాగే మోదీతో చాలా సేపు ఫోన్‌లో మాట్లాడానని చెప్పిన ఆయన.. ఏం మాట్లాడానో మాత్రం వివరించలేనన్నారు.

పశ్చిమాసియాలో యుద్ధం ముదురుతున్న వేళ ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు భారత ప్రధాని నరేంద్ర మోదీతో తనకున్న ప్రత్యేక అనుబంధాన్ని మరోసారి చాటుకున్నారు. ఇరాన్ దాడులతో అట్టుడుకుతున్న ఇజ్రాయెల్‌కు భారత్ అందిస్తున్న తిరుగులేని మద్దతుపై ఆయన కృతజ్ఞతలు తెలిపారు. ముఖ్యంగా సోమవారం రోజు ప్రధాని మోదీ.. నెతన్యాహుకు ఫోన్ చేసి మరీ చాలా సేపు మాట్లాడారు. దీన్ని ఉద్దేశించే నెతన్యాహు.. తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో పలు ఆసక్తికర విషయాలను వెల్లడించారు.

నిజం వైపు నిలబడ్డారు..

ఇరాన్ క్షిపణి దాడిలో ధ్వంసమైన బీట్ షెమేష్‌లోని ఒక ప్రార్థనా మందిరం శిథిలాలను పరిశీలిస్తున్న సమయంలో నెతన్యాహు మీడియాతో మాట్లాడారు. ఈక్రమంలోనే “నిన్న నేను నా ఆప్తమిత్రుడు నరేంద్ర మోదీతో సుదీర్ఘంగా మాట్లాడాను. ఇజ్రాయెల్ వైపు, నిజం వైపు నిలబడినందుకు ఆయనకు కృతజ్ఞతలు తెలిపాను. భారత ప్రజలు ఇజ్రాయెల్‌పై చూపిస్తున్న అపారమైన ప్రేమ, స్నేహం వెలకట్టలేనిది. వారిని ఇజ్రాయెల్ ప్రజలు ఎంతగానో ప్రేమిస్తారు” అని నెతన్యాహు పేర్కొన్నారు. అలాగే ప్రధాని మోదీతో తాను సోమవారం రోజు ఫోన్‌లో చాలా సేపు మాట్లాడానని చెప్పిన నెతన్యాహు.. కానీ ఏం మాట్లాడో వివరంచలేనని అన్నారు. మోదీ ఒక్కరే కాకుండా ఇతర దేశాల నేతలతో కూడా తాను మాట్లాడనని చెప్పారు.

ఆ రోజు దగ్గరలోనే ఉంది..

ఇరాన్ పాలకులకు వ్యతిరేకంగా నెతన్యాహు ఘాటు వ్యాఖ్యలు చేశారు. అమెరికా-ఇజ్రాయెల్ సంయుక్తంగా చేస్తున్న దాడుల ప్రధాన ఉద్దేశం ఇరాన్ ప్రజలు తమ నియంతృత్వ పాలకులను గద్దె దించేలా ప్రోత్సహించడమేనని ఆయన స్పష్టం చేశారు. “ఆ విముక్తి రోజు దగ్గరలోనే ఉంది. ఇరాన్ ప్రజలు తమ దేశాన్ని తిరిగి స్వాధీనం చేసుకోవాలి. ఆ సమయంలో ఇజ్రాయెల్, అమెరికా వారికి అండగా ఉంటాయి” అని ఆయన పిలుపునిచ్చారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కూడా ఇప్పటికే ఇరాన్ ప్రజలను ఉద్దేశించి “మీ దేశాన్ని మీరు దక్కించుకోండి” అని వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే.

మరోవైపు ఇరాన్ సోమవారం రోజు సాయంత్రం కూడా ఇజ్రాయెల్‌పై క్షిపణి దాడులకు తెగబడింది. ఐడీఎఫ్ సమాచారం ప్రకారం.. ఇరాన్ ప్రయోగించిన మూడు క్షిపణులను ఇజ్రాయెల్ రక్షణ వ్యవస్థలు గాలిలోనే ధ్వంసం చేశాయి. ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని, మొబైల్ ఫోన్లకు హెచ్చరికలు అందిన వెంటనే సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని అధికారులు ఆదేశించారు. భారత్-ఇజ్రాయెల్ మధ్య ఉన్న రక్షణ, వాణిజ్య వ్యూహాత్మక సంబంధాలు ఈ సంక్షోభ సమయంలో మరింత బలపడుతున్నట్లు నెతన్యాహు వ్యాఖ్యలు స్పష్టం చేస్తున్నాయి.

 


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • India- Israel Relations
  • Iran Israel ceasefire
  • Modi - Netanyahu - Phone Call
  • Netanyahu Modi Phone Call
  • pm modi
  • PM Netanyahu

Related News

PM Modi Becomes Most-Followed World Leader With Over 30 Million Subscribers

యూట్యూబ్‌లోనూ ప్రధాని మోదీ రికార్డు

Narendra Modi  ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సోషల్ మీడియాలో తన ఆధిపత్యాన్ని మరోసారి నిరూపించుకున్నారు. వీడియో షేరింగ్ ప్లాట్‌ఫామ్ యూట్యూబ్‌లో ఆయన చానెల్ 3 కోట్ల (30 మిలియన్ల) సబ్‌స్క్రైబర్ల మైలురాయిని దాటింది. దీంతో ప్రపంచంలోని ప్రస్తుత, మాజీ దేశాధినేతల్లో యూట్యూబ్‌లో అత్యధిక సబ్‌స్క్రైబర్లు కలిగిన నేతగా ఆయన తన స్థానాన్ని మరింత పదిలం చేసుకున్నారు. ఈ ఘనతతో డిజిటల్ కమ్యూనికేషన్‌ల

  • PM Modi

    ఎన్‌సీఈఆర్‌టీ వివాదం.. ప్ర‌ధాని మోదీ అస‌హ‌నం!

  • PM Modi

    Social Media : 10 కోట్ల ఫాలోవర్లతో ఇన్స్టాలో మోదీ రికార్డ్

Latest News

  • నటుడు శివాజీరాజా తండ్రి రామరాజు కన్నుమూత

  • టీమిండియాపై మళ్లీ నోరుపారేసుకున్న ఆమిర్!

  • శబరిమలలో మహిళలకు నో ఎంట్రీ

  • ఇజ్రాయెల్‌కు అండగా నిలబడ్డందుకు మోదీకి థాంక్స్

  • ఫార్ములా 1 రేసులపైనా సందేహాలు..

Trending News

    • ఖమేనీ వద్ద ఎంత ఆస్తి ఉందో తెలుసా?

    • రోహిత్-విరాట్ టీమ్ ఇండియా జెర్సీలో ఎప్పుడు క‌నిపించ‌నున్నారు?

    • భార‌త్ సెమీస్ చేరాలంటే.. ఎన్ని ప‌రుగుల తేడాతో గెల‌వాలో తెలుసా?!

    • మరికాసేప‌ట్లో టీమిండియా- వెస్టిండీస్ మ్యాచ్‌.. వెద‌ర్ రిపోర్ట్ ఇదే!

    • Science Day: ఫిబ్రవరి 28నే సైన్స్ డే ఎందుకు?

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd