HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Andhra Pradesh
  • >History Will Not Forgive You Jagan Chandrababu

Cm Chandrababu Naidu: చరిత్ర నిన్ను క్షమించదు జగన్: చంద్రబాబు

  • Author : Vamsi Chowdary Korata Date : 03-04-2026 - 3:04 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Chandrababu Naidu
Chandrababu Naidu

Amaravati  రాజధాని అమరావతికి పార్లమెంట్ ఆమోదం దక్కడం చారిత్రాత్మక ఘట్టమని ముఖ్యమంత్రి చంద్రబాబు సంతోషం వ్యక్తం చేశారు. వైసీపీ మినహా దేశంలోని అన్ని పార్టీలు ఈ బిల్లుకు మద్దతు తెలపడం విశేషమని, రాష్ట్ర ప్రజలకు ద్రోహం చేసిన ఏకైక పార్టీ వైసీపీయేనని ఆయన దుయ్యబట్టారు. గత ప్రభుత్వం అమరావతిని నాశనం చేయాలని చూసిందని, కానీ తాము అదే అమరావతిని రాజధానిగా చేస్తూ శాసనం చేశామని సీఎం గర్వంగా ప్రకటించారు.

అమరావతిని రాజధానిగా అభివృద్ధి చేస్తూనే… విశాఖపట్నం, తిరుపతి ప్రాంతాలను పారిశ్రామికంగా అభివృద్ధి చేస్తామని స్పష్టం చేశారు. విభజన సమయంలో కూర్చోవడానికి కార్యాలయం కూడా లేని పరిస్థితి నుంచి, నేడు ఒక సుస్థిర రాజధానిని నిర్మించుకోగలిగామని గుర్తుచేసుకున్నారు.

11 సీట్లకు పరిమితమైనా వైసీపీకి ఇంకా బుద్ధి రాలేదని చంద్రబాబు మండిపడ్డారు. రాజధానిని నిర్ణయించే అధికారం పార్లమెంటుకు లేదనడం వారి అజ్ఞానానికి నిదర్శనమన్నారు. సైబరాబాద్ అభివృద్ధి సమయంలోనూ ఇలాగే విమర్శలు వచ్చాయని, కానీ నేడు అది హైదరాబాద్‌కే తలమానికంగా మారిందని ఉదాహరణగా చెప్పారు. సింగపూర్ వంటి సంస్థలపై అవినీతి ఆరోపణలు చేసి రాష్ట్రం నుంచి గత వైసీపీ ప్రభుత్వం తరిమేయడం దారుణమని ధ్వజమెత్తారు.

తెలుగు రాష్ట్రాలు విడిపోయినా, తెలంగాణకు తాను ఎప్పుడూ వ్యతిరేకం కాదని చంద్రబాబు స్పష్టం చేశారు. ఉమ్మడి రాష్ట్రానికి 9 ఏళ్లు సీఎంగా పనిచేసిన అనుభవంతో, రెండు రాష్ట్రాల ప్రజల కోసమే హైదరాబాద్‌ను అభివృద్ధి చేశానని చెప్పారు. తెలంగాణ ప్రజల గౌరవాన్ని తగ్గించే పని తానెప్పుడూ చేయనని, వారి పట్ల ఎల్లప్పుడూ గౌరవంతో ఉంటానని తెలిపారు.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • amaravati
  • amaravati bill
  • Amaravati Bill Passed
  • Amaravati capital
  • andhra pradesh
  • ap capital
  • ap capital amaravati
  • AP CM Chandrababu Naidu
  • ap politics
  • jagan ap capital comments
  • Jagan Cheap Politics
  • TDP (Telugu Desam Party)
  • Visakhapatnam
  • ys jagan

Related News

YouTuber Ravan's remand extended again.

Joseph Ravan Remand Report: యూట్యూబర్‌ రావణ్‌కు మరోసారి రిమాండ్‌ పొడిగింపు

వివాదాస్పద సోషల్ మీడియా పోస్టులు, దేశద్రోహం కేసులో అరెస్ట్ అయిన ప్రశ్న రావణ్ అలియాస్ బచ్చలకూరి జోసెఫ్ జ్యుడీషియల్ రిమాండ్‌ను గన్నవరం న్యాయస్థానం మరో 14 రోజుల పాటు పొడిగించింది. ప్రస్తుతం నెల్లూరు జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్న జోసెఫ్ గడువు ముగియడంతో, జైలు అధికారులు అతడిని వర్చువల్ విధానంలో న్యాయమూర్తి ఎదుట ప్రవేశపెట్టారు. కేసు తీవ్రతను పరిశీలించిన కోర్టు, రిమాండ్‌ను పొ

  • COVID-19 scare returns to AP; 12 cases reported across 4 districts.

    Covid: ఏపీలో మళ్లీ కరోనా కలకలం.. 4 జిల్లాల్లో 12 కొవిడ్‌ కేసులు

  • Egg prices skyrocket... hitting record levels.

    Egg Price Hike: కొండెక్కిన గుడ్డు.. రికార్డు స్థాయికి కోడిగుడ్డు ధరలు

  • Controversy at Mudragada Padmanabham's funeral... YCP objects to official honors.

    Mudragada Padmanabham Funeral: ముద్రగడ పద్మనాభం అంత్యక్రియల్లో వివాదం.. అధికారిక లాంఛనాలపై వైసీపీ అభ్యంతరం

  • High tension at Mudragada's residence; wife and supporters prevent daughter from entering.

    Mudragada Kranthi: ముద్రగడ నివాసం వద్ద హై టెన్షన్.. కూతురిని రానివ్వని భార్య, అభిమానులు

Latest News

  • Hyderabad : జాతీయ పోలీస్ అకాడమీలో ట్రైనీ IPSపై లైంగిక వేధింపులు.. !!

  • Wife Killed Husband : ఆరు నెలల్లో దేశంలో ఎంతమంది భార్యల చేతిలో భర్తలు చనిపోయారో తెలుసా ?

  • CJP ‘Chalo Parliament’ : రేపు CJP ‘ఛలో పార్లమెంట్’.. ఢిల్లీలో హైఅలర్ట్

  • UP : గోల్డ్ మెడలిస్ట్ ఆత్మహత్య!

  • J&K Cloudburst Tragedy: జమ్మూలో ప్రకృతి బీభత్సం.. 15 మందికిపైగా మృతి

Trending News

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd