Koil Alwar Thirumanjanam: తిరుమల శ్రీవారి ఆలయంలో శాస్త్రోక్తంగా కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం!
తిరుమల శ్రీవారి ఆలయంలో కోయిల ఆల్వార్ తిరుమంజనం (Koil Alwar Thirumanjanam) ఘనంగా నిర్వహించారు.
- Author : Gopichand
Date : 09-07-2024 - 9:46 IST
Published By : Hashtagu Telugu Desk
Koil Alwar Thirumanjanam: తిరుమల శ్రీవారి ఆలయంలో కోయిల ఆల్వార్ తిరుమంజనం (Koil Alwar Thirumanjanam) ఘనంగా నిర్వహించారు. మంగళవారం ఉదయం 6 గంటలకు ప్రారంభమైన ఆలయ శుద్ధి కార్యక్రమం 8 గంటల వరకు సాగిన ఈ సందర్భంగా ఆలయాన్ని సుగంధ ద్రవ్యాలు లేపనాలతో కలిపి శుభ్రం చేశారు. అంతకుముందు వేడి నీటితో ఆలయ గోడలను, గర్భగుడిని ఆనంద నిలయాన్ని శుభ్రం చేశారు. తర్వాత పచ్చ కర్పూరంతో పాటు కొన్ని మూలిక లేపనాలను కలిపి గోడలకు పూశారు. ఈ తంతు నిర్వహిస్తున్నప్పుడు స్వామివారి మూలవిరాట్ కు వస్త్రం కప్పి గర్భగుడి లోపలకు కూడా శుభ్రపరిచారు.
ఈ కార్యక్రమంలో టిటిడి ఈవో శ్యామల రావుతో పాటు ఆలయ అధికారులు, అర్చకులు సిబ్బంది పాల్గొన్నారు. 16న ఆణివార ఆస్థానం ఉన్నందున అంతకుముందు మంగళవారం నాడు ఆలయ శుద్ధి కార్యక్రమాన్ని నిర్వహించడం రివాజు. అందులో భాగంగానే ఈరోజు కోయిల్ అల్వార్ తిరుమంజనాన్ని నిర్వహించారు. జూలై 16వ తేదీన ఆణివార ఆస్థానం సందర్భంగా ఆలయంలో కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం నిర్వహించడం ఆనవాయితీ. ఇందులో భాగంగా ఉదయం 6 గంటలకు ప్రారంభమైన తిరుమంజనం కార్యక్రమం సుమారు 5 గంటలపాటు కొనసాగనుంది. అనంతరం మధ్యాహ్నం 12 గంటల నుండి భక్తులను స్వామివారి దర్శనానికి అనుమతిస్తారు.
Also Read: VN Aditya : అమెరికాలో కొత్త సినిమా తీస్తున్న తెలుగు దర్శకుడు.. ఆడిషన్స్ కూడా అక్కడే..
తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది. భక్తులతో అన్ని కంపార్టుమెంట్లు నిండిపోయాయి. టోకెన్లు లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 12 గంటల సమయం పడుతోంది. సోమవారం స్వామి వారిని 63,619 మంది భక్తులు దర్శించుకున్నారు. 28,572 మంది తలనీలాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. భక్తులు సమర్పించిన కానుకల ద్వారా శ్రీవారి హుండీ ఆదాయం రూ.3.78 కోట్లు వచ్చిందని టీటీడీ అధికారులు తెలిపారు. టీటీడీ ఈవోగా శ్యామలరావు బాధ్యతలు చేపట్టాక పలు కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఈ క్రమంలోనే అనేస సేవా కార్యక్రమాలు సైతం చేపట్టారు.
We’re now on WhatsApp : Click to Join