HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Business
  • >Good News For Women Gold Prices Have Dropped Significantly 2

మహిళలకు గుడ్‌న్యూస్‌.. భారీగా తగ్గిన బంగారం ధర

  • Author : Vamsi Chowdary Korata Date : 02-02-2026 - 9:33 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Gold- Silver Rate
Gold- Silver Rate

Gold  బంగారం, వెండి ధరలు మరింత పతనం అవుతున్నాయి. కిందటి వారం శుక్ర, శనివారాల్లో ఒక్కసారిగా క్రాష్ అవగా.. కిందటి రోజు ఆదివారం ఎంసీఎక్స్‌లో బంగారం, వెండి ధరలు మళ్లీ క్షీణించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ఇవాళ ఇంటర్నేషనల్ మార్కెట్లోనూ బంగారం, వెండి ధరలు 5 శాతం వరకు పతనం అయ్యాయి. దీంతో ఉదయం 10 గంటల తర్వాత దేశీయంగా ధరలు తగ్గుతాయని చెప్పొచ్చు.

పసిడి ప్రియులకు అదిరిపోయే శుభవార్త. ఆల్ టైమ్ గరిష్ఠాల వద్ద ఒక్కసారిగా మదుపరులు లాభాల స్వీకరణకు పాల్పడటంతో.. ఒక్కసారిగా బంగారం, వెండి ధరలు దిగొస్తున్న సంగతి తెలిసిందే. కిందటి వారం గురువారం, శుక్రవారం రాత్రి వేళల్లో భారీగా క్రాష్ అయిన సంగతి తెలిసిందే. బంగారం ధర 15 శాతానికిపైగా.. వెండి ధర 30 శాతానికిపైగా కరెక్షన్‌కు గురయ్యాయి. దీంతో దీనికి అనుగుణంగానే.. వెంటనే దేశీయ మార్కెట్లలో బంగారం ధర 2 రోజుల వ్యవధిలో ఏకంగా రూ. 16 వేలకుపైగా తగ్గింది. ఇదే సమయంలో వెండి ధర రికార్డు స్థాయిలో రూ. 1.05 లక్షలు పతనమైంది. శనివారం, ఆదివారం.. ఇంటర్నేషనల్ మార్కెట్లకు సెలవు. అయితే.. ఆదివారం రోజు బడ్జెట్ సందర్భంగా కమొడిటీ మార్కెట్లు పనిచేయగా.. బంగారం, వెండి ధరలు అక్కడ భారీగా పతనం అయ్యాయి.

మల్టీ కమొడిటీ ఎక్స్చేంజీలో (MCX) గోల్డ్ ఫ్యూచర్స్ ధర 5 శాతం వరకు తగ్గి రూ. 1.43 లక్షల స్థాయికి పడిపోయింది. ఇక వెండి ఫ్యూచర్స్ ధర ఏకంగా 9 శాతం లోయర్ సర్క్యూట్ కొట్టి రూ. 3 లక్షలకు దిగువకు కూడా చేరింది. ఇది ఇవాళ దేశీయ మార్కెట్లలో మనకు స్పష్టం కనిపిస్తుందని చెప్పొచ్చు.

ఇదే సమయంలో ఫిబ్రవరి 2న ఇంటర్నేషనల్ మార్కెట్లలో మళ్లీ బంగారం, వెండి ధరలు భారీగా దిగొచ్చాయి. కిందటి రోజు స్పాట్ గోల్డ్ రేటు ఔన్సుకు (31.10 గ్రాములు) 4,880 డాలర్ల స్థాయిలో ఉండేది. ఇప్పుడు అది 5 శాతం వరకు తగ్గి 4,700 డాలర్ల దిగువకు చేరింది. ఇక సిల్వర్ రేటు 85 డాలర్ల నుంచి 5 శాతం పతనంతో 80 డాలర్ల స్థాయికి దిగొచ్చింది. ఈ అంతర్జాతీయ మార్కెట్ ధరలకు అనుగుణంగా.. సోమవారం ఉదయం 10 గంటలకు దేశీయ మార్కెట్లలో బంగారం, వెండి ధరలు మళ్లీ దిగిరానున్నాయని చెప్పొచ్చు.

ప్రస్తుతం దేశీయంగా బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. హైదరాబాద్ నగరంలో 22 క్యారెట్స్ గోల్డ్ రేటు తులం రూ. 1,47,200 స్థాయిలో ఉంది. 2 రోజుల్లో రూ. 16 వేలకుపైగా పతనమైంది. 24 క్యారెట్ల పుత్తడి ధర చూస్తే 10 గ్రాములకు హైదరాబాద్ మార్కెట్లో రూ. 1,60,580 వద్ద కొనసాగుతోంది. ఇక వెండి ధర ప్రస్తుతం కేజీకి హైదరాబాద్ నగరంలో రూ. 3.20 లక్షల వద్ద ఉంది. ఇవాళ ఇది రూ. 3 లక్షల దిగువకు చేరే అవకాశం ఉంది. సోమవారం ఉదయం 10 గంటల తర్వాత ధరలు మళ్లీ మారతాయని గుర్తుంచుకోవాలి. అందుకు అనుగుణంగానే జువెల్లరీలు కూడా ధరల్ని సవరిస్తాయి.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • 10 gram gold price
  • 10 gram gold price 24 carat
  • 22K gold price
  • 24K gold price
  • Daily gold price
  • Delhi gold prices
  • Global Gold Prices
  • Gold and Silver Prices Down
  • Gold and Silver Prices in Telugu
  • gold market . today gold price
  • gold price
  • gold price down
  • gold price drop
  • gold price fall
  • Gold- Silver Price
  • Hyderabad silver price
  • MCX
  • MCX Gold
  • Mcx Share Price
  • MCX Shares Crash
  • Silver Price Drop
  • Silver Price Falls

Related News

Gold

కుప్పకూలుతున్న బంగారం , వెండి ధరలు

సాధారణంగా బడ్జెట్ రోజున మార్కెట్లు ఒడిదొడుకులకు లోనవుతాయి, కానీ ఈసారి పసిడి, వెండి ధరలు ఆల్-టైమ్ గరిష్టాల నుంచి భారీ కరెక్షన్‌కు గురవ్వడం ఇన్వెస్టర్లను విస్మయానికి గురిచేస్తోంది. మల్టీ కమోడిటీ ఎక్స్ఛేంజ్ (MCX)లో ఆదివారం

  • Gold- Silver Prices

    ఇన్వెస్టర్ల దెబ్బ..కుప్ప‌కూలిన బంగారం, వెండి ధ‌ర‌లు. ఇంకా తగ్గనున్నాయా.?

  • Gold Prices

    పసిడి ధరలకు రెక్కలు.. భారత్‌లో భారీగా తగ్గిన గోల్డ్‌

  • gold and silver rate today

    బంగారం డిమాండ్ ఢమాల్

  • Budget 2026 Economic Survey

    బంగారం పై నిర్మలా సీతారామన్ కీలక ప్రకటన..ఏకంగా రూ. 12 లక్షల కోట్లు..!

Latest News

  • భారీగా పడిపోయాయి టమాటా ధరలు

  • TVK విజయ్ ఆ ట్రాప్‌లో మునిగిపోయాడా? ఇది ఆయన రాజకీయ భవిష్యత్ కు ప్రమాదమా ?

  • చేయని నేరానికి బాబు ను జైల్లో వేశారు ! మరి తప్పు చేసిన మిమ్మల్ని వేయకూడదా ?

  • T20 వరల్డ్‌కప్‌కి అంతా సిద్ధం

  • ఫోన్ ట్యాపింగ్ కేసులో కేసీఆర్ ను సిట్ అడిగిన ప్రశ్నలు

Trending News

    • మహిళలకు గుడ్‌న్యూస్‌.. భారీగా తగ్గిన బంగారం ధర

    • టీ20 వరల్డ్ కప్ 2026.. భారత్‌తో మ్యాచ్‌ను బహిష్కరించిన పాకిస్తాన్!

    • బ‌డ్జెట్ 2026.. ఏయే రంగాల‌కు ఎంత బ‌డ్జెట్?!

    • బడ్జెట్ 2026.. భారత్‌ను గ్లోబల్ డేటా & AI హబ్‌గా మార్చే దిశగా అడుగులు!

    • విరాట్ రికార్డును సమం చేసిన సూర్య‌కుమార్ యాద‌వ్!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd