Kodali Nani Vs CBN : ఏపీ వరద రాజకీయాల్లో ‘జూనియర్’ ఫ్లేవర్
ఏపీ వరదలు రాజకీయ ప్రవాహాన్ని సంతరించుకున్నాయి. నిమిషా వ్యవధిలోనే అటు చంద్రబాబు ఇటు మంత్రి కొడాలి నాని మీడియా ముందుకొచ్చారు.
- By CS Rao Published Date - 04:40 PM, Thu - 25 November 21

ఏపీ వరదలు రాజకీయ ప్రవాహాన్ని సంతరించుకున్నాయి. నిమిషా వ్యవధిలోనే అటు చంద్రబాబు ఇటు మంత్రి కొడాలి నాని మీడియా ముందుకొచ్చారు. పరస్పరం ఆరోపణాస్త్రాలను సంధించుకోవడంతో పాటు జూనియర్ ఫ్లేవర్ ను కూడా కొడాలి జోడించాడు. అంతేకాదు, వర్ల రామయ్యకు చురకలు వేశాడు. ఇక వరదలపై జగన్ నిర్లక్ష్యాన్ని చంద్రబాబు ఎండగట్టాడు.రెండు రోజుల పాటు చిత్తూరు, కడప జిల్లాల్లో పర్యటించిన చంద్రబాబు ప్రభుత్వం నిర్లక్ష్యంపై మండిపడుతున్నాడు. ముందుచూపు లేకపోవడంతో పించా, అన్నమయ్య ప్రాజెక్టులు గేట్లు సకాలంలో తెరుచుకోలేదని ఆరోపిస్తున్నాడు. ఫలితంగా గ్రామాలు వరద నీటిలో మునిగిపోయాయని చంద్రబాబు విమర్శిస్తున్నాడు. ప్రాజెక్టుల నిర్వహణ గురించి అవగాహలేని సీఎం జగన్ అంటూ మండిపడ్డాడు. తుఫాన్, వరద ప్రభావాన్ని ముందుగా అంచనా వేయడంలో జగన్ సర్కార్ చేతులెత్తేసిందని మీడియాకు చెప్పాడు. కనీసం సీఎం హోదాలో జగన్ క్షేత్రాస్థాయి పర్యటన కూడా చేయలేదని ఎద్దేవా చేశాడు. గాలిలో ఎగురుతూ చూసి వెళ్లపోయాడని ఆరోపించాడు. సొంత జిల్లాలో జరిగిన నష్టాన్ని కూడా చూడలేని జగన్ సీఎంగా అనర్హుడని అన్నాడు.
టైం టూ టైం సీఎం జగన్ వరద నష్టాన్ని ఉన్నతాధికారులతో సమీక్షిస్తున్నాడని మంత్రి కొడాలి వెంకటేశ్వరరావు అలియాస్ నాని అన్నాడు. ప్రభుత్వంలో ఏమి జరుగుతుందో తెలుసుకోకుండా చంద్రబాబు మాట్లాడడం మానుకోవాలని హితవు పలికాడు. ప్రభుత్వంపై బురదజల్లడం ద్వారా ప్రజల మద్ధతు పొందాలని కలలు కనడం మంచిది కాదని అటాక్ చేశాడు. సానుభూతి కోసం భువనేశ్వరి శీలాన్ని తెరమీదకు తీసుకొచ్చిన నీచుడు చంద్రబాబు అంటూ తనదైన శైలిలో కొడాలి ఫైర్ అయ్యాడు. రాజకీయాలను పక్కన పెట్టి వరద ప్రాంత నష్టాలను ఎప్పటికప్పుడు ఉన్నతాధికారులతో జగన్ అంచనా వేస్తున్న విషయాన్ని గమనించాలని కోరాడు.కొడాలి నాని, చంద్రబాబు ఇద్దరూ పోటీపోటీగా మీడియా ముందుకొచ్చారు. చిత్తూరు, కడప జిల్లాల పర్యటనలో ఉన్న బాబు మీడియా సమావేశాన్ని నిర్వహించాడు. జగన్ సర్కార్ నిర్లక్ష్యాన్ని ఎండగట్టాడు. వెంటనే విజయవాడలో మంత్రి కొడాలి మీడియాకు వచ్చేశాడు. చంద్రబాబు బోరున ఏడ్చిన వైనాన్ని మళ్లీ తెరమీదకు తీసుకొచ్చాడు. అంతేకాదు, జూనియర్ మీద అటాక్ చేయడాన్ని కూడా ప్రస్తావించాడు
. జూనియర్ ఎన్టీఆర్ చెబితే ఎందుకు వింటామని చంద్రబాబును ప్రశ్నించాడు. చంద్రబాబు ట్రాప్ లో పడకుండా ఉన్న ఏకైక నందమూరి కుటుంబీకుడు జూనియర్ అంటూ కితాబు ఇచ్చాడు. వార్డు మెంబర్ గా కూడా గెలవలేని వర్ల రామయ్య చేసిన కామెంట్స్ కు తాను తిరుగు సమాధానం ఎందుకు ఇస్తానంటూ లైట్‌గా కొట్టిపాడేశాడు కొడాలి. గత పదేళ్లుగా జగన్ నాయకత్వంలో పనిచేస్తున్న తాను, టీడీపీ రెబల్ ఎమ్మెల్యే వంశీ జూనియర్ చెబితే ఎందుకు వింటామని ప్రశ్నించాడు. మొత్తం మీద ఏపీలోని వరద నష్టాన్ని కూడా అటు ప్రతిపక్షం ఇటు అధికార పక్షం రాజకీయ కోణం నుంచి చూస్తోందని అర్థం అవుతోంది.
Related News

Nara Bhuvaneswari : అమరావతి నిర్మాణం జరిగి తీరుతుంది.. రాజధాని రైతులతో నారా భువనేశ్వరి
ఏపీకి రాజధాని ఏర్పాటు చేయడం కోసం అమరావతి రైతులు చేసిన త్యాగాలు వృథా కావని.. అమరావతి నిర్మాణం జరిగి