HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Andhra Pradesh
  • >Visakha Cruise Terminal Will Be Active From March 2025

Visakha Cruise Terminal : 2025 మార్చి నుంచి విశాఖ క్రూజ్‌ టెర్మినల్‌ యాక్టివిటీ.. విశేషాలివీ

వైజాగ్ ఐసీటీ టెర్మినల్(Visakha Cruise Terminal) నుంచి యాక్టివిటీని సాగించాలని కోరేందుకు కార్డిలియా, రాయల్ కరేబియన్, ఎంఎస్‌సీ వంటి ప్రముఖ క్రూజ్ లైనర్లతో ప్రస్తుతం ఏపీ ప్రభుత్వ అధికారులు చర్చలు జరుపుతున్నారు.

  • Author : Pasha Date : 01-01-2025 - 10:14 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Visakha Cruise Terminal Visakhapatnam Andhra Pradesh

Visakha Cruise Terminal : విశాఖ నగరాన్ని అంతర్జాతీయ టూరిజం కేంద్రంగా మార్చే దిశగా మరో ముందడుగు పడింది. నౌక ఆకారంలో నిర్మించిన వైజాగ్‌ ఇంటర్నేషనల్‌ క్రూజ్‌ టెర్మినల్‌ (ఐసీటీ)  రెడీ అయింది. ఈ సంవత్సరం మార్చి నుంచి వైజాగ్ ఐసీ‌టీలో పూర్తిస్థాయి కార్యకలాపాలు మొదలుకానున్నాయి. 2వేల మంది ప్రయాణికులను తీసుకెళ్లే సామర్థ్యం కలిగిన క్రూజ్ నౌకలను నిలిపేందుకు అనువుగా ఈ టెర్మినల్‌ను నిర్మించారు. ఇందులో కస్టమ్స్ విభాగం కౌంటర్, ఇమిగ్రేషన్ విభాగం కౌంటర్, రిటైల్ దుకాణాలు, డ్యూటీఫ్రీ సరుకులు విక్రయించే దుకాణాలు, ఫుడ్ కోర్టులు, లాంజ్‌లు వంటివన్నీ ఉంటాయి.

Also Read :Trains Timings Changed : ఈరోజు నుంచి రైళ్ల ప్రయాణ వేళల్లో మార్పులు.. ఇవి తెలుసుకోండి

వైజాగ్ ఐసీటీ టెర్మినల్(Visakha Cruise Terminal) నుంచి యాక్టివిటీని సాగించాలని కోరేందుకు కార్డిలియా, రాయల్ కరేబియన్, ఎంఎస్‌సీ వంటి ప్రముఖ క్రూజ్ లైనర్లతో ప్రస్తుతం ఏపీ ప్రభుత్వ అధికారులు చర్చలు జరుపుతున్నారు. వైజాగ్ ఐసీటీ నుంచి మన దేశంలోని చెన్నై, సుందర్ బన్స్‌కు క్రూజ్ సర్వీసులను ప్రారంభించే అవకాశం ఉంది. దీంతోపాటు  సింగపూర్, థాయ్‌లాండ్, శ్రీలంక వంటి అంతర్జాతీయ గమ్యస్థానాలకు కూడా ఈ సర్వీసులు మొదలయ్యే ఛాన్స్ ఉంది. 

Also Read :New Year Celebrations: మొత్తం ఎన్ని దేశాల్లో న్యూ ఇయ‌ర్ వేడుక‌లు జ‌రిగాయో తెలుసా?

వైజాగ్ ఇంటర్నేషనల్ క్రూజ్ టెర్మినల్‌ను మొత్తం రూ.96.05 కోట్లతో నిర్మించారు. ఇందులో రూ.57.55 కోట్లను విశాఖ పోర్ట్ ట్రస్ట్, రూ.38.50 కోట్లను కేంద్ర పర్యాటకశాఖ సమకూర్చాయి.  వాస్తవానికి 2023 సెప్టెంబరులోనే ఈ టెర్మినల్‌ను లాంఛనంగా ప్రారంభించారు. 2024 ఏప్రిల్‌లో ప్రపంచంలోనే అతి పెద్ద లగ్జరీ క్రూజ్‌ షిప్‌ ‘‘ఓషియన్ వరల్డ్’’ ఇక్కడికి వచ్చింది. మొత్తం మీద ఈ టెర్మినల్ వల్ల విశాఖ పర్యాటకానికి మరింత ఊపు వచ్చే అవకాశాలు పెరుగుతాయి. నగరానికి పర్యాటకుల తాకిడి పెరుగుతుంది. ఫలితంగా ఏపీకి టూరిజం ఆదాయం పెరిగే ఛాన్స్ ఉంది. ఏపీలోని చంద్రబాబు ప్రభుత్వం, కేంద్రంలోని నరేంద్రమోడీ సర్కారు కలిసికట్టుగా టూరిజం వికాసానికి చేస్తున్న ప్రయత్నాల వల్లే ఇలాంటి ప్రాజెక్టులు సాకారం అవుతున్నాయనే చర్చ జరుగుతోంది.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • andhra pradesh
  • Visakha Cruise Terminal
  • Visakhapatnam

Related News

Nara Bhuvaneshwari Anna Canteens

Nara Bhuvaneswari: అన్న క్యాంటీన్‌లో పేదలతో కలిసి చంద్రబాబు,భువనేశ్వరి అల్పాహారం

ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడి పుట్టిన రోజు సందర్భంగా అన్నా క్యాంటీన్లకు నారా భువనేశ్వరి రూ.76 లక్షలను విరాళంగా ఇచ్చారు. ఉదయాన్నే చంద్రబాబుతో కలిసి అన్నా క్యాంటీన్‌కు వెళ్లిన ఆమె.. అక్కడికి వచ్చిన వారికి అల్పాహారం వడ్డించడంతోపాటు.. వారితో కలిసి స్వయంగా ఆహారం తీసుకున్నారు. తద్వారా పుట్టిన రోజులు, పెళ్లి రోజు వంటి ప్రత్యేక రోజుల్లో అందరూ అన్నదానానికి తమకు తోచిన మొత్తం వ

  • Simhachalam Chandanotsavam Simhadri Appanna Darshanam

    Simhachalam Chandanotsavam : నేడు సింహాద్రి అప్పన్న చందనోత్సవం

  • PM Modi wishes Andhra Pradesh CM Chandrababu Naidu

    చంద్రబాబుకు ప్రధాని మోదీ బర్త్ డే విషెస్

  • Nara Lokesh garu met Punarvika's family after she received an injection today

    Punarvika: చిన్నారి పునర్వికకు రూ.16 కోట్ల ఇంజెక్షన్‌ తెప్పించిన లోకేశ్‌

  • Amaravati Farmers

    Amaravati: రైతులకు గుడ్ న్యూస్.. రూ. 1.50 లక్షల రుణ మాఫీ – చంద్రబాబు

Latest News

  • ఎన్టీఆర్ – ప్రశాంత్ నీల్ మూవీ వాయిదా.. కొత్త రిలీజ్ డేట్ ప్ర‌క‌ట‌న‌!

  • ఎంత నీరు తాగినా ఇంకా దాహమేస్తోందా?

  • ఐసీయూలో మాజీ క్రికెటర్.. ప్రాణాంతక వ్యాధితో పోరాటం!

  • పాత ఉద్యోగం పోయె.. కొత్త ఆఫర్ వెనక్కి తీసుకెళ్లె! సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ ఆవేదన

  • యాపిల్ కొత్త సీఈఓగా జాన్ టెర్నస్.. ఎవ‌రీత‌ను?

Trending News

    • మారుతున్న శాలరీ స్ట్రక్చర్.. ఎవరికి లాభం? ఎవరికి నష్టం?

    • రేపు బ్యాంకుల‌కు సెల‌వు ఉందా?

    • వేసవిలో ఏసీలు ఎందుకు పేలుతాయి?

    • అమెరికా-ఇరాన్ చర్చలకు నో చెప్పిన టెహ్రాన్‌.. ఇస్లామాబాద్‌లో మాత్రం లాక్‌డౌన్!

    • రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీకి పెరగనున్న కష్టాలు!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd