HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Health
  • >Excessive Intake Of Vitamin D Is Dangerous

Vitamin D: విటమిన్ డి ఎక్కువగా తీసుకుంటే ప్రమాదం

  • Author : Vamsi Chowdary Korata Date : 13-06-2026 - 11:41 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Excessive intake of Vitamin D is dangerous.
Excessive intake of Vitamin D is dangerous.

అతి ఏదైనా అనర్థమే… ఇది ఆరోగ్యం విషయంలో ఖచ్చితంగా వర్తిస్తుంది. విటమిన్లను సరైన పద్ధతిలో తీసుకుంటే ఇబ్బందేమీ ఉండదు. అదే ఎక్కువైతే మాత్రం సమస్యలు తలెత్తుతాయి. సాధారణంగా విటమిన్ సప్లిమెంట్స్

గాయాలను నయం చేయడంలోనూ, సెల్యులార్ డ్యామేజ్‌ని సరిచేయడంలోనూ, రోగనిరోధక శక్తిని పెంచడం వంటి వాటిలో సహాయపడతాయి. విటమిన్ల లోపం స్కర్వీ, రక్తహీనత, రికెట్స్ వంటి వ్యాధులకు దారి తీస్తుంది, వీటిని అధిగమించేందుకు విటమిన్స్ తీసుకుంటుంటారు. అయితే చాలా తక్కువ మందికి తెలిసిన వాస్తవం ఏమిటంటే, ఈ పోషకాలు ఎక్కువగా తీసుకుంటే మీకు కొన్ని దుష్ప్రభావాలు కూడా వస్తాయి.

విటమిన్-డి లోపం మన దేశంలో చాలా సర్వసాధారణంగా మారిపోయింది. దాదాపు 76% మంది భారతీయులకు విటమిన్ డి తగినంత స్థాయిలో లేదని సర్వేలో తేలింది. కొన్ని సార్లు సూర్యరశ్మి అనుకున్నంతగా శరీరానికి తగలకపోవడం విటమిన్ డి లోపానికి ప్రధాన కారణం. ఈ లోపాన్ని అధిగమించడానికి విటమిన్ డి సప్లిమెంట్లను తీసుకుంటారు. డాక్టర్ ప్రిస్క్రిప్షన్‌పై సప్లిమెంట్లను తీసుకోవడం ఆరోగ్యానికి ప్రయోజనం చేకూరుస్తుంది, అయితే వాటి తీసుకోవడంలో ఏ మాత్రం అజాగ్రత్తగా ఉన్నా తీవ్రమైన ఆరోగ్య సమస్యలకు దారి తీస్తుంది. వీటిలో ముఖ్యమైనవి రక్తంలో కాల్షియం యొక్క అధిక స్థాయికి సంబంధించినవి. రక్త ప్రసరణలో కాల్షియం స్థాయి పెరగడం వల్ల కణజాలం, అవయవాలు కూడా దెబ్బతింటాయి. ముఖ్యంగా మూత్రపిండాలపై వీటి దుష్ప్రభావం ఎక్కువగానే ఉంటుందని తెలుస్తోంది.

అలాగే రక్తంలో అధిక స్థాయి కాల్షియం తీవ్రమైన ఎముక సమస్యలకు కూడా దారితీస్తుందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ఇది ఒక వ్యక్తి వెన్నెముకపై ప్రభావం చూపుతుందని చెబుతున్నారు. శరీరంలో విటమిన్ డి సమృద్ధిగా ఉండటం వల్ల ఊపిరితిత్తుల సమస్యలు కూడా తలెత్తే అవకాశం ఉంది. దీనివల్ల ఛాతీ నొప్పి, దగ్గు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు ఎదురవుతాయి. ఇక పెద్ద మోతాదులో విటమిన్ డి తీసుకోవడం వల్ల ఆకలిని కోల్పోవడం, అతిసారం, మలబద్ధకం వంటి సమస్యలు ఉత్పన్నమవుతాయి. అందుకే విటమిన్ డి సప్లిమెంట్స్ వైద్యుల సూచన మేరకు తగిన మోతాదులోనే వాడడం ఉత్తమం.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • best health benefits
  • health care
  • healthy benefits
  • Natural Sources of Vitamin D
  • vitamin D
  • vitamin d causes
  • vitamin d deficiency
  • vitamin D supplements
  • Vitamin D3
  • Vitamin deficiency

Related News

7 Tips to Curb Insomnia for Stress Management

Stress Management Tips: స్ట్రెస్ మేనేజ్‌మెంట్ కోసం.. నిద్రలేమిని అరికట్టే 7 టిప్స్

Stress Management: “ఒత్తిడి” అనేది మనం చేసే రోజువారీ కార్యకలాపాలకు శరీరం యొక్క సహజ ప్రతిస్పందన. రోజూ సరిగ్గా నిద్రపోకపోవడం వల్ల కూడా ఒత్తిడి పెరుగుతుంది. నిద్రలేమి వల్ల కలిగే అలసట మిమ్మల్ని ఒత్తిడిలోకి నెట్టేస్తుంది. నిద్రలేమి సమస్యకు గల ప్రధాన కారణాల్లో ముఖ్యమైనది ఫోన్‌కు అడిక్ట్ కావడం. నిద్రపోవడానికి ముందు వరకు ఫోన్‌లో మునిగిపోవడం అనేది మీ నిద్ర నాణ్యతను దెబ్బతీస్తుంది.

    Latest News

    • Atluri Prasanna: అమెరికాలో ఘోర ప్రమాదం.. ఎన్టీఆర్‌ జిల్లా యువతి మృతి

    • Singareni: సింగరేణి కార్మికులకు గుడ్ న్యూస్.. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి

    • Stock Market: స్వల్ప నష్టాల్లో ముగిసిన దేశీయ సూచీలు

    • Delhi High Court: ‘ప్రతి పోస్ట్‌ను పర్యవేక్షించలేం’.. తాము ‘సూపర్ సెన్సార్లు’ కాము అని ఢిల్లీ హైకోర్టుకు గూగుల్, మెటా తెలిపాయి

    • Wayanad Landslide: వయనాడ్‌లో భారీ వర్షాలుకు విరుచుకుపడిన కొండచరియలు..

    Trending News

      • Kissing Day: ఆవేశపూరితమైన ముద్దు నిమిషానికి 6.4 కేలరీల ఖర్చు చేస్తుంది

      • Kalyan Ram : సంక్రాంతి 2027కు సిద్ధమవుతున్న అనిల్ రావిపూడి.. కళ్యాణ్ రామ్ ఫస్ట్ లుక్‌ పోస్టర్ విడుదల !

      • ఇరాక్‌లో భారీ అవినీతి తిమింగలం! ఆ ఎంపీ ఇంట్లో బంగారు లోదుస్తులు లభ్యం..

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2026 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd