TDP : టీడీపీ అధికారంలోకి వచ్చాక ఇసుకలో దోచుకున్నదంతా కక్కిస్తాం – మాజీ మంత్రి నక్కా ఆనంద్‌బాబు
వైసీపీ ప్రభుత్వంపై టీడీపీ సీనియర్ నేత మాజీ మంత్రి నక్కా ఆనంద్‌బాబు మండిపడ్డారు. టీడీపీ అధికారంలోకి వచ్చాక ఇసుకలో
- By Prasad Published Date - 02:03 PM, Mon - 13 November 23

వైసీపీ ప్రభుత్వంపై టీడీపీ సీనియర్ నేత మాజీ మంత్రి నక్కా ఆనంద్‌బాబు మండిపడ్డారు. టీడీపీ అధికారంలోకి వచ్చాక ఇసుకలో దోచుకున్నదంతా కక్కిస్తామన్నారు. రాష్ట్రంలో సామాన్యుడికి ఇసుక అందుబాటులో లేకుండా పోయిందని.. మద్యం, ఇసుక రెండు కళ్లుగా జగన్మోహన్ రెడ్డి భావిస్తున్నారని తెలిపారు. మద్యం, ఇసుకయే రాష్ట్రానికి ప్రధాన ఆదాయ వనరుగా మారిందని.. తాడేపల్లి ప్యాలెస్‌కు క్యాష్ వెళ్లాలంటే మద్యం, ఇసుక ఉండాలన్నారు. రాష్ట్రంలో ఇసుక కుంభకోణంలో అక్షరాల 50 వేల కుంభకోణం జరిగిందని నక్కా ఆనంద్‌బాబు ఆరోపించారు. నాలుగున్నర సంవత్సరాల్లో ఒక సంవత్సరంపాటు ఇసుక పాలసీని రాష్ట్రంలో లేకుండా నడిపారన్నారు. ఈ ఒక్క సంవత్సరంపాటు ముఖ్యమంత్రి, మంత్రులు, వైసీపీ ఎమ్మెల్యేలు, ఇతర అధికారులు అడ్డగొలుగా దోచుకున్నారని.. భవన నిర్మాణ రంగాన్ని కుదేలు చేశారని ఆయన ఆరోపించారు.
We’re now on WhatsApp. Click to Join.
దాదాపు 45 లక్షల భవన నిర్మాణ కార్మికుల పొట్ట సీఎం జగన్ కొట్టారని.. సంవత్సరం తరువాత ఇసుక పాలసీ తెచ్చి జేపీ వెంచర్స్ అనే ఒక బినామీ కంపెనీని తెచ్చారన్నారు. జేపీ వెంచర్స్ సంస్థను అడ్డం పెట్టుకుని అడ్డగోలుగా ఇసుకలో దోపిడీ చేశారని.. వైసీపీ నాయకుల అడ్డగోలు విధానాలు, దోపిడీని భరించలేక జేపీ వెంచర్స్ మధ్యలో టర్న్ కీ అనే ఒక సంస్థను తీసుకొచ్చారని ఆరోపించారు. ఆ సంస్థ కూడా ఒక యేడాదిపాటు ఒక సబ్ కాంట్రాక్టు నిర్వహించి వారు కూడా పక్కకు తప్పుకున్నారని తెలిపారు. ప్రభుత్వం, ప్రభుత్వ పెద్దలు, మైనింగ్ డైరెక్టర్ గా ఉన్న వెంకట్ రెడ్డి, జగన్ ప్యాలెస్ సిబ్బంది ఏజెంట్లను పెట్టుకుని అడ్డగోలు దోపిడీకి తెరతీశారని.. 40 వేల కోట్లు ఇసుకలో దోచిన వైనాన్ని చంద్రబాబు గతంలోనే ఎండగట్టడం జరిగిందన్నారు. గతంలో రాష్ట్రంలోని ప్రజలకు ఇసుక దోపిడీ గురించి విడమరచి చెప్పడం జరిగిందని. గతంలో ఇసుక ఉద్యమాలు కూడా నడిపామన్నారు. జేపీ వెంచర్స్ కు ఇచ్చిన కాంట్రాక్టు మే నెల 12వ తేదితో ముగిసిందని.. ఒప్పంద పత్రాలు కూడా మేం ఆ రోజు చూపామన్నారు.
Also Read: Telangana Elections 2023 : ఖమ్మంలో భారీగా నగదు, మద్యం, బాణసంచా స్వాధీనం