HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Andhra Pradesh
  • >Egg Prices Hit Record Levels

Egg Price Hike: కొండెక్కిన గుడ్డు.. రికార్డు స్థాయికి కోడిగుడ్డు ధరలు

  • Author : Vamsi Chowdary Korata Date : 16-07-2026 - 3:33 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Egg prices skyrocket... hitting record levels.
Egg prices skyrocket... hitting record levels.

హైదరాబాద్ నగరంలో సామాన్యుడికి అత్యంత చౌకైన ప్రొటీన్ ఆహారంగా నిలిచే కోడిగుడ్డు ధరలు ఒక్కసారిగా కొండెక్కాయి. మార్కెట్లో డిమాండ్, సప్లై మధ్య తీవ్ర వ్యత్యాసం ఏర్పడటంతో రిటైల్ మార్కెట్లో ఒక్కో కోడిగుడ్డు ధర రికార్డు స్థాయిలో రూ. 8 నుండి రూ. 9 కి చేరింది. సాధారణంగా శీతాకాలంలో మాత్రమే పెరిగే  గుడ్డు ధరలు, ఈ విధంగా వర్షాకాలంలోనే భారీగా పెరగడం పట్ల వినియోగదారులు మరియు వ్యాపార వర్గాలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. కోడిగుడ్డు ధరలు ఈ రేంజ్ లో పెరగడానికి పౌల్ట్రీ రంగంలో ఉత్పత్తి వ్యయం విపరీతంగా పెరిగిపోవడమే ప్రధాన కారణమని హైదరాబాద్‌కు చెందిన పౌల్ట్రీ రైతులు చెబుతున్నారు. కోళ్లకు పెట్టే ప్రధాన దాణా అయిన సోయాబీన్ ధర గత కొన్ని నెలల్లో కేజీ రూ. 35 నుండి ఏకంగా రూ. 68 కి పెరగ్గా, మొక్కజొన్న ధర కూడా క్వింటాళ్ల వారీగా రూ. 20 నుండి రూ. 28 కి పెరిగింది. ఒక అంచనా ప్రకారం లక్ష కోళ్లు ఉన్న ఫారానికి దాణా ఖర్చుల కోసమే రోజుకు అదనంగా లక్ష రూపాయల వరకు భారం పడుతోంది. దీనికి తోడు వేసవి తీవ్రత వల్ల వేలాది కోళ్లు మృత్యువాత పడటం, రవాణా ఖర్చులు (డీజిల్ ధరలు) పెరగడం వల్ల మార్కెట్లోకి గుడ్ల సరఫరా (Supply Crunch) గణనీయంగా తగ్గి ధరల పెరుగుదలకు దారితీసింది.

గుడ్డు ధరల పెరుగుదల ప్రభావం మాంసం మార్కెట్‌పై కూడా స్పష్టంగా కనిపిస్తోంది. హైదరాబాద్ మార్కెట్లో ప్రస్తుతం కిలో లైవ్ చికెన్ ధర రూ. 290 నుండి స్కిన్‌లెస్ చికెన్ ధర రూ. 320 వరకు పలుకుతోంది. పౌల్ట్రీ ఫారాలలో ఉత్పత్తి 20 శాతం మేర పడిపోవడంతో ఈ ధరల పెరుగుదల తప్పలేదని హోల్‌సేల్ వ్యాపారులు చెబుతున్నారు. మధ్యతరగతి, పేద కుటుంబాలు ప్రొటీన్ కోసం ఎక్కువగా ఆధారపడే గుడ్లు, చికెన్ ధరలు ఇలా సామాన్యుడికి అందనంత ఎత్తుకు చేరడంతో నెలవారీ ఇంటి బడ్జెట్‌పై తీవ్ర ప్రభావం పడుతోంది. రాబోయే రోజుల్లో దాణా ధరలు స్థిరపడి, ఉత్పత్తి పెరిగితే తప్ప ధరలు తగ్గే అవకాశం లేదని మార్కెట్ విశ్లేషకులు భావిస్తున్నారు.

 

 


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • andhra pradesh
  • AP chicken price today
  • Chicken price Hike
  • Chicken Prices
  • egg price
  • Egg Price Hike
  • Egg Price News
  • Egg Prices
  • Wholesale egg prices

Related News

High tension at Mudragada's residence; wife and supporters prevent daughter from entering.

Mudragada Kranthi: ముద్రగడ నివాసం వద్ద హై టెన్షన్.. కూతురిని రానివ్వని భార్య, అభిమానులు

మాజీమంత్రి, కాపు ఉద్యమ నేత, వైఎస్సార్‌సీపీ నేత ముద్రగడ పద్మనాభం కన్నుమూశారు. కొంతకాలంగా కిడ్నీ సమస్యతో బాధపడుతున్న ఆయన హైదరాబాద్‌లోని ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మంగళవారం కన్నుమూశారు. ఇవాళ ఉదయం కిర్లంపూడికి ముద్రగడ పార్థివదేహాన్ని తీసుకొచ్చారు. పద్మనాభానికి నివాళులు అర్పించేందుకు అభిమానులు, వైఎస్సార్‌సీపీ కార్యకర్తలు భారీగా తరలివచ్చారు. ముద్రగడకు నివాళ

  • Deadline for 'SIR' extended in AP!

    Election Commission: ఏపీలో ‘SIR’ గడువు పెంపు!

  • Scorching heat ahead; intense sultriness today as well.

    Weather update: దంచికొట్టనున్న ఎండలు.. నేడు కూడా తీవ్ర ఉక్కపోత

  • Supreme Court rejects Telangana's plea regarding the Banakacherla petition.

    Banakacherla Project: బనకచర్ల పిటిషన్‌పై తెలంగాణ అభ్యర్థనకు నిరాకరించిన సుప్రీంకోర్టు

  • INS Mahendragiri joins the Indian Navy.

    INS Mahendragiri: భారత నౌకాదళంలో చేరిన ఐఎన్‌ఎస్ మహేంద్రగిరి

Latest News

  • New Zealand: న్యూజిలాండ్‌లో సునామీ హెచ్చరికలు..

  • Ice Cream: ఐస్‌క్రీమ్ ఎక్కువగా తింటున్నారా? క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంది.. మ‌హిళ‌లు త‌ప్పనిస‌రిగా తెలుసుకోవాల్సిన విష‌యాలు ఇవే!

  • Egg Price Hike: కొండెక్కిన గుడ్డు.. రికార్డు స్థాయికి కోడిగుడ్డు ధరలు

  • KTR: చంద్రబాబు పనితీరును కొనియాడిన కేటీఆర్‌

  • Mahua Moitra: మూడు సార్లు ఆర్డర్‌ను రద్దు చేసిన స్విగ్గీ పై టీఎంసీ ఎంపీ మహూవా మొయిత్రా ఆగ్రహం

Trending News

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd