HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Andhra Pradesh
  • >Record In Ap History Rs 1 14 Lakh Crore Investments Approved

Record In AP History: ఏపీ చరిత్రలోనే రికార్డు.. రూ. 1.14 లక్షల కోట్ల పెట్టుబడులకు ఆమోదం!

దాదాపు మూడు గంటల పాటు సుదీర్ఘంగా సాగిన ఈ సమావేశంలో ప్రాజెక్టుల వారీగా లోతైన చర్చ జరిగింది. ఆమోదం పొందిన భారీ ప్రాజెక్టుల పనులు త్వరగా ప్రారంభం కావడానికి ప్రత్యేక అధికారులను నియమించడానికి నిర్ణయం తీసుకున్నారు.

  • Author : Gopichand Date : 08-10-2025 - 5:13 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Record In AP History
Record In AP History

Record In AP History: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్రలోనే (Record In AP History) సరికొత్త రికార్డు సృష్టిస్తూ 11వ రాష్ట్ర పెట్టుబడుల ప్రోత్సాహక బోర్డు (SIPB) సమావేశంలో ఏకంగా రూ. 1.14 లక్షల కోట్ల భారీ పెట్టుబడులకు ఆమోదం లభించింది. ముఖ్యమంత్రి చంద్ర‌బాబు అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో మొత్తం 30కి పైగా ప్రాజెక్టులకు పచ్చజెండా ఊపారు. ఈ పెట్టుబడులలో ఐటీ, ఇంధనం, టూరిజం, ఏరోస్పేస్, ఫుడ్ ప్రాసెసింగ్ వంటి కీలక రంగాలు ఉన్నాయి. ఈ ప్రాజెక్టుల ద్వారా రాష్ట్రంలో దాదాపు 67 వేల మందికి ఉపాధి అవకాశాలు లభిస్తాయని అంచనా.

దేశ చరిత్రలోనే అతిపెద్ద విదేశీ పెట్టుబడికి ఆమోదం

ఈ 11వ SIPB సమావేశం దేశ ఆర్థిక చరిత్రలోనే ఒక మైలురాయిగా నిలిచింది. విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల (FDI) విభాగంలో ఇప్పటివరకు ఎన్నడూ లేని విధంగా రూ. 87,520 కోట్లు పెట్టుబడి పెట్టనున్న RAIDEN INFO TECH DATA CENTER ఏర్పాటుకు ఆమోదం లభించింది. ఇంత భారీ స్థాయిలో ఫారిన్ ఇన్వెస్టిమెంట్ సాధించడం రాష్ట్ర చరిత్రలో ఒక కొత్త చరిత్రను లిఖిస్తుందని ప్రభుత్వ వర్గాలు, SIPB సమావేశం అభిప్రాయపడ్డాయి.

Also Read: Yuzvendra Chahal: రెండు నెలల్లో మోసం చేస్తే నాలుగున్నరేళ్లు ఎలా నిలబడుతుంది?: చాహల్

ఈ చారిత్రక విజయం సాధించినందుకు ముఖ్యమంత్రి సహా మంత్రులందరూ ఐటీ శాఖా మంత్రి నారా లోకేష్‌ను అభినందించారు. గత 15 నెలల కాలంలో పెట్టుబడుల కోసం చేసిన ప్రయత్నాలు సత్ఫలితాలు ఇస్తున్నాయని ముఖ్యమంత్రి ఈ సందర్భంగా సంతృప్తి వ్యక్తం చేశారు.

ప్రాజెక్టుల వేగవంతానికి ప్రత్యేక అధికారులు

దాదాపు మూడు గంటల పాటు సుదీర్ఘంగా సాగిన ఈ సమావేశంలో ప్రాజెక్టుల వారీగా లోతైన చర్చ జరిగింది. ఆమోదం పొందిన భారీ ప్రాజెక్టుల పనులు త్వరగా ప్రారంభం కావడానికి ప్రత్యేక అధికారులను నియమించడానికి నిర్ణయం తీసుకున్నారు. ఈ ప్రత్యేక అధికారులు కంపెనీలకు అండగా ఉండి, ప్రాజెక్టుల సత్వర నిర్మాణానికి బాధ్యత వహిస్తారు. ఇప్పటివరకు జరిగిన మొత్తం 11 SIPB సమావేశాల ద్వారా రాష్ట్రంలో రూ. 7.07 లక్షల కోట్ల భారీ పెట్టుబడులకు ఆమోదం లభించడం విశేషం. ఈ పెట్టుబడులు రాష్ట్రాభివృద్ధికి, యువత భవిష్యత్తుకు ఊతం ఇవ్వనున్నాయి.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Andhrapradesh
  • ap news
  • Investments
  • Record In AP History
  • SIPB
  • telugu news

Related News

Ap Ev Charging Stations

ఏపీలో తొలి దశలో 135 ఈవీ ఛార్జింగ్ కేంద్రాలు ఏర్పాటు

EV Charging Stations  ఆంధ్రప్రదేశ్‌లో ఎలక్ట్రిక్ వాహనాల (ఈవీ) వాడకాన్ని ప్రోత్సహించే దిశగా ప్రభుత్వం కీలక అడుగు వేసింది. కేంద్ర ప్రభుత్వ ‘పీఎం ఈ-డ్రైవ్’ పథకంలో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా భారీగా ఛార్జింగ్ నెట్‌వర్క్‌ను విస్తరించనుంది. తొలి దశలో 135 ఈవీ కేంద్రాలను ఏర్పాటు చేసేందుకు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ కేంద్రాల్లో 600 ఛార్జింగ్ పాయింట్లను ఏర్పాటు చేయనుంది. దీంతో జాతీయ

  • AI Services In AP Government Hospitals

    ఏపీలో 18 ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఏఐ సేవలు

  • ED Attaches Rs 441 Crore Assets in Andhra Pradesh Liquor Scam Case

    వైసీపీ మద్యం కుంభకోణంలో.. 441 కోట్ల ఆస్తులు ED అటాచ్

  • Girl Harassment

    వెబ్‌సిరీస్‌లో ఛాన్స్‌ పేరిట యువతితో అసభ్య వీడియోలు

  • Middle East War Effect

    యుద్ధం ఎఫెక్ట్: భారీగా పడిపోయిన కోడిగుడ్ల ధరలు..

Latest News

  • Wife Kills Husband : ప్రియుడి కోసం భర్తను కడతేర్చిన భార్య.. గుండెపోటు డ్రామా వెనుక భయంకరమైన నిజం

  • టీమిండియాపై నోట్ల వర్షం.. బీసీసీఐ బంపర్ ఆఫర్

  • Liquor Price : మందుబాబులకు డబుల్ కిక్..భారీగా తగ్గనున్న మద్యం ధరలు

  • నేడు హైదరాబాద్‌కు కొత్తగవర్నర్ రాక.. స్వాగతం పలకనున్న సీఎం రేవంత్ రెడ్డి

  • శ్రీలంకలో ఆర్థిక సంక్షోభం.. భారీగా పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు

Trending News

    • టీమిండియా నెక్స్ట్ టార్గెట్ ఇదేనా?!

    • హనుమాన్ జన్మోత్సవం.. పూజా ముహూర్తం, పరిహారాలివే!

    • క‌న్నీళ్లు ఆపుకుని ఫైన‌ల్ మ్యాచ్ ఆడిన ఇషాన్ కిష‌న్‌!

    • Prabhakar Prasad: అమెరికా లో చాయ్ అమ్ముతూ ఇండియన్ ఎంత సంపాదిస్తున్నాడో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే !!

    • టీ20 వరల్డ్ కప్ ఫైనల్‌లో స‌రికొత్త రికార్డు క్రియేట్ చేసిన భార‌త్‌!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd