MLC Elections 2025 : తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్
గ్రాడ్యుయేట్స్ తో పోల్చితే టీచర్ ఎమ్మెల్సీ స్థానాల్లో పోలింగ్ శాతం ఎక్కువగా ఉంది. వరంగల్ - ఖమ్మం - నల్గొండ టీచర్ ఎమ్మెల్సీ స్థానంలో సాయంత్రం 4 గంటల వరకు చూస్తే 93.55 పోలింగ్ శాతం నమోదైంది.
- By Latha Suma Published Date - 06:08 PM, Thu - 27 February 25

MLC Elections 2025 : ఏపీ, తెలంగాణలో ఆరు ఎమ్మెల్సీ స్థానాలకు పోలింగ్ ప్రక్రియ ముగిసింది. అయితే క్యూలైన్లో నిలుచుకున్నవారికి ఓటింగ్ అవకాశం కల్పిస్తున్నారు. చెదురుమదురు ఘటనలు మినహా పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. క్యూలైన్లలో ఉన్న ఓటర్లు అందరూ ఓటును వినియోగించుకోనున్నారు. ఆ తర్వాతే పోలింగ్ శాతాలపై పూర్తిస్థాయిలో క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ఏపీలో వైసీపీ పోటీ చేయకపోవడంతో టీడీపీ ప్రధానంగా పోటీలో ఉంది. తెలంగాణలో బీజేపీ మూడు స్థానాల్లో పోటీ చేయగా..కాంగ్రెస్ ఒక్క స్థానంలో పోటీ చేసింది.
Read Also: Rajamouli : రాజమౌళి విజయాలకు అసలు కారణం క్షుద్ర పూజలా?
తెలంగాణలో ఒక గ్రాడ్యుయేట్, రెండు టీచర్ స్థానాలకు.. ఏపీలో 2 గ్రాడ్యుయేట్, ఒక టీచర్ MLC స్థానానికి ఎన్నికలు జరుగుతున్నాయి. గ్రాడ్యుయేట్స్ తో పోల్చితే టీచర్ ఎమ్మెల్సీ స్థానాల్లో పోలింగ్ శాతం ఎక్కువగా ఉంది. వరంగల్ – ఖమ్మం – నల్గొండ టీచర్ ఎమ్మెల్సీ స్థానంలో సాయంత్రం 4 గంటల వరకు చూస్తే 93.55 పోలింగ్ శాతం నమోదైంది. గుంటూరు, కృష్ణా ఉమ్మడి జల్లాల నుంచి టీడీపీ అభ్యర్థిగా ఆలపాటి రాజేంద్ర ప్రసాద్, ఉభయగోదావరి జిల్లాల అభ్యర్థిగా రాజశేఖరం పోటీ చేశారు. వైసీపీ ఈ సారి ఎన్నికల్లో పోటీ చేయలేదు. దీంతో టీడీపీ పార్టీతో ఇతర అభ్యర్థులు పోటీ పడ్డారు. బరిలో భారీగా అభ్యర్థులు నిలిచిన టీడీపీ ప్రధాన పార్టీగా బరిలో ఉంది.
కాగా, ఏపీ, తెలంగాణలోని ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్ ను మార్చి 3వ తేదీన నిర్వహించనున్నారు. ఇందుకోసం అధికారులు ముందస్తు చర్యలు చేపట్టారు. బ్యాలెట్ బాక్సులను స్ట్రాంగ్ రూమ్ లను తరలించి గట్టి బందోబస్తును ఏర్పాటు చేయనున్నారు. బ్యాలెట్ పేపర్లతో నిర్వహించిన ఎన్నిక కావడంతో కౌంటింగ్ ప్రక్రియ సుదీర్ఘంగా సాగనుంది. అదే సమయంలో గెలుపు లెక్క కూడా వేరుగా ఉంటుంది. పోలైన ఓట్లలో యాభై శాతం వస్తేనే ఎవరైనా గెలుస్తారు. లేకపోతే రెండో ప్రాధాన్యత ఓటును లెక్కించాల్సి ఉంటుంది.
Read Also: Congo Unknown illness: కాంగో దేశంలో విస్తరిస్తున్న వింత వ్యాధి.. 50కి పైగా మరణాలు!