HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Cinema
  • >Game Changer Trailer Drops On 2 01 2025

Game Changer Trailer: గేమ్ ఛేంజ‌ర్ మూవీ నుంచి బిగ్ అప్డేట్‌..!

ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లను డ‌ల్లాస్‌లో నిర్వ‌హించిన చిత్ర యూనిట్ ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో ఈవెంట్‌ను భారీ స్థాయిలో ఏర్పాటు చేస్తున్నారు. ఈ కార్య‌క్ర‌మానికి ముఖ్య అతిథిగా ఏపీ డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ల్యాణ్ హాజ‌రుకానున్న‌ట్లు నిర్మాత దిల్ రాజు ఇప్ప‌టికే ప్ర‌క‌టించారు.

  • Author : Gopi Date : 01-01-2025 - 10:23 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Game Changer Trailer
Game Changer Trailer

Game Changer Trailer: మెగా అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న గ్లోబ‌ల్ స్టార్ రామ్ చర‌ణ్ న‌టించిన గేమ్ ఛేంజ‌ర్ నుంచి మేక‌ర్స్ ఓ బిగ్ అప్టేట్‌ను ఎనౌన్స్ చేశారు. ఈ మూవీకి సంబంధించిన ట్రైల‌ర్‌ను (Game Changer Trailer) జ‌న‌వ‌రి 2వ తేదీన సాయంత్రం 5.04 గంట‌ల‌కు విడుద‌ల చేయ‌నున్న‌ట్లు చిత్ర‌బృందం తాజాగా విడుద‌ల చేసింది. అంతేకాకుండా ఇంకా ఆట మొద‌లు అనే క్యాప్ష‌న్‌ను ట్వీట్‌లో పేర్కొంది. మూవీ విడుద‌ల చేసిన ఈ పోస్ట్‌లో రామ్ చ‌ర‌ణ్ తెల్ల‌, లుంగీ పంచె క‌ట్టుకుని యాంగ్రీ లుక్‌లో క‌నిపిస్తున్నాడు.

ఇప్ప‌టికే ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లను డ‌ల్లాస్‌లో నిర్వ‌హించిన చిత్ర యూనిట్ ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో ఈవెంట్‌ను భారీ స్థాయిలో ఏర్పాటు చేస్తున్నారు. ఈ కార్య‌క్ర‌మానికి ముఖ్య అతిథిగా ఏపీ డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ల్యాణ్ హాజ‌రుకానున్న‌ట్లు నిర్మాత దిల్ రాజు ఇప్ప‌టికే ప్ర‌క‌టించారు. అయితే ఈ ఈవెంట్ వేదిక ఇంకా ఖ‌రారు కాలేదు. విజ‌య‌వాడ లేదా రాజ‌మండ్రిలో గేమ్ ఛేంజ‌ర్‌కు సంబంధించిన ప్రీ రిలీజ్ ఈవెంట్ జ‌ర‌గ‌నుంద‌ని తెలుస్తోంది.

Also Read: Visakha Cruise Terminal : 2025 మార్చి నుంచి విశాఖ క్రూజ్‌ టెర్మినల్‌ యాక్టివిటీ.. విశేషాలివీ

A blockbuster start to the year already! #GameChangerTrailer drops on 2.01.2025!❤️‍🔥😎

Let The Games Begin 💥❤️‍🔥#GameChanger #GameChangerOnJanuary10 pic.twitter.com/jvJeemY9Dd

— Game Changer (@GameChangerOffl) January 1, 2025

రామ్ చ‌ర‌ణ్ న‌టించిన గేమ్ ఛేంజ‌ర్‌ని త‌మిళ ద‌ర్శ‌కుడు శంక‌ర్ డైరెక్ట్ చేశారు. ఈ మూవీని భారీ స్థాయిలో దిల్ రాజు నిర్మించారు. ఇప్ప‌టికే ఈ మూవీ నుంచి విడుద‌లైన టీజ‌ర్‌, సాంగ్స్‌, స్టిల్స్ అన్ని మెగా అభిమానుల‌ను విప‌రీతంగా ఆకట్టుకుంటున్నాయి. ఈ సినిమాని సంక్రాంతి కానుక‌గా జ‌న‌వ‌రి 10వ తేదీన ప్రేక్ష‌కుల ముందుకు తీసుకురానున్నారు. ఈ ప్ర‌తిష్ఠాత్మ‌క సినిమాలో రామ్ చ‌ర‌ణ్‌తో పాటు హీరోయిన్‌గా కియ‌రా అద్వానీ, న‌టులు ఎస్‌జే సూర్య‌, శ్రీకాంత్‌, జ‌య‌రామ్‌, అంజ‌లి, సునీల్‌, బ్ర‌హ్మానందం, అలీ, త‌దిత‌రులు కీల‌క పాత్ర‌లు పోషిస్తున్నారు.

చ‌ర‌ణ్ న‌టించిన చివ‌రి చిత్రం ఆర్ఆర్ఆర్‌. ఈ మూవీ ఎంత‌టి ఘ‌న‌విజ‌యం సాధించిందో మ‌నంద‌రికీ తెలిసిందే. అయితే గేమ్ ఛేంజ‌ర్‌పై కూడా అభిమానులు భారీ స్థాయిలో ఆశ‌లు పెట్టుకున్నారు. గేమ్ ఛేంజ‌ర్ త‌ర్వాత రామ్ చ‌ర‌ణ్ బుచ్చిబాబు ద‌ర్శ‌క‌త్వంలో (ఆర్‌సీ 16) న‌టిస్తున్నారు. ఈ సినిమా త‌ర్వాత సుకుమార్ ద‌ర్శ‌క‌త్వంలో మూవీ చేయ‌నున్నారు రామ్ చ‌ర‌ణ్‌.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Game Changer
  • Game Changer Trailer
  • kiara advani
  • movie updates
  • Producer Dil Raju
  • ram charan
  • shankar
  • telugu movies
  • tollywood

Related News

    Latest News

    • Nandu’s World Nandana: మా మీద కావాలనే కుట్ర.. డబ్బులిచ్చి సోషల్ మీడియా లో దుష్ర్పచారం Nandu’ s world సంచలనం

    • ED : వేదాంత గ్రూప్ కంపెనీల్లో ఈడీ సోదాలు.. ఫెమా ఉల్లంఘనలపై దర్యాప్తు

    • Weight Loss: బరువు తగ్గడం ఇంత ఈజీనా.. ఇది తెలియక ఇన్నాళ్లు ఎన్నో అవస్థలు!

    • Telangana Formation Day: తెలంగాణ ఆవిర్భావ వేడుకల్లో.. నిరుద్యోగులకు సీఎం రేవంత్ రెడ్డి గుడ్‌న్యూస్

    • Minior Girl : హైదరాబాద్‌లో మైనర్ బాలిక ఆత్మహత్య

    Trending News

      • Kalita Majhi: అప్పట్లో ఇంటి పనిమనిషి.. నేడు బెంగాల్‌ మంత్రి

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2026 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd