HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > South
  • >D K Shivakumar Sworn In As Karnataka Chief Minister

DK Shivakumar: కర్ణాటక ముఖ్యమంత్రిగా డీకే శివకుమార్ ప‍్రమాణం

  • Author : Vamsi Chowdary Korata Date : 03-06-2026 - 5:00 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
D.K. Shivakumar Sworn In as Karnataka Chief Minister
D.K. Shivakumar Sworn In as Karnataka Chief Minister

కర్ణాటక నూతన ముఖ్యమంత్రిగా కాంగ్రెస్ సీనియర్ నేత డీకే శివకుమార్ ప్రమాణ స్వీకారం చేశారు. లోక్ భవన్‌లోని గ్లాస్ హౌస్‌లో జరిగిన కార్యక్రమంలో గవర్నర్ థావర్ చంద్ గెహ్లాట్ ఆయనతో ప్రమాణం చేయించారు. డీకే శివకుమార్ రాజ్యాంగం చేతపట్టుకుని ప్రమాణం చేశారు.

ఈ కార్యక్రమానికి కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, అగ్రనేత రాహుల్ గాంధీ, మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, తెలంగాణ మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, అజారుద్దీన్, మల్లు భట్టివిక్రమార్క తదితరులు హాజరయ్యారు.

డీకే శివకుమార్ కేబినెట్‌లో మాజీ సీఎం సిద్ధరామయ్య తనయుడు యతీంద్రకు చోటు దక్కింది. పరమేశ్వర ఏకైక ఉపముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. కర్ణాటక కొత్త మంత్రివర్గంలో 14 మంది మంత్రులు ప్రమాణ స్వీకారం చేశారు.

ప్రమాణ స్వీకారానికి ముందు కాంగ్రెస్ అగ్ర నాయకురాలు సోనియా గాంధీ తనకు ఫోన్ చేసి శుభాకాంక్షలు తెలిపారని డీకే శివకుమార్ వెల్లడించారు. పార్టీలో అందరినీ కలుపుకుని ముందుకు సాగాలని ఆమె సూచించినట్లు తెలిపారు. తన నాయకత్వంపై సోనియా గాంధీ పూర్తి విశ్వాసం వ్యక్తం చేశారని ఆయన పేర్కొన్నారు.

ప్రమాణ స్వీకారానికి ముందు డీకే శివకుమార్ విలేకరులతో మాట్లాడుతూ, “సోనియా గాంధీ నాతో ఫోన్‌లో మాట్లాడారు. మొదటి నుంచి నాపై ఆమెకు చాలా నమ్మకం ఉంది. నన్ను పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా నియమించింది సోనియానే. అందరినీ కలుపుకుని పనిచేయాలని ఆమె సూచించారు. ఆమె నమ్మకాన్ని నిలబెడతానని, అందరినీ కలుపుకుని ముందుకు వెళతానని నేను హామీ ఇచ్చాను” అని వివరించారు.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • congress party
  • DK Shivakumar
  • karnataka
  • karnataka cm
  • Karnataka CM change

Related News

New pensions... Minister Seethakka shares good news for single women.

Telangana Pensions: కొత్త పెన్షన్లు.. ఒంటరి మహిళలకు గుడ్ న్యూస్ చెప్పిన మంత్రి సీతక్క

తెలంగాణలోని అర్హులైన ఒంటరి మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం తీపి కబురు అందించింది. రాబోయే ఆగస్టు 15వ తేదీ నుంచి నూతనంగా అర్హత పొందిన ఒంటరి మహిళలందరికీ కొత్త పింఛన్లు (New Pensions) మంజూరు చేయనున్నట్లు రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖల మంత్రి దనసరి అనసూయ (సీతక్క) అధికారికంగా ప్రకటించారు. ములుగు జిల్లా పర్యటన సందర్భంగా ఆమె ఈ కీలక ప్రకటన చేశారు. ఒంటరి మహిళల పెన్షన్ల పంపిణీలో ఎల

  • A flurry of appointments in the Congress... Ministerial berths confirmed for those two... Here are the contenders in the race.

    Revanth Reddy Cabinet: కాంగ్రెస్‌లో పదవుల జాతర.. ఆ ఇద్దరికి మంత్రి పదవులు ఖాయం.. రేసులో ఉన్నది వీరే

Latest News

  • Sonam Wangchuk : సోనమ్ వాంగుక్ హెల్త్ బులిటెన్ విడుదల

  • Gold Price : వారం రోజుల్లో బంగారం ధర ఎంత తగ్గిందంటే?

  • Flash Floods in J&K : జమ్మూకశ్మీర్లో ఫ్లాష్ ఫ్లడ్స్ బీభత్సం

  • Delivery Boys : ఇంట్లో ఆడవారు మాత్రమే ఉంటె డెలివరీ బాయ్స్ తో జాగ్రత్త!

  • The Odyssey : నోలన్ మ్యాజిక్.. ‘ది ఒడిస్సీ’కి భారీ కలెక్షన్స్

Trending News

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd