Trump Tariffs: ట్రంప్ టారిఫ్ ఎఫెక్ట్.. బంగారం ధర భారీగా పెరగనుందా?
అమెరికా సుంకంపై వజ్రాల వ్యాపారులు భిన్నంగా స్పందిస్తున్నారు. వజ్రాల తయారీదారు, వ్యాపారి జయేష్ పటేల్ మాట్లాడుతూ.. "అమెరికా వజ్రాల విక్రయాలకు అతిపెద్ద మార్కెట్.
- By Gopichand Published Date - 04:04 PM, Wed - 27 August 25

Trump Tariffs: అమెరికా విధించిన 50% సుంకం (Trump Tariffs) వల్ల భారతీయ వ్యాపారుల ఆందోళనలు పెరుగుతున్నాయి. ఈ సుంకం ఎగుమతి అయ్యే అన్ని వస్తువులపైనా ప్రభావం చూపుతుంది. ముఖ్యంగా వజ్రాల పరిశ్రమలోని వాటాదారులు దీనిపై తమ అభిప్రాయాలు వ్యక్తం చేశారు. అమెరికా విధించిన 50% సుంకం వల్ల వజ్రాల ఎగుమతులు కొంతకాలం ప్రభావితం కావచ్చని వారు పేర్కొన్నారు. దీనివల్ల బంగారం, వజ్రాల ఆభరణాల ధరల్లో కూడా మార్పులు రావచ్చని అంచనా వేస్తున్నారు. అయితే అమెరికా తన వజ్రాల అవసరాల కోసం భారతదేశంపై ఎక్కువగా ఆధారపడి ఉన్నందున ఈ ప్రభావం ఎక్కువ కాలం ఉండకపోవచ్చని అంటున్నారు.
వజ్రాల పరిశ్రమపై ప్రభావం
అమెరికా విధించిన 50% సుంకం భారతదేశంలోని వజ్రాల పరిశ్రమపై ప్రభావం చూపుతుంది. సూరత్ డైమండ్ అసోసియేషన్ అధ్యక్షుడు జగదీష్ ఖుంట్ దీనిపై స్పందిస్తూ “ఈ సుంకం వల్ల వజ్రాల మార్కెట్‌పై ప్రభావం పడుతుందనడంలో ఎలాంటి సందేహం లేదు” అని తెలిపారు. ఒక నివేదిక ప్రకారం.. వజ్రాలు, ఆభరణాల రంగంలో అమెరికా పెట్టుబడి సుమారు 10 బిలియన్ డాలర్లు. ఇప్పుడు సుంకం అమలులోకి రావడంతో ఎగుమతులు తగ్గే అవకాశం ఉంది. ఇది ఇతర దేశాలతో జరిగే వాణిజ్యంలో దాదాపు 30% వరకు ఉంటుంది. దీంతో బంగారం ధరలు పెరుగుతాయి.
Also Read: Ashwin IPL Earned: అశ్విన్ ఐపీఎల్ సంపాదన ఎంతో తెలుసా.. దాదాపు రూ. 100 కోట్లు!
ఉపాధి సమస్యలు పెరిగే అవకాశం
సుంకం ప్రభావం కేవలం వజ్రాల మార్కెట్‌పైనే కాకుండా, ఆ పరిశ్రమలో పనిచేసే కార్మికులపైనా పడుతుంది. ఎగుమతులు తగ్గితే భవిష్యత్తులో వజ్రాలు చెక్కేవారికి, ఆభరణాల తయారీ కళాకారులకు ఉద్యోగాల విషయంలో సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. అయితే బంగారం ధరలు పెరిగితే ఇప్పటికే బంగారం కొని పెట్టుకున్నవారికి లాభం చేకూరుతుంది.
ఇతర దేశాలతో వ్యాపారం పెంచవచ్చు
అమెరికా సుంకంపై వజ్రాల వ్యాపారులు భిన్నంగా స్పందిస్తున్నారు. వజ్రాల తయారీదారు, వ్యాపారి జయేష్ పటేల్ మాట్లాడుతూ.. “అమెరికా వజ్రాల విక్రయాలకు అతిపెద్ద మార్కెట్. సుంకం వల్ల కొన్ని సవాళ్లను ఎదుర్కోవాల్సి రావచ్చు. అయితే మనకు ఇతర అవకాశాలు కూడా ఉన్నాయి.” ఆయన ఇంకా మాట్లాడుతూ.. “యూరోపియన్ దేశాలు, రష్యా వంటి దేశాలు కూడా ఉన్నాయి. అక్కడ మనం మన వ్యాపారాన్ని పెంచుకోవచ్చు. అంటే మనం ఇతర దేశాల్లో మార్కెట్లను వెతకాల్సి రావచ్చు” అని తెలిపారు.