Telangana Temperatures: తెలంగాణలో మళ్ళీ పడిపోయిన ఉష్ణోగ్రతలు
చలి వాతావరణం రోజురోజుకూ పెరుగుతోంది. రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లో కనిష్ట రాత్రి ఉష్ణోగ్రతలు 15 డిగ్రీల కంటే తక్కువగా నమోదవుతున్నాయి.
- Author : Gopichand
Date : 28-12-2024 - 11:41 IST
Published By : Hashtagu Telugu Desk
Telangana Temperatures: చలికాలం అంటేనే ఉష్ట్రోగ్రతలు (Telangana Temperatures) పూర్తిగా పడిపోతాయి. ఈ సీజన్‌లో చిన్న పిల్లల నుంచి వృద్ధుల వరకు మాత్రమే కాదు.. కండలు తిరిగిన వస్తాద్‌లు అయినా చలికాలంలో వణకాల్సిందే. అయితే అధికారులు ఎప్పటికప్పుడూ చలికాలంలో ప్రజలకు సమాచారం ఇస్తూ డైలీ ఉష్ణోగ్రతల గురించి సమాచారం అందిస్తుంటారు. అయితే ఈ మధ్యకాలంలో తెలంగాణలో ఉష్ణోగ్రతలు తీవ్ర స్థాయిలో పడిపోతున్నాయి. తాజాగా తెలంగాణలో మళ్ళీ ఉష్ణోగ్రతలు పడిపోయాయి.
చలి వాతావరణం రోజురోజుకూ పెరుగుతోంది. రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లో కనిష్ట రాత్రి ఉష్ణోగ్రతలు 15 డిగ్రీల కంటే తక్కువగా నమోదవుతున్నాయి. ఉత్తర, మధ్య తెలంగాణ జిల్లాల్లో చలి తీవ్రత ఎక్కువగా ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఇక తెలంగాణలో రెండు రోజులు వానలతో చలి తీవ్రత ఎక్కువగా పెరిగింది. ఉమ్మడి మెదక్ జిల్లాలో మరోసారి ఉష్ణోగ్రతలు పడిపోయాయి. మెదక్, సంగారెడ్డి, సిద్దిపేట జిల్లాలకు వాతావరణ శాఖ ఎల్లో అలెర్ట్ జారీ చేసింది.
Also Read: Rythu Bharosa: రైతు భరోసాపై మంత్రి కీలక వ్యాఖ్యలు.. వారు మాత్రమే అర్హులు!
పలుచోట్ల పొగమంచు కమ్ముకుంది. సంగారెడ్డి జిల్లా కోహిర్ 13.1, నల్లవల్లి 14.2, అల్గోల్ 14.9 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత నమోదు కాగా.. మెదక్ జిల్లా శివంపేట 13.9, కాగజ్ మద్దూర్ 15.2 డిగ్రీల ఉష్ణోగ్రత, సిద్దిపేట జిల్లా అంగడి కిష్టాపూర్ 14.9, కొండపాక 15.3 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత నమోదు అయ్యాయి. అయితే సాధారణంగా తెలుగు రాష్ట్రాల్లో డిసెంబర్‌లో చలి ఎక్కువగా ఉంటుంది.
కానీ తెలంగాణలో గత నెల నవంబర్‌లోనే చలి మొదలై అల్పపీడన ప్రభావంతో పరిస్థితి ఒక్కసారిగా మారిపోయింది. అంటే ఈ చలిని తెలంగాణ ప్రజలు మరికొద్ది రోజులు భరించాల్సిందే. ఈ అల్పపీడన ప్రభావం ముగిసిన తర్వాత కూడా తెలంగాణలో చలిగాలులు కొనసాగుతాయి. ఎందుకంటే సాధారణంగా చలికాలం జనవరిలో ఎక్కువగా ఉంటుంది. ముఖ్యంగా ఈ నెల మధ్యలో వచ్చే సంక్రాంతి పండుగ సమయంలో చలి తీవ్రత ఎక్కువగా ఉంటుంది. ఫిబ్రవరిలో ఈ చలి తీవ్రత తగ్గుతుంది.