Andhra Pradesh
-
కృష్ణా వాటర్ పై ఏపీ, తెలంగాణ వార్.. జిల్లెడుబండ రిజర్వాయర్ నిర్మాణంపై వివాదం
ఏపీ, తెలంగాణ మధ్య నీటి ప్రాజెక్టుల వివాదం కొనసాగుతోంది. ఆ క్రమంలో తాజాగా అనంతపురం జిల్లా ధర్మవరం వద్ద నిర్మిస్తోన్న జిల్లెడుబండ రిజర్వాయర్ గురించి కృష్ణా బోర్డుకు తెలంగాణ లేఖ రాసింది.
Date : 05-10-2021 - 3:56 IST -
వచ్చే జూన్ నాటికి పోలవరం పరవళ్లు.. 2వేలా 33కోట్ల కేంద్ర బకాయికి ఏపీ ఎదురుచూపు
ఏపీ ట్రీమ్ ప్రాజెక్టు పోలవరం పనులు శరవేగంగా జరుగుతున్నాయి. కాంక్రీట్ డ్యామ్ 3 ను ఎర్త్ కమ్ రాక్ స్పిల్ వే కు అనుసంధానం చేశారు. ప్రాజెక్టు నిర్మాణంలో ఇదో పెద్ద మైలురాయిగా ఇంజనీర్లు చెబుతున్నారు. వచ్చే ఖరీఫ్ నాటికి తొలి విడత నీటిని విడుదల చేసేందుకు ప్రాజెక్టు సిద్ధం అవుతోంది.
Date : 05-10-2021 - 3:55 IST -
అన్నదాతకు జగనన్న నిర్లక్ష్యం పోటు ..5లక్షల మంది రైతులకు `పీఎం కిసాన్` ఔట్
జగన్ ప్రభుత్వ నిర్లక్ష్యం,..బ్యాంకర్ల నిర్వాకం.. రైతుల అవగాహనలేమి..సాంకేతిక తప్పిదాలు...వెరసి కేవలం 29శాతం రైతులు మాత్రమే పీఎం కిసాన్ సమ్మాన్ యోజన పథకం కింద సంపూర్ణంగా లబ్దిపొందారు.
Date : 05-10-2021 - 11:19 IST -
ఏపీ రాజకీయ చిత్రాన్ని మర్చే బద్వేల్ ఉపపోరు
బద్వేలు ఉప పోరుకు దూరంగా ఉండాలని తెలుగుదేశం పొలిట్ బ్యూరో తీర్మానం చేసింది. రాజకీయ సంప్రదాయాన్ని అనుసరించాలని ఆ పార్టీ భావించింది. సిట్టింగ్ ఎమ్మెల్యే మరణిస్తే, ఆ ఎమ్మెల్యే కుటుంబ సభ్యులకు ఏకగ్రీవంగా ఇచ్చే సంప్రదాయం కొంత కాలంగా కొనసాగుతోంది.
Date : 04-10-2021 - 4:35 IST -
క్లైమాక్స్ కు జనసేన, బీజేపీ `పొత్తు` ఆట
జనసేన, బీజేపీ మధ్య చెడిందా? సమన్వయం లోపించిందా? ఆ రెండు పార్టీలు వేర్వేరు ప్రయత్నాలు చేసుకుంటున్నాయా? బద్వేల్ అభ్యర్థిత్వం రూపంలో ఇరు పార్టీలు విడాకులు తీసుకున్నట్టేనా?..అంటే ఔను విడిపోవడానికి ఎక్కువ అవకాశాలున్నాయని పరిణామాలు చెబుతున్నాయి.
Date : 04-10-2021 - 3:18 IST -
కోరింగ.. ఇక ఏకో సెన్సిటివ్ జోన్..!
కోరింగ అభయారణ్యం.. మనదేశంలోని అతిపెద్ద అడవుల్లో ఇదొకటి. ఆంధ్రప్రదేశ్ లోని కాకినాడకు పదిహేను కిలోమీటర్ల దూరంలో ఉంది. ఈ అడవులు గోదావరి నది ముఖద్వారంలోని ఒక భాగంలో ఉన్నాయి. సముద్రతీరానికి చేరువగానూ ఉన్నాయి. ముఖ్యంగా మాడ అడవులకు పెట్టింది పేరు ఇది. ఇక్కడ ఉన్న వాచ్ టవర్ ఒక ప్రత్యేకత. దాన్నిపైనుంచే చూస్తే కోరింగ అడవి మొత్తం కనువిందు చేస్తుంటుంది.
Date : 04-10-2021 - 2:44 IST -
బాల్యం బక్క చిక్కుతోంది..!
మనం తినే ఫుడ్ సరైంది కాదా..? పిల్లలు తీసుకునే ఆహారంలో పోషకాలు మిస్ అవుతున్నాయా.. ఈ తరం పిల్లలు రక్తహీనత, పోషకార సమస్యలతో బాధపడుతున్నారా..? అంటే అవుననే అంటోంది నీతి అయోగ్. ఈ కమిటీ రిపోర్ట్ ప్రకారం ఆంధ్రప్రదేశ్ లో మొత్తం 11.3 లక్షల మంది చిన్నారులు వివిధ అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నట్టు స్పష్టం చేసింది.
Date : 02-10-2021 - 1:30 IST -
ఆ ఇద్దరూ.. వైసీపీని ఒంటరిని చేస్తారా..?
రాజకీయాల్లో శాశ్వాత మిత్రులు, శాశ్వాత శత్రువులు అంటూ అసలు ఉండరు. నిన్న ప్రత్యర్థులుగా ఇవాళ శత్రువులుగా మారొచ్చు. ఇవాళ శత్రువులుగా ఉన్నవాళ్లు మిత్రులుగా మారొచ్చు. ఒక్కమాటలో చెప్పాలంటే రాజకీయాల్లో వైరి వర్గాలు, మిత్రపక్షాలుగా.. మిత్ర పక్షాలు వైరి వర్గాలు మారడంలో ఏమాత్రం సందేహాలు ఉండవు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ పొలిటికల్ చిత్రాన్ని చూస్తే పై వాఖ్యలే గుర్తుకువస్తాయేమో..
Date : 01-10-2021 - 5:35 IST -
ఏపీ ప్రభుత్వానికి స్టేట్ బ్యాంకు ఝలక్.. 6 వేల 500 కోట్ల ఓవర్ డ్రాప్ట్ తిరస్కరణ
కేంద్ర ప్రాయోజిత పథకాలను అమలు చేయడానికి 6వేల 500కోట్ల అదనపు నిధులను అడిగిన ఏపీ ప్రభుత్వానికి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చెప్పచెల్లు మనిపించింది.
Date : 01-10-2021 - 3:36 IST -
జగన్ ప్రభుత్వం కీలక నిర్ణయం.. పింఛన్ ఎక్కడైనా తీసుకునేలా!
ఏపీలో మొదటిసారి అధికారంలోకి వచ్చిన జగన్ ప్రభుత్వం పేదల కోసం పలు సంక్షేమ పథకాలు అమలు చేస్తూ ముందుకు సాగుతోంది. పేదల అభ్యున్నతి కోసం నవరత్నాలు లాంటి పథకాలు అమలు చేస్తున్నా.. వాటి ఆచరణ సక్రమంగా లేదనే విమర్శలొస్తున్నాయి. ఈ నేపథ్యంలో జగన్ ప్రభుత్వం ప్రభుత్వ పింఛన్లకు సంబంధించిన కీలక నిర్ణయం తీసుకుంది.
Date : 01-10-2021 - 1:55 IST -
ఆంధ్రపదేశ్ కాదు..రెడ్డిప్రదేశ్.. కులం కుంపట్లో పవర్ స్టార్ రాజకీయం
జనసేనాని పవన్ కల్యాణ్ ఇక నుంచి ఫక్తు రాజకీయ వేత్తగా ఉంటానని వెల్లడించారు. ఇప్పటి వరకు ప్రజా సేవకుడిగా మాత్రమే వ్యవహరించానని తన వ్యక్తిత్వం గురించి వివరించే ప్రయత్నం చేశాడు.
Date : 30-09-2021 - 3:05 IST -
గాంధీ జయంతి రోజున జే టాక్స్..చెత్త పన్నులకు జగన్ శ్రీకారం
చెత్త మీద పన్ను వేయడానికి ఏపీ సర్కార్ పక్కా స్కెచ్ వేసింది. ఇప్పటికే నగరాలు, పట్టణాల్లో పారిశుద్ధ్య పన్నులను జగన్ ప్రభుత్వం పెంచింది. ఇక గ్రామాల్లోనూ మురికి కాల్వలు, మరుగుదొడ్లపై పన్నులు వేయడానికి సన్నద్ధం అయింది
Date : 30-09-2021 - 2:57 IST -
ఆన్లైన్ టికెటింగ్ కొత్తగా ప్రభుత్వం పెట్టింది కాదు : పేర్ని నాని
ఆన్లైన్ టికెటింగ్ కొత్తగా ప్రభుత్వం పెట్టింది కాదని మంత్రి పేర్ని నాని స్పష్టం చేశారు. సినీ పరిశ్రమ ఆన్లైన్ టికెటింగ్కు అనుకూలంగా ఉందని తెలిపారు. సినిమా టికెట్లపై నిర్ధిష్ట విధానం అవసరమని గుర్తుచేశారు. ఇప్పటికే ఆన్లైన్ టికెటింగ్ విధానం కొనసాగుతోందని, ఇది కొత్తగా ప్రభుత్వం పెట్టింది కాదని చెప్పారు.
Date : 30-09-2021 - 1:52 IST -
ప్రశ్నించే బూతు రాజకీయం..అడ్డగోలు ప్రభుత్వానికి తిట్లదండకం
ప్రజల కోసం..ప్రజల కొరకు..ప్రజల చేత ప్రజాస్వామ్యబద్ధంగా ప్రభుత్వాలు ఏర్పడతాయి. అవి, ప్రతిక్షణం ప్రజలకు మెరుగైన పాలన అందించడానికి ప్రయత్నం చేయాలి. ఆ మేరకు ప్రజాప్రతినిధులు రాజ్యాంగంపై ప్రమాణం చేసి పాలనా పగ్గాలు చేపడతారు.
Date : 29-09-2021 - 2:09 IST -
ఉప ఎన్నికపై టీడీపీ, జనసేన తికమక..బద్వేల్ వైసీపీ అభ్యర్థిగా డాక్టర్ సుధ
కడప జిల్లా బద్వేల్ వైసీపీ అభ్యర్థిగా డాక్టర్ దాసరి సుధను ప్రకటించారు. ఆమె ఇటీవల మరణించిన సిట్టింగ్ ఎమ్మెల్యే డాక్టర్ వెంకట సుబ్బయ్య సతీమణి. అత్యధిక మోజార్టీతో ఆమెను గెలిపించుకుంటామని ప్రభుత్వం సలహాదారు సజ్జల రామక్రిష్ణారెడ్డి వెల్లడించారు
Date : 29-09-2021 - 2:08 IST -
జగన్ గుజరాత్ ఫార్ములా..100శాతం “ముందస్తు” మంత్రివర్గం.ఎంపీలకు క్యాబినెట్ లో ఛాన్స్?
గుజరాత్ తరహా ఫార్ములాను ఏపీ సీఎం జగన్ ఎంచుకున్నారని తెలుస్తోంది. ముఖ్యమంత్రితో సహా గుజరాత్ క్యాబినెట్ ను పూర్తి స్థాయిలో బీజేపీ అధిష్టానం మార్చేసింది. ఏపీలో సీఎం మినహా మంత్రివర్గంలో అందరూ మారే అవకాశం ఉంది. ఆ మేరకు జగన్ సంకేతాలు ఇచ్చారు.
Date : 29-09-2021 - 1:07 IST -
గులాబ్ కదలికలపై వెదర్ బ్లాగర్ సక్సెస్.. విశాఖ వాసి సాయి కిరణ్ కు ప్రశంసలు
తుఫాన్ అంటే అందరూ జాగ్రత్త పడతారు. వీలున్నంత వరకు బయటకు రాకుండా తలదాచుకునే ప్రయత్నం చేస్తారు.
Date : 29-09-2021 - 12:35 IST -
బెస్ట్ ఎడ్యుకేషన్ దిశగా ఏపీ ఎయిడెడ్ స్కూల్స్
ఆంధ్రప్రదేశ్ మొత్తం రెండు వేలకుపైగా ఎయిడెడ్ పాఠశాలలు ఉన్నాయి. ఒకవైపు కరోనా కరాణంగా, మరోవైపు లాక్ డౌన్ వల్ల విద్యాసంస్థల్లో టీచింగ్ నిలిచిపోయింది. పాఠశాలలు ఉండి విద్యార్థుల సంఖ్య తగ్గిపోవడం, అన్ని వసతులు ఉన్నా కూడా విద్యార్థులు మెరుగైన ఫలితాలు సాధించడం లేదు.
Date : 29-09-2021 - 12:34 IST -
కృష్ణా నదిపై సెంటిమెంట్ సెగలు.. ఏపీ, తెలంగాణ నడుమ నివురుగప్పిన నిప్పు
తెలుగు రాష్ట్రాల మధ్య నీళ్ల యుద్ధం జరుగుతోంది. కేంద్రం గెజిట్ ఇవ్వడంతో తాత్కాలికంగా ఇరు రాష్ట్రాల మధ్య హైడల్, ఇరిగేషన్ ప్రాజెక్టులు ఆగినప్పటికీ శాశ్వత పరిష్కారం లభించలేదు. ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పటి నుంచి కృష్ణా, గోదావరి ప్రాజెక్టుల్లోని నీళ్ల వాడకంపై ఇరు ప్రాంతాల మధ్య విభేదాలు ఉండేవి
Date : 29-09-2021 - 12:28 IST -
శ్రీవారి భక్తులకు శుభవార్త .. అక్టోబర్ 1 నుంచి మెట్ల మార్గం ఓపెన్
తిరుమల శ్రీవారి దర్శనానికి మెట్ల మార్గం ద్వారా వెళ్లడానికి టీటీడీ ఏర్పాట్లు చేస్తోంది. రిలయెన్స్, టీటీడీ సంయుక్తంగా రూపొందించిన మెట్ల మార్గాన్ని భక్తులు అక్టోబర్ ఒకటో తేదీ నుంచి ఉపయోగించుకోవచ్చు. బ్రహ్మోత్సవాల సందర్భంగా భక్తులకు ఒకటో తేదీ నుంచి ఈ మార్గాన్ని అందుబాబులోకి తీసుకొస్తున్నారు.
Date : 28-09-2021 - 2:26 IST