Maruti Hybrid Car: మారుతి సుజుకి నుంచి హైబ్రిడ్ మోడల్ కారు.. ధర ఎంతంటే?
ఫ్రాంక్స్ హైబ్రిడ్ ప్రారంభ ధర సుమారుగా రూ. 10 లక్షల వరకు ఉండవచ్చని అంచనా వేస్తున్నారు. టాప్ వేరియంట్ ధర రూ. 15 లక్షల వరకు చేరవచ్చు.
- By Gopichand Published Date - 08:19 PM, Wed - 13 August 25
Maruti Hybrid Car: మారుతి సుజుకి తన హైబ్రిడ్ కార్ల (Maruti Hybrid Car) శ్రేణిని విస్తరించేందుకు ప్రణాళికలు రూపొందించింది. ఈ క్రమంలో కంపెనీ 2026 ప్రారంభంలో ఫ్రాంక్స్ హైబ్రిడ్ మోడల్‌ను విడుదల చేయనున్నట్లు నివేదికలు సూచిస్తున్నాయి. ఈ కొత్త కారు గురించి మరిన్ని వివరాలు ఇక్కడ ఉన్నాయి.
సంభావ్య ధర, ఇంజన్
ఫ్రాంక్స్ హైబ్రిడ్ ప్రారంభ ధర సుమారుగా రూ. 10 లక్షల వరకు ఉండవచ్చని అంచనా వేస్తున్నారు. టాప్ వేరియంట్ ధర రూ. 15 లక్షల వరకు చేరవచ్చు. ప్రస్తుత ఫ్రాంక్స్ స్టాండర్డ్ వెర్షన్ ధర రూ. 7.51 లక్షల నుంచి మొదలవుతుంది. ఈ కారులో కొత్త హైబ్రిడ్ సిస్టమ్‌తో కూడిన 1.2-లీటర్ Z12E 3-సిలిండర్ పెట్రోల్ ఇంజన్ ఉండవచ్చు. ఈ సిస్టమ్‌లో ఇంజన్ బ్యాటరీని ఛార్జ్ చేయగా, ఎలక్ట్రిక్ మోటార్ చక్రాలకు శక్తిని అందిస్తుంది. ఇందులో 6-స్పీడ్ గేర్‌బాక్స్ ఉంటుంది. ఈ కారు లీటరుకు సుమారు 35 కిలోమీటర్ల మైలేజ్ ఇచ్చే అవకాశం ఉంది.
Also Read: Sports Governance Bill: రాష్ట్రపతి వద్దకు జాతీయ క్రీడా పరిపాలన బిల్లు.. బీసీసీఐపై ప్రభావం ఎంత?
డిజైన్, ఫీచర్లు
ఫ్రాంక్స్ హైబ్రిడ్ బాహ్య డిజైన్‌లో పెద్దగా మార్పులు ఉండకపోవచ్చు. అయితే హైబ్రిడ్ వెర్షన్‌ను గుర్తించడానికి ఒక ప్రత్యేక లోగోను చేర్చవచ్చు. ఇంటీరియర్‌లో కూడా పెద్ద మార్పులు ఆశించలేం. ఈ కారులో 9-అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, హెడ్-అప్ డిస్ప్లే, వైర్‌లెస్ ఛార్జర్, క్రూయిజ్ కంట్రోల్ వంటి ఫీచర్లు లభిస్తాయి. భద్రతా పరంగా కారులో 6 ఎయిర్‌బ్యాగ్‌లు, 360-డిగ్రీ కెమెరా, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ ప్రోగ్రామ్, స్మార్ట్ రివర్స్ పార్కింగ్ సెన్సార్ల వంటి ఫీచర్లు ఉంటాయి. మారుతి సుజుకి ఈ హైబ్రిడ్ మోడల్‌తో పెరిగిన ఇంధన ధరల నేపథ్యంలో మెరుగైన మైలేజీ కోరుకునే వినియోగదారులను ఆకట్టుకోవాలని భావిస్తోంది. ఈ కొత్త ఫ్రాంక్స్ హైబ్రిడ్ భారత మార్కెట్లో ఎంతవరకు విజయం సాధిస్తుందో చూడాలి.
Also Read: Asia Cup 2025: ఆసియా కప్ 2025.. శుభమన్ గిల్‌కు జట్టులో అవకాశం దక్కుతుందా?