HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Health
  • >Foods To Eat To Avoid Diseases

రోగాల బారిన పడకుండా తినాల్సిన ఫుడ్స్

  • Author : Vamsi Chowdary Korata Date : 03-03-2026 - 1:49 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Boost Immunity Weather Change
Boost Immunity Weather Change

Boost Immunity  శీతాకాలం ముగిసింది. ఎండాకాలం ప్రారంభమైంది. ఇప్పుడిప్పుడే ఎండలు కూడా దంచి కొట్టడం మొదలైంది. వాతావరణం మారినప్పుడు శరీర అంతర్గత వ్యవస్థలు బాహ్య వాతావరణానికి అనుగుణంగా మారడానికి ప్రయత్నిస్తాయి. శీతాకాలం నుంచి వేసవికి మారినప్పుడు కొందరికి ఇమ్యూనిటీ పవర్ తగ్గుతుంది. దీంతో, రోగాల బారిన పడే ప్రమాదం ఉంటుంది. ముఖ్యంగా జలుబు, దగ్గు, జ్వరం వంటి వ్యాధులు వస్తాయి. అయితే, మారుతున్న సీజన్‌కి అనుగుణంగా రోగనిరోధక శక్తిని పెంచుకోవడానికి ఆహారం, హైడ్రేషన్‌పై దృష్టి పెట్టాలి.

వాతావరణం మారే సమయంలో మన రోగనిరోధక శక్తి తాత్కాలికంగా తగ్గుతుంది. దీనివల్ల జలుబు, దగ్గు, జ్వరం వంటి ఇన్ఫెక్షన్లు త్వరగా వచ్చే అవకాశం ఉంటుంది. ఇప్పుడు శీతాకాలం అయిపోయింది. వేసవి కాలం ప్రారంభమైంది. వాతావరణంలో ఆకస్మిక మార్పులు శరీర రోగనిరోధక శక్తిని తాత్కాలికంగా బలహీనపరుస్తాయి. దీంతో రోగాల బారిన పడే అవకాశం ఉంది. వాతావరణం మారే సమయంలో సరైన పోషకాహారంతో పాటు హైడ్రేషన్, కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే రోగాల నుంచి మనల్ని కాపాడుకోవచ్చని

డాక్టర్ ఏం చెప్పారు?

ఉష్ణోగ్రత, తేమ మారినప్పుడు మన శరీర అంతర్గత వ్యవస్థలు బాహ్య వాతావరణానికి అనుగుణంగా మారడానికి ప్రయత్నిస్తాయి. ఇది తాత్కాలికంగా రోగనిరోధక శక్తిని ప్రభావితం చేస్తుంది. వాతావరణం శీతాకాలం నుంచి వేసవికి మారినప్పుడు, శరీరం సర్దుబాటు చేసుకోవడానికి సమయం పడుతుంది. ఈ సమయంలో శ్వాసకోశ వ్యవస్థ సున్నితంగా మారుతుంది. జలుబు, వైరల్ ఇన్ఫెక్షన్ల ప్రమాదాన్ని పెంచుతుంది. అందుకే సరైన పోషకాహారంతో పాటు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి.

రోగనిరోధక శక్తిని పెంచుకోవడానికి చిట్కాలు

శీతాకాలం ముగియడంతో వేసవి మొదలైంది. ఈ మారుతున్న వాతావరణంతో.. ఉష్ణోగ్రతలు వేగంగా పెరుగుతాయి. ఇది శరీర రోగనిరోధక శక్తిని బలహీనపరుస్తుంది. వేసవిలో వడదెబ్బ, డీహైడ్రేషన్, ఫుడ్ పాయిజనింగ్, బాక్టీరియల్ ఇన్ఫెక్షన్లు వచ్చే ప్రమాదం పెరుగుతుంది. దీంతో, రోగాల బారిన పడే అవకాశం ఉంది. అయితే, రోగనిరోధక శక్తి పెంచుకోవడానికి కొన్ని చిట్కాలు పాటిస్తే సరిపోతుంది.

పోషకాహారం ముఖ్యం (సమతుల్య ఆహారం)

ఇమ్యూనిటీ పవర్ అనేది ఏదో ఒక్క రోజులో వచ్చేది కాదు. ఇది మనం రోజూ తినే ఆహారంపై ఆధారపడి ఉంటుంది.

  1. విటమిన్ C: ఉసిరి, నిమ్మ, నారింజ వంటి సిట్రస్ పండ్లు, జామకాయలు ఎక్కువగా తీసుకోవాలి. ఇవి ఇన్ఫెక్షన్లతో పోరాడే శక్తినిస్తాయి.
  2. జింక్ (Zinc): పప్పు ధాన్యాలు, గింజలు అంటే బాదం పప్పు, జీడిపప్పు, గుమ్మడి గింజలు, వాల్‌నట్స్ వంటివి తీసుకోవడం వల్ల వైరస్‌ల నుంచి రక్షణ లభిస్తుంది.
  3. ప్రోటీన్: పప్పులు, గుడ్లు, పనీర్ వంటి పదార్థాలు కండరాలకు, శరీర నిర్మాణానికి బలాన్నిస్తాయి.
  4. ప్రోబయోటిక్స్: పెరుగు లేదా పులియబెట్టిన ఆహారం తీసుకోవడం వల్ల జీర్ణక్రియ మెరుగుపడి పొట్ట ఆరోగ్యంగా ఉంటుంది.
  5. తీసుకోవాల్సిన ఇతర ఆహారాలు: పసుపు, తేనె, అల్లం, ధనియాలు వంటి వాటిని ఆహారాల్లో భాగం చేసుకోండి.

నీటి వినియోగాన్ని పెంచండి (హైడ్రేషన్)

వేసవికాలంలో చెమట ఎక్కువగా పడుతుంది. ఇది డీహైడ్రేషన్, తక్కువ రక్తపోటు, అలసట, తలనొప్పి, వడదెబ్బకు దారితీస్తుంది.

1) ఏం చేయాలి?

  • నీరు తాగడం చాలా ముఖ్యం. రోజంతా కనీసం 3-4 లీటర్ల నీరు తాగాలి. కొబ్బరి నీళ్లు, నిమ్మరసం, మామిడి పన్నా, మజ్జిగ వంటి సహజ పానీయాలు తాగితే మంచి ఫలితాలు ఉంటాయి.
  • ఎక్కువ కెఫిన్, సోడా ఉన్న డ్రింక్స్ తాగడం మానుకోండి. ఎందుకంటే ఇవి శరీరాన్ని మరింత డీహైడ్రేట్ చేస్తాయి.
  • ఖాళీ కడుపుతో కూల్ ఎక్కువగా ఉన్న నీరు తాగడం మానుకోండి. అది గొంతు నొప్పికి కారణమవుతుంది. గోరువెచ్చగా నీరు తాగడం మంచిది.

2) ఎలా ఫాలో అవ్వాలి?

  • మీకు నీరు తాగడం గుర్తుండకపోతే ఫోన్‌లో టైమ్ రిమైండర్‌ను సెట్ చేసుకోండి.
  • మీరు కావాలనుంటే మీతో పాటే ఒక వాటర్ బాటిల్ ఉంచుకోండి.
  • టీ, కాఫీ బదులు తులసి లేదా అల్లం టీ తాగడం వల్ల శ్వాసకోశ సంబంధిత సమస్యలు తగ్గుతాయి.

సీజనల్ పండ్లు, కూరగాయలు తినండి

వేసవిలో దొరికే పండ్లు, కూరగాయల్లో సహజంగానే ఎక్కువ నీరు ఉంటుంది. ఇది శరీరానికి హైడ్రేషన్, అవసరమైన పోషణను అందిస్తుంది. వీటిలో విటమిన్లు, ఖనిజాలు, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి శరీర రోగనిరోధక శక్తిని బలపేతం చేస్తాయి.

1) ఏం తినాలి?

  • పుచ్చకాయ, సీతాఫలం, బొప్పాయి, నారింజ, మామిడి, పైనాపిల్ వంటి పండ్లను తినండి. ఇవి శరీరానికి శక్తిని, తేమను అందిస్తాయి.
  • దోసకాయ, టమాటా, సొరకాయ, బీరకాయ, పాలకూర వంటి కూరగాయల్ని భాగం చేసుకోండి. ఇవి జీర్ణవ్యవస్థకు మేలు చేస్తాయి.

2) ఎలా తీసుకోవాలి?

  • పండ్లు, కూరగాయల్ని తాజాగా, సహజ రూపంలో తినండి.
  • ఎక్కువగా ఉడికించిన లేదా వేయించిన ఆహారం ఆరోగ్యానికి హానికరం.
  • సలాడ్లు, కూరలు, వంటల రూపంలో తీసుకోండి. కావాలనుకుంటే స్మూతీలు, జ్యూసుల రూపంలో కూడా తీసుకోవచ్చు.

వేటికి దూరంగా ఉండాలి?

  1. అధిక చక్కెర, మైదాతో చేసిన జంక్ ఫుడ్స్‌ను తగ్గించాలి. ఇవి శరీరంలోని రోగనిరోధక శక్తిని బలహీనపరుస్తాయి.
  2. వేసవిలో కారంగా, నూనెతో కూడిన ఆహారాలు జీర్ణం కావడం కష్టం. వీటిని ఎక్కువగా తింటే అసిడిటీ, ఉబ్బరం, కడుపు నొప్పి, ఫుడ్ పాయిజనింగ్ వంటి సమస్యలు వస్తాయి.
  3. కేవలం సప్లిమెంట్లు మీదనే ఆధారపడకుండా సహజమైన ఆహారం, క్రమశిక్షణతో కూడిన జీవనశైలిని కూడా పాటించండి.

తీసుకోవాల్సిన జాగ్రత్తలు

మారిన వాతావరణాన్ని ఎదుర్కోవడానికి ఆహారంతో పాటు కొన్ని అలవాట్లు కూడా చాలా అవసరం.

  • తగినంత నిద్ర: రోజుకు కనీసం ఏడు నుంచి 8 గంటల గాఢ నిద్ర పోవాలి. ఇందుకు తగిన ప్లాన్ చేసుకోండి. రాత్రి త్వరగా నిద్రపోండి. ఉదయాన్నే మేల్కొండి. దీని వల్ల అలసట, బలహీనత ఉండవు.
  • శుభ్రత: చేతుల్ని తరుచుగా శుభ్రంగా కడుక్కోవడం వల్ల వైరస్ వ్యాప్తిని అడ్డుకోవచ్చు.
  • ఉష్ణోగ్రత మార్పు: ఒక్కసారిగా ఎండ నుంచి ఏసీలోకి రావడం, ఏసీ నుంచి బయట ఎండలోకి రావడం వంటివి చేయకూడదు. వడదెబ్బ తగిలే ప్రమాదం ఉంటుంది.

చివరగా ఏం తెలుసుకోవాలి?

వాతావరణం మారుతున్నప్పుడు మన రోజువారీ అలవాట్లలో చిన్న చిన్న మార్పులు చేసుకోవడం ద్వారా అనారోగ్యాల బారిన పడకుండా ఉండవచ్చు. సమతుల్య ఆహారంతో పాటు తగినంత నీరు తాగడం, నిద్రపోవడం, వ్యాయామం ద్వారా సీజనల్ వ్యాధుల బారిన పడకుండా కాపాడుకోవచ్చు. మీకు దగ్గు, జలుబు నిరంతరంగా ఉంటే వైద్యుణ్ని సంప్రదించి తగిన సలహా తీసుకోవడం చాలా ముఖ్యం.

 


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Boost Immunity
  • healthy benefits
  • healthy tips
  • Life Style
  • Life Style Benefits
  • weather

Related News

Why do Indians love spicy foods...?

Spicy Food: ఇండియన్లు స్పైసీ ఫుడ్స్‌ను ఎందుకు ఇష్టపడతారు…?

భారతీయ వంటకాలు ఎక్కువగా స్పైసీగా ఉంటాయి. ఇక్కడి వంటకాలు మసాలాతో నిండి ఉంటాయి. స్పైసీ కంటెంట్ విషయంలో అస్సలు రాజీపడరు. కారంగా ఉన్న ఆహారాన్నే భారతీయులు ఇష్టపడుతుంటారు. ఇది రుచితో పాటు ఆరోగ్యానికి కూడా మంచిది. వాస్తవానికి మసాలా పరిమాణం సాధారణం కంటే తక్కువగా ఉన్నట్లయితే… ఆహారం చప్పగా ఉంటుంది. ప్రాథమిక ప్రమాణాలతో పోల్చితే సాధారణం కంటే చాలా ఎక్కువ. అయితే స్పైసీ ఫుడ్స్ ఎక

  • Excessive intake of Vitamin D is dangerous.

    Vitamin D: విటమిన్ డి ఎక్కువగా తీసుకుంటే ప్రమాదం

  • The impact of depression is greater in women.

    Depression in Women: డిప్రెషన్ ప్రభావం మహిళల్లోనే ఎక్కువ

  • Suffering from gastric problems? Do this, and your problem will vanish in a jiffy.

    Gastric Problem: గ్యాస్ట్రిక్ సమస్యతో బాధపడుతున్నారా? ఇలా చేస్తే మీ సమస్య చిటికెలో మాయం!

Latest News

  • Hormone: బెల్లీ ఫ్యాట్ పెరుగుతుందంటే ఈ హార్మోన్ ఎక్కువగా ఉన్నట్లే..!

  • LPG Gas Subsidy: గ్యాస్ వినియోగదారులకు అలర్ట్.. జూన్ 30 వరకే డెడ్ లైన్.. ఇవి తప్పక పాటించాల్సిందే.. లేదంటే కనెక్షన్ కట్

  • Andhra Pradesh: పెన్షన్ల కోసం వేచి చూస్తున్న వారికి ప్రభుత్వం గుడ్ న్యూస్..

  • Vaibhav Suryavanshi: వైభవ్ సూర్యవంశీ, విషెన్ హలంబగే గొడవపై స్పందించిన క్రికెట్‌ బోర్డు.. శ్రీలంక క్రికెటర్‌కే భారీ జరిమానా

  • Pawan Kalyan: నిరంజన్ ఇంటికి పవన్ కళ్యాణ్.. అభిమాని చివరి కోరిక తీర్చనున్న జనసేనాని!

Trending News

    • లక్షల ఉద్యోగం వదిలి హైదరాబాద్‌లో ఊబర్ జాబ్.. ప్రతి ఒక్కరు తెలుసుకోవాల్సిన ఇన్స్పిరేషనల్ స్టోరీ

    • అస్సాంలో కూలిన IAF AN-32 విమానం.. రంగంలోకి రెస్క్యూ టీమ్స్!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd