HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Devotional
  • >Do You Know The Connection Between Marriage And The Three Debts

Importance of Marriage: పెళ్లికి ఆ మూడు రుణాలతో సంబంధం తెలుసా?

  • Author : Vamsi Chowdary Korata Date : 03-06-2026 - 6:00 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Do you know the connection between marriage and the three debts?
Do you know the connection between marriage and the three debts?

పెళ్లి అంటే జీవితంలో ఒక కీలక ఘట్టం. చాలామంది ఇటీవల కాలంలో ఈ పెళ్లినే వద్దని అనుకుంటున్నారు. ఇంకొందరు ఆలస్యంగా పెళ్లి చేసుకోవడానికి ప్రాధాన్యత ఇస్తున్నారు. వాస్తవానికి అన్ని మతాలు కూడా పెళ్లికి అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నాయి. వివాహ బంధం యొక్క పవిత్రతను అన్ని మతాలు చాటిచెబుతున్నాయి. ప్రత్యేకించి హిందూమతంలో పెళ్లి గురించి చాలా గొప్పగా చెప్పారు. దాని ప్రాధాన్యతను చాలా చోట్ల ప్రత్యేకంగా వివరించారు. రామాయణంలో ‘‘ఇయం సీతా మమ సుతా సహధర్మచరీ తన| వ్రతీచ్చ చైనాం భద్రం తే పాణిం గృహ్ణీష్వ పాణినా||’’ అనే శ్లోకంలో పెళ్లి గురించి చక్కగా చెప్పారు. సీతామాతను రాముడికి ఇచ్చి పెళ్లి చేసే సందర్భంగా జనక మహారాజు చెప్పిన అద్భుత పదాలు ఈ శ్లోకంలో ఉన్నాయి. ‘‘ఓ రామచంద్రా! ఈ సీత నా కుమార్తె. నీకు సహధర్మచారిణిగా ఈమెను అందిస్తున్నాను. ఈమె చేయి పట్టుకుని భార్యగా స్వీకరించు. నీకు అన్నీ శుభాలే జరుగుగాక’’ అని ఈ శ్లోకంలో జనక మహారాజు చెప్పారు. హిందూ సంప్రదాయం ప్రకారం జరిగే పెళ్లిళ్లలో ఈ శ్లోకాన్ని చెబుతారు. సీతలాంటి నా కుమార్తెను రామచంద్రుడి లాంటి నీకు అప్పగిస్తున్నానని దీని అర్థం. ‘‘ప్రజాతంతుం మావ్యవత్సేత్సీః’’ అనే మరో శ్లోకం వంశపరంపరను తెంచేయవద్దు అనే సందేశం ఇస్తుంది.

మూడు రుణాలు

ఋషి ఋణం, దేవ ఋణం, పితృ ఋణం అనే మూడు రుణాలను తీర్చుకునేందుకు పెళ్లి (Importance of Marriage) చేసుకోవాలని హిందూ ధర్మశాస్త్రాలు చెబుతున్నాయి. ఈ మూడు రుణాలను తీర్చకుంటే మరోసారి మనిషిగా పుట్టి కష్టాలను అనుభవించాల్సి ఉంటుంది. ఒకవేళ ఈ రుణాలను తీరిస్తే కైవల్యం దిశగా మన ప్రస్థానం సాగుతుంది.

మన జీవితంలో బ్రహ్మచర్య దశలో ఉండగా ఋషి ఋణం తీర్చుకోవాలి. అంటే వేదాలు చదవాలి, దైవారాధన చేయాలి, గురుపూజ చేయాలి, పురాణాలు చదవాలి మరియు వాటిని తర్వాతి తరాలకు అందించాలి.

దేవ ఋణాన్ని కూడా మనం తీర్చుకోవాలి. అందుకోసం యజ్ఞ యాగాలు చేయాలి. దీనివల్ల దేవతలు తృప్తి చెంది సకాలంలో వానలు కురిపిస్తారు. పాడిపంటలతో లోకం సస్యశ్యామలం అవుతుంది.

పితృ ఋణాన్ని కూడా మనం తీర్చుకోవాలి. ఇందులో భాగంగా మనం మంచి సంతానాన్ని పొందాలి, వంశాన్ని కొనసాగించాలి. తద్వారా పితృ ఋణం తీర్చుకోవచ్చు. పితృ ఋణం తీర్చుకోవాలంటే పెళ్లి తప్పకుండా చేసుకోవాలి. అందుకే వివాహం చాలా ముఖ్యమైనది.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • hindu marriages
  • hinduism
  • Importance of Marriage
  • indian marriages
  • marriages

Related News

    Latest News

    • Importance of Marriage: పెళ్లికి ఆ మూడు రుణాలతో సంబంధం తెలుసా?

    • PM Modi: జవహర్‌లాల్ నెహ్రూ రికార్డు బ్రేక్ చేయబోతున్న ప్రధాని మోడీ.

    • DK Shivakumar: కర్ణాటక ముఖ్యమంత్రిగా డీకే శివకుమార్ ప‍్రమాణం

    • CM Chandrababu: తెలంగాణలో పవన్ సభపై స్పందించిన చంద్రబాబు

    • Khushboo: సీఎం విజయ్‌ని కలిసి కూతురి వెడ్డింగ్ కార్డ్ ఇచ్చిన ఖుష్బూ దంపతులు

    Trending News

      • Kalita Majhi: అప్పట్లో ఇంటి పనిమనిషి.. నేడు బెంగాల్‌ మంత్రి

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2026 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd