TDP Viral Tweet: వైఎస్ఆర్ ఎవరు..? ఆయనతో నాకేంటి సంబంధం అంటావా జగన్..?: టీడీపీ
టీటీడీ మాజీ ఈవో ధర్మా రెడ్డి, భూమన కరుణాకర్ రెడ్డికి ఉన్న బంధుత్వంపై టీడీపీ ప్రకటన విడుదల చేసింది. ముమ్మాటికి వాళ్లు బంధువులేనంటూ వారి మధ్య బంధుత్వాన్ని టీడీపీ గుర్తుచేసింది.
- By Gopichand Published Date - 07:20 PM, Fri - 4 October 24

TDP Viral Tweet: ఏపీలో ప్రస్తుతం హాట్ టాపిక్‌గా లడ్డూ వ్యవహారం నడుస్తోంది. ఇటు కూటమి ప్రభుత్వం గత వైసీపీ ప్రభుత్వంలో టీటీడీ లడ్డూ తయారీకి కల్తీ నెయ్యి వినియోగించారని ఆరోపిస్తోంది. మరోవైపు ప్రతిపక్ష పార్టీ వైసీపీ తిరుపతి లడ్డూ విషయాన్ని కావాలనే తెరమీదకు తీసుకొచ్చారని, లడ్డూ తయారీలో ఎలాంటి తప్పులు జరగలేదని చెబుతోంది. తాజాగా ఈ విషయమై సుప్రీంకోర్టులో వేసిన పిటిషన్‌కు తీర్పునిచ్చిన సుప్రీంకోర్టు సిట్ ఏర్పాటు చేయాలని ఆదేశించింది. అంతేకాకుండా ఇకపై రాజకీయ నాయకులెవరూ లడ్డూ విషయం మాట్లాడవద్దని కోరింది.
తిరుపతి వివాదంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుపై మీడియా సమావేశం నిర్వహించిన జగన్ ధర్మారెడ్డి తనకు బంధువు కాదనట్లు మాట్లాడిన విషయం తెలిసిందే. టీడీపీ లేనిపోని అబద్ధాలు సృష్టిస్తుందని మండిపడ్డారు. జగన్ చేసిన వ్యాఖ్యలకు తాజాగా టీడీపీ కౌంటర్ (TDP Viral Tweet) ఇచ్చింది. నీకు ధర్మారెడ్డి ఎవరో తెలియదా? కరుణాకర్ రెడ్డి నీ బంధువు కాదా? సుబ్బారెడ్డితో నీకు సంబంధం లేదా? టీటీడీలో నీ బంధవులని పెట్టుకుని దోచుకున్నావ్ అని మేము చెప్తుంటే.. నీ భాగోతం బయట పెట్టిన మా మీద పడి ఏడుస్తావా? ఇప్పటికే తల్లిని, చెల్లిని గెంటావ్.. రేపు వైఎస్ఆర్ ఎవరు? అతనితో నాకు సంబంధం ఏంటి అంటావా..? అని టీడీపీ ఓ ఫొటో విడుదల చేసింది. ఆ ఫొటోలో జగన్‌కు ధర్మారెడ్డి, వైవీ సుబ్బారెడ్డి, భూమన కరుణాకర్ రెడ్డి ఏమవుతారో స్పష్టంగా ఉంది.
Also Read: Pleasure Marriage: విహారయాత్రకు ఇండోనేషియా వెళ్లండి.. భార్యను పొందండి..!
నీకు ధర్మారెడ్డి ఎవరో తెలియదా ? కరుణాకర్ రెడ్డి నీ బంధువు కాదా ? సుబ్బారెడ్డితో నీకు సంబంధం లేదా ?
టిటిడిలో నీ బంధవులని పెట్టుకుని దోచుకున్నావ్ అని మేము చెప్తుంటే, నీ భాగోతం బయట పెట్టిన, మా మీద పడి ఏడుస్తావా ?
ఇప్పటికే తల్లిని, చెల్లిని గెంటావ్.. రేపు వైఎస్ఆర్ ఎవడు ? అతనితో నాకు… pic.twitter.com/PZWoo8Eehj— Telugu Desam Party (@JaiTDP) October 4, 2024
అంతేకాకుండా టీటీడీ మాజీ ఈవో ధర్మా రెడ్డి, భూమన కరుణాకర్ రెడ్డికి ఉన్న బంధుత్వంపై టీడీపీ ప్రకటన విడుదల చేసింది. ముమ్మాటికి వాళ్లు బంధువులేనంటూ వారి మధ్య బంధుత్వాన్ని టీడీపీ గుర్తుచేసింది. భూమన కరుణాకర రెడ్డి కచ్చితంగా జగన్ కు మామ అవుతారని ధర్మారెడ్డి బావ అవుతారంటూ టీడీపీ ప్రకటించింది. వైయస్ రాజశేఖరరెడ్డి సోదరుడి కొడుకు సుమదుర్ రెడ్డి భార్య నెహారెడ్డి భూమన కుమార్తె అని టీడీపీ తేల్చింది. అలాగే వైయస్ మేనల్లుడి కొడుకు ధర్మారెడ్డి అని టీడీపీ ప్రకటించింది. తనకు వాళ్లు బంధువులంటూ టీడీపీ ప్రకటనను ప్రెస్ మీట్ లో జగన్ ఖండించిన విషయం తెలిసిందే. టీటీడీలో నీ బంధువుల్ని పెట్టుకుని దోచుకున్నావ్ అంటూ టీడీపీ విమర్శించింది. ధర్మారెడ్డి, భూమన ఎవరో తెలీదన్న జగన్.. రేపు వైఎస్ రాజశేఖరరెడ్డి ఎవరని అడుగుతాడంటూ టీడీపీ ఆరోపణలు చేసింది.