HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > India
  • >Prime Minister Modi Set To Break Nehrus Record

PM Modi: జవహర్‌లాల్ నెహ్రూ రికార్డు బ్రేక్ చేయబోతున్న ప్రధాని మోడీ.

  • Author : Vamsi Chowdary Korata Date : 03-06-2026 - 5:07 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Modi Pm
Modi Pm

భారత రాజకీయాల్లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మరో అరుదైన మైలురాయిని అందుకోనున్నారు. దేశంలో అత్యంత సుదీర్ఘకాలం పాటు నిరంతరాయంగా పాలించిన ప్రధానిగా జూన్ 10న ఆయన సరికొత్త రికార్డు సృష్టించనున్నారు. స్వతంత్ర భారతదేశ తొలి ప్రధాని జవహర్‌లాల్ నెహ్రూ పేరిట ఉన్న దశాబ్దాల నాటి రికార్డును మోదీ అధిగమించనున్నారు. 2014 మే 26న తొలిసారి ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేసిన మోదీ.. జూన్ 10 నాటికి వరుసగా 4,399 రోజుల పాలనను పూర్తి చేసుకోనున్నారు.

దేశంలో మొదటి సాధారణ ఎన్నికల తర్వాత 1952 మే 13న నెహ్రూ ప్రధానిగా బాధ్యతలు చేపట్టారు. ఆయన 1964 మే 27న మరణించే వరకు వరుసగా 4,398 రోజుల పాటు ఆ పదవిలో కొనసాగారు. ఇప్పుడు ఆ రికార్డును మోదీ దాటనున్నారు. అంతకుముందు 2025 జులై 25న మాజీ ప్రధాని ఇందిరా గాంధీ పేరిట ఉన్న 4,077 రోజుల నిరంతరాయ పాలన రికార్డును మోదీ దాటేశారు.

నెహ్రూ కాలంతో పోలిస్తే ప్రస్తుతం దేశ జనాభా, ఓటర్ల సంఖ్య భారీగా పెరిగింది. తొలి సాధారణ ఎన్నికల సమయంలో దేశ జనాభా 34 కోట్లుగా ఉండగా ఓటర్లు 17 కోట్లు మాత్రమే. మోదీ ప్రధాని అయ్యే నాటికి జనాభా 131 కోట్లకు చేరి ప్రస్తుతం 146 కోట్లు దాటింది. అలాగే 1952 ఎన్నికల్లో కేవలం 53 పార్టీలు పోటీ చేయగా.. 2024 లోక్‌సభ ఎన్నికల నాటికి పోటీ చేసిన పార్టీల సంఖ్య ఏకంగా 744కు చేరింది.

నెహ్రూ తర్వాత వరుసగా మూడుసార్లు లోక్‌సభ ఎన్నికల్లో గెలిచిన ఏకైక ప్రధానిగా మోదీ నిలిచారు. కాంగ్రెసేతర ప్రధానిగా వరుసగా రెండుసార్లు పూర్తి మెజారిటీ సాధించిన రికార్డు కూడా ఆయనదే. గుజరాత్ ముఖ్యమంత్రిగా, దేశ ప్రధానిగా కలిపి అత్యధిక కాలం (8,930 రోజులకు పైగా) అధికారంలో ఉన్న ప్రజాప్రతినిధిగా ఇప్పటికే మోదీ రికార్డు సృష్టించారు.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • bjp party
  • congress party
  • Indian PM Narendra Modi
  • Jawaharlal Nehru
  • Longest Serving PM
  • Prime Minister

Related News

New pensions... Minister Seethakka shares good news for single women.

Telangana Pensions: కొత్త పెన్షన్లు.. ఒంటరి మహిళలకు గుడ్ న్యూస్ చెప్పిన మంత్రి సీతక్క

తెలంగాణలోని అర్హులైన ఒంటరి మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం తీపి కబురు అందించింది. రాబోయే ఆగస్టు 15వ తేదీ నుంచి నూతనంగా అర్హత పొందిన ఒంటరి మహిళలందరికీ కొత్త పింఛన్లు (New Pensions) మంజూరు చేయనున్నట్లు రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖల మంత్రి దనసరి అనసూయ (సీతక్క) అధికారికంగా ప్రకటించారు. ములుగు జిల్లా పర్యటన సందర్భంగా ఆమె ఈ కీలక ప్రకటన చేశారు. ఒంటరి మహిళల పెన్షన్ల పంపిణీలో ఎల

  • A flurry of appointments in the Congress... Ministerial berths confirmed for those two... Here are the contenders in the race.

    Revanth Reddy Cabinet: కాంగ్రెస్‌లో పదవుల జాతర.. ఆ ఇద్దరికి మంత్రి పదవులు ఖాయం.. రేసులో ఉన్నది వీరే

Latest News

  • Komatireddy Raj Gopal Reddy : ఎమ్మెల్యే రాజగోపాల్‌రెడ్డి సంచలన వ్యాఖ్యలు!

  • Viral : హైదరాబాద్ కేబీఆర్ పార్క్ లో 20 అడుగుల భారీ కొండ చిలువ

  • Vizag : పవన్ నటన నేర్చుకున్న భవనం కూల్చివేత

  • Salman Khan New Pic : సల్మాన్ కు ఏమైంది..? ఇలా అయ్యాడేంటి ?

  • PV Sindhu Scripts History : కంగ్రాట్స్ చెప్పిన పవన్ కళ్యాణ్‌కు సింధు ఎలాంటి రిప్లయ్ ఇచ్చిందో తెలుసా ?

Trending News

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd