Jr.Ntr TDP : జూనియర్ పై టీడీపీ క్యాడర్ గుస్సా
తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు భోరున ఏడ్చిన ఘటనపై జూనియర్ స్పందించిన తీరు పార్టీ క్యాడర్ ను సంతృప్తి పరచలేకపోతోంది.
- By CS Rao Published Date - 10:58 PM, Tue - 23 November 21

తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు భోరున ఏడ్చిన ఘటనపై జూనియర్ స్పందించిన తీరు పార్టీ క్యాడర్ ను సంతృప్తి పరచలేకపోతోంది. అందుకే, జూనియర్ ఎన్టీఆర్ కు వ్యతిరేకంగా టీడీపీ శ్రేణులు సోషల్ మీడియా వేదికగా మండిపడుతున్నారు. అత్త శీలాన్ని శంకించిన వైసీపీ లీడర్లపైన ఆయన శైలిలో ఘాటుగా స్పందించలేదని వాళ్ల భావన. వైసీపీకి అనుకూలంగా మాట్లాడిన విధంగా ఆయన రియాక్షన్ ఉందని మరికొందరు సోషల్ మీడియాలో ట్రోల్స్ చేస్తున్నారు.చంద్రబాబును తొలి నుంచి అసభ్య పదజాలంతో మంత్రి కొడాలి వెంకటేశ్వరరావు అలియాస్ నాని, ఎమ్మెల్యే వల్లభనేని వంశీ దూషిస్తున్నారు. వాళ్లిద్దరికీ జూనియర్ ఎన్టీఆర్ రాజకీయ భిక్ష పెట్టారు. పైగా సినిమాల్లోనూ వాళ్లిద్దరు నిర్మాతలుగా ఎదగడానికి అవకాశం ఇచ్చాడు. రెండుసార్లు 2004, 2009 ఎన్నికల్లో కొడాలి నానికి టీడీపీ టిక్కెట్ లభించడం వెనుక జూనియర్ ఎన్టీఆర్ పాత్ర ఉంది. అలాగే, 2014, 2019 ఎన్నికల్లో వల్లభనేని వంశీకి టిక్కెట్ ఖరారులోనూ ఆయనే ఉన్నాడు. ఇవాళ్టికీ వాళ్లిద్దరూ వ్యక్తిగతంగా జూనియర్ కు విధేయులుగా ఉంటారు.
Also Read : అమరావతి క్లోజ్!జగన్ మాస్టర్ ప్లాన్ ఇదే!!
సాధారణంగా నందమూరి ఫ్యామిలీ చెప్పిన వాళ్లకు ఒకటి రెండు చోట్ల పోటీ చేసే అవకాశం చంద్రబాబు ఇస్తుంటాడు. ప్రతి ఎన్నికల్లోనూ అదే అనవాయితీని బాబు కొనసాగిస్తున్నాడు. ప్రత్యేకించి స్వర్గీయ హరికృష్ణ కు, హీరో బాలక్రిష్ణ చెప్పిన వాళ్లకు బాబు అవకాశం ఇచ్చే వాడు. చెరో రెండు సీట్లను వాళ్లకు కేటాయించే అనవాయితీ ఉండేది. ఆ కోటాలో జూనియర్ ఎన్టీఆర్ కొడాలి నాని, వంశీని రాజకీయంగా ప్రమోట్ చేశాడు. ఆ తరువాత కుటుంబం పరంగా జరిగిన కొన్ని పరిణామాలు జూనియర్, చంద్రబాబుకు మధ్య అంతరాన్ని పెంచాయి. అదే సమయంలో రాజకీయ పరిణామాలు మారిపోవడంతో నాని వైసీపీ వైపు వెళ్లాడు. టీడీపీ రెబల్ గా వంశీ మారాడు.
Also Read : అమరావతిపై `షా` మార్క్
వైసీపీ తీర్థం పుచ్చుకున్న కొడాలి నాని గురించి ఒకానొక సందర్భంలో జూనియర్ మీడియా ముందుకొచ్చి వివరణ ఇవాల్సిన అనివార్య పరిస్థితులు ఏర్పడ్డాయి. నాని పార్టీ మారిన సందర్భంగా ఆనాడు జూనియర్ మీద అపవాదులు వచ్చాయి. వాటికి చెక్ పెట్టడానికి మీడియా ముందుకొచ్చిన జూనియర్ ఇవాళ్టి నుంచి నాని రాజకీయ ప్రయాణానికి, తనకు ఎలాంటి సంబంధంలేదని తేల్చాశాడు. అలాగే, వంశీ విషయంలోనూ అదే పంథాను అనుసరిస్తున్నాడు ఎన్టీఆర్.
ఇదంతా జూనియర్ ఎన్టీఆర్ ఆయన మామ నార్నె శ్రీనివాసరావు ఆడిస్తోన్న గేమ్ గా టీడీపీ శ్రేణులు అనుమానిస్తున్నాయి. ప్రస్తుతం జూనియర్ మామ శ్రీనివాసరావు వైసీపీలో ఉన్నాడు. 2019 ఎన్నికలకు ముందుగా ఆయన ఆ పార్టీలో చేరాడు. చంద్రబాబు మీద బూతుపురాణం వెనుక జూనియర్ ప్రమేయం ఉందని కొందరు టీడీపీ అభిమానులు సోషల్ మీడియా వేదికగా అభిప్రాయపడుతున్నారు. ఆ క్రమంలోనే కొడాలి తరచూ నోరుపారేసుకుంటున్నాడని నమ్ముతున్నారు.
అసెంబ్లీ వేదికగా భువనేశ్వరి శీలాన్ని శంకించిన సందర్భంగా జూనియర్ స్పందించిన తీరు, ఆయన వాలకాన్ని అనుమానిస్తోన్న టీడీపీ క్యాడర్ కు నచ్చడంలేదు. నేరుగా కొడాలి నాని, వంశీ మీద విరుచుకు పడాలని వాళ్ల భావన. వాళ్లిద్దరూ వాడిన బూతుపదజాలం రూపంలోనే జూనియర్ సమాధానం కూడా ఉండాలని తమ్ముళ్ల ఉవాచ. తాజాగా చంద్రబాబు ఏడుపుపై ఎన్టీఆర్ స్పందించిన తీరు కరుడుకట్టిన టీడీపీ శ్రేణులకు ఏ మాత్రం రుచించడంలేదు. ఆ క్రమంలోనే జూనియర్ కు వ్యతిరేకంగా కొందరు నానా రకాలుగా సోషల్ మీడియాలో ట్రోల్స్ చేయడం టీడీపీలో మరో వివాదస్పద అంశంగా మారింది.
Related News

Jr. NTR : జూబ్లీహిల్స్లో ఓటు హక్కు వినియోగించుకున్న జూనియర్ ఎన్టీఆర్
తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ పక్రియ సజావుగా సాగుతుంది. ఉదయం 7 గంటల నుంచే పోలింగ్ కేంద్రాలకు భారీగా