Pleasure Marriage: విహారయాత్రకు ఇండోనేషియా వెళ్లండి.. భార్యను పొందండి..!
డబ్బుపై దురాశతో కొందరు మహిళల కుటుంబ సభ్యులు ఆనంద వివాహాలు చేసుకోవాలని ఒత్తిడి తెస్తుండగా, మరికొంత మంది మహిళలు డబ్బు సంపాదన కోసం తమ ఇష్టానుసారంగా ఈ వృత్తిని అవలంబిస్తున్నారు.
- By Gopichand Published Date - 06:36 PM, Fri - 4 October 24

Pleasure Marriage: మీరు తెలియని దేశానికి వెళ్లి అక్కడ ప్రదేశాల గురించి తెలుసుకోవాలంటే గైడ్ ను నియమించుకుంటారు. అయితే ప్రపంచంలో పర్యాటకులకు భార్యలను ఇచ్చే దేశం కూడా ఒకటి ఉంది. టూరిస్టులు తమకు నచ్చిన మహిళను కొంతకాలం పాటు భార్యగా ఉంచుకుని, యాత్ర ముగిసిన తర్వాత విడాకులు తీసుకోవచ్చు. దీనినే ‘ప్లెజర్ మ్యారేజ్’ అంటారు. తెలుగులో ఆనంద వివాహలు (Pleasure Marriage) అంటారు. అయితే
ఇండోనేషియాలో ఇలాంటి వివాహలు పెరిగాయి
ఆగ్నేయాసియా దేశాల్లో ఆనంద వివాహాల ప్రాబల్యం వేగంగా పెరుగుతోంది. ముఖ్యంగా ఇండోనేషియాలో ఇది ఎక్కువగా కనిపిస్తుంది. లాస్ ఏంజిల్స్ టైమ్స్ నివేదిక ప్రకారం.. ఇండోనేషియాలో ప్లెజర్ మ్యారేజ్ పెద్ద పరిశ్రమగా మారింది. చాలా మంది మహిళలు తమ జీవనోపాధిని పొందడానికి, డబ్బు సంపాదించడానికి ఇలాంటి వివాహాలలో భాగమవుతున్నారు. ఇది ఇండోనేషియా పర్యాటక రంగం, స్థానిక ఆర్థిక వ్యవస్థను కూడా పెంచుతుంది.
Also Read: YS Sharmila : త్వరలో సీఎం చంద్రబాబును కలుస్తా.. వైఎస్ షర్మిల
ఆడవారు ఆనంద వివాహంలో ఎలా భాగం అవుతారు?
ఇండోనేషియాలో ఆనంద వివాహాలు ఒక వృత్తిగా మారాయి. ముఖ్యంగా గ్రామాల్లో నివసించే మహిళలు ఇందులో భాగమయ్యారు. డబ్బుపై దురాశతో కొందరు మహిళల కుటుంబ సభ్యులు ఆనంద వివాహాలు చేసుకోవాలని ఒత్తిడి తెస్తుండగా, మరికొంత మంది మహిళలు డబ్బు సంపాదన కోసం తమ ఇష్టానుసారంగా ఈ వృత్తిని అవలంబిస్తున్నారు. రియల్ ఎస్టేట్ పరిశ్రమలాగే ఇక్కడ కూడా బ్రోకర్లు ఉంటారు. వారు తమ డిమాండ్‌కు అనుగుణంగా టూరిస్టులను మహిళలకు పరిచయం చేసి పెళ్లి చేస్తారు.
ఇండోనేషియాలో ప్లెజర్ మ్యారేజ్ ఇప్పుడు ఒక వృత్తిగా మారింది. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో నివసించే మహిళలు ఈ పద్ధతిలో భాగమయ్యారు. ఇండోనేషియాలో ప్లెజర్ మ్యారేజ్ పూర్తిగా నిషేధించబడింది. కానీ దానికి వ్యతిరేకంగా కఠినమైన చట్టం లేనందున ఇది ప్రబలంగా కొనసాగుతోంది. అయితే అక్కడి గ్రామీణ మహిళలు 500 అమెరికన్ డాలర్లు అంటే దాదాపు రూ. 41900 చెల్లించి పర్యాటకులతో స్వల్పకాలిక ఆనంద వివాహాలు చేసుకుంటారని ఓ నివేదిక పేర్కొంది.