Ram Charan Cutout: రామ్ చరణ్ భారీ కటౌట్.. ఎన్ని అడుగులు అంటే?
రాజమౌళి మూవీ తెరకెక్కించిన త్రిబుల్ ఆర్ మూవీ తర్వాత రామ్ చరణ్ నుంచి వస్తోన్న సినిమా కావటంతో ఫ్యాన్స్ సైతం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ మూవీ నుంచి విడుదలైన సాంగ్స్, టీజర్, ఫొటోలు ఇప్పటికే సినిమాపై క్రేజ్‌ను పెంచుతున్నాయి.
- Author : Gopichand
Date : 28-12-2024 - 11:51 IST
Published By : Hashtagu Telugu Desk
Ram Charan Cutout: రామ్ చరణ్ హీరోగా శంకర్ దర్శకత్వంలో వస్తోన్న మూవీ గేమ్ ఛేంజర్. సామాజిక అంశాలతో కమర్షియల్ మూవీగా తెరకెక్కించిన గేమ్ ఛేంజర్ జనవరి 10, 2025న విడుదల కానుంది. ఇకపోతే ఈ సినిమాపై మెగా అభిమానులు చాలా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన టీజర్, సాంగ్స్, ప్రొమోలు, స్టిల్స్ అన్ని సినిమాపై విపరీతమైన బజ్‌ను క్రియేట్ చేశాయి. ఈ మూవీలో రామ్ చరణ్ సరసన కియరా అద్వానీ నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ మూవీలో శ్రీకాంత్, ఎస్‌జే సూర్య, సునీల్, అంజలి, తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ మూవీకి దిల్ రాజు నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.
రామ్ చరణ్- శంకర్ కాంబినేషన్‌లో వస్తోన్న మూవీ గేమ్ ఛేంజర్. ఈ సినిమా జనవరి 10న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ క్రమంలో 256 అడుగుల ఎత్తుతో రామ్ చరణ్ భారీ కటౌట్‌ను (Ram Charan Cutout) అభిమానులు ఏర్పాటు చేశారు. విజయవాడలోని రామ్ చరణ్ యువశక్తి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ కటౌట్‌ని ఆదివారం మధ్యాహ్నం 3 గంటలకు ‘గేమ్ ఛేంజర్’ మూవీ టీమ్ ఆవిష్కరించనుంది.
Also Read: Telangana Temperatures: తెలంగాణలో మళ్ళీ పడిపోయిన ఉష్ణోగ్రతలు
రాజమౌళి మూవీ తెరకెక్కించిన త్రిబుల్ ఆర్ మూవీ తర్వాత రామ్ చరణ్ నుంచి వస్తోన్న సినిమా కావటంతో ఫ్యాన్స్ సైతం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ మూవీ నుంచి విడుదలైన సాంగ్స్, టీజర్, ఫొటోలు ఇప్పటికే సినిమాపై క్రేజ్‌ను పెంచుతున్నాయి. అయితే ఈ మూవీకి సంబంధించి తెలుగులో ప్రీ రిలీజ్ ఈవెంట్ జనవరి 4న ఏపీలో నిర్వహించనున్నట్లు తెలుస్తోంది. ఈ ఈవెంట్‌కు ముఖ్య అతిథిగా డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ రానున్నట్లు సమాచారం. గేమ్ ఛేంజర్ మూవీని దిల్ రాజ్ భారీ బడ్జెట్‌తో తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే.
ఇకపోతే రామ్ చరణ్ ప్రస్తుతం గేమ్ ఛేంజర్ మూవీ తర్వాత ఉప్పెన దర్శకుడు బుచ్చిబాబుతో ఆర్‌సీ 16 వర్కింగ్ టైటిల్‌లో ఓ మూవీ చేస్తోన్న విషయం తెలిసిందే. ఈ మూవీ స్పోర్ట్స్ బ్యాక్‌డ్రాప్‌లో రానుంది. ఈ సినిమాలో హీరోయిన్‌గా జాన్వీ కపూర్ నటిస్తోంది. అయితే ఆర్‌సీ 16 మూవీకి సంబంధించిన ఓ షెడ్యూల్ కూడా పూర్తైనట్లు దర్శకుడు బుచ్చిబాబు ఇటీవల ఓ ఈవెంట్‌లో చెప్పారు.