HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Andhra Pradesh
  • >Concessions For Heritage Incentives Are As Per The Rules

హెరిటేజ్‌కు రాయితీలు.. నిబంధనల ప్రకారమే ప్రోత్సాహకాలు!!

తిరుపతి జిల్లా చంద్రగిరి మండలం కాశిపెంట్ల గ్రామంలో ఉన్న తన యూనిట్‌ను విస్తరించేందుకు హెరిటేజ్ సంస్థ ముందుకొచ్చింది.

  • Author : Gopi Date : 18-03-2026 - 5:45 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Heritage
Heritage

Heritage: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పారిశ్రామికాభివృద్ధిని పరుగులు పెట్టించడమే లక్ష్యంగా ప్రభుత్వం అడుగులు వేస్తోంది. ఇందులో భాగంగా ‘ఏపీ ఫుడ్ ప్రాసెసింగ్ విధానం 4.0’ కింద పెట్టుబడులు పెట్టే సంస్థలకు ప్రభుత్వం అందించే సాధారణ ప్రోత్సాహకాలనే హెరిటేజ్ సంస్థకు కూడా మంజూరు చేసింది. దీనిపై జరుగుతున్న రాజకీయ ప్రచారాలకు విరుద్ధంగా, పూర్తి పారదర్శకంగా, పాలసీ నిబంధనల మేరకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారిక వర్గాలు స్పష్టం చేస్తున్నాయి.

రూ. 209 కోట్ల భారీ పెట్టుబడి.. యువతకు ఉపాధి

తిరుపతి జిల్లా చంద్రగిరి మండలం కాశిపెంట్ల గ్రామంలో ఉన్న తన యూనిట్‌ను విస్తరించేందుకు హెరిటేజ్ సంస్థ ముందుకొచ్చింది. ఇందుకోసం రూ. 209.69 కోట్ల భారీ పెట్టుబడిని ఆ సంస్థ ప్రకటించింది. ఈ విస్తరణ ద్వారా స్థానిక యువతకు పెద్ద ఎత్తున ఉద్యోగ అవకాశాలు లభించడమే కాకుండా చిత్తూరు జిల్లాలో పాడి రైతులకు మరింత మేలు చేకూరనుంది. ఏ పారిశ్రామికవేత్త అయినా రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టినప్పుడు, ప్రభుత్వం వారికి నిర్దేశిత రాయితీలు కల్పించడం సహజ ప్రక్రియ.

Also Read: ఏపీ ప్రజలకు ఉగాది కానుకలు.. చంద్రబాబు సర్కార్ వరుస వరాల జల్లు!

రాయితీల లెక్కలివే.. (మొత్తం రూ. 59.69 కోట్లు)

రాష్ట్ర స్థాయి పెట్టుబడుల ప్రోత్సాహక మండలి (SIPB) గత నెల 18న సమావేశమై హెరిటేజ్ దరఖాస్తును సుదీర్ఘంగా చర్చించిన తర్వాతే ఈ క్రింది రాయితీలను ఖరారు చేసింది.

టెక్నాలజీ అప్‌గ్రెడేషన్ సబ్సిడీ: స్థిర మూలధన పెట్టుబడిలో 25 శాతం కింద రూ. 34.93 కోట్లు.

SGST రాయితీ: 100 శాతం ఎస్జీఎస్‌టీ రాయితీ కింద రూ. 17.80 కోట్లు.

విద్యుత్ చార్జీల రీయింబర్స్‌మెంట్: యూనిట్‌కు రూపాయి చొప్పున ఐదేళ్ల కాలానికి రూ. 0.98 కోట్లు.

వడ్డీ రాయితీ: రెండు శాతం చొప్పున రూ. 5 కోట్లు.

ఈ మొత్తం రూ. 59.69 కోట్ల ప్రోత్సాహకాలకు రాష్ట్ర కేబినెట్ ఆమోదం తెలపడంతో ప్రభుత్వం అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది.

రాజకీయ వక్రీకరణలకు తావులేదు

రాష్ట్ర ఫుడ్ ప్రాసెసింగ్ పాలసీ కింద ఏ ఇతర సంస్థకైనా లభించే ప్రయోజనాలనే హెరిటేజ్ కూడా పొందింది. ఇందులో ఎటువంటి ప్రత్యేక మినహాయింపులు గానీ, అదనపు ప్రయోజనాలు గానీ లేవని ప్రభుత్వం స్పష్టం చేస్తోంది. కేవలం రాజకీయ లబ్ధి కోసమే కొందరు ఈ అంశాన్ని వివాదాస్పదం చేస్తున్నారని, వాస్తవానికి ఇది రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేసే చర్య అని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Andhrapradesh
  • ap news
  • ap politics
  • CM Chandrababu
  • heritage
  • ys jagan

Related News

Mahandu 2026

TDP : టీడీపీ మహానాడులో తెలంగాణపై చర్చ.. ఎన్టీఆర్, చంద్రబాబు సేవలను గుర్తుచేసిన నేతలు

టీడీపీ మహానాడు కార్యక్రమంలో తెలంగాణకు సంబంధించిన రాజకీయ అంశాలు, పార్టీ పాత్ర, భవిష్యత్ వ్యూహాలపై నేతలు తమ అభిప్రాయాలను వెల్లడించారు. తెలంగాణ పొలిట్ బ్యూరో సభ్యులు బక్కని నరసింహులు, అరవింద్ కుమార్ గౌడ్ పార్టీ చరిత్ర, అభివృద్ధి అంశాలపై మాట్లాడారు. బక్కని నరసింహులు మాట్లాడుతూ .. తెలంగాణలో పటేల్–పట్వారీ వ్యవస్థ రద్దు ద్వారా ప్రజల జీవితాల్లో మార్పులు తీసుకువచ్చిన ఘనత ఎన

  • Msme Summit 2026

    AP : ఎంఎస్ఎంఈ గ్రోత్ సమ్మిట్ – 2026లో కీలక ఒప్పందాలు చేసుకున్న ఏపీ ప్ర‌భుత్వం

  • More Good News for DWCRA Women: Loans Up to ₹10 Lakhs

    Dwcra Womens: డ్వాక్రా మహిళలకు మరో శుభవార్త.. రూ.10 లక్షల వరకు రుణం

  • Chandrababu Naidu

    Chandrababu Naidu: వైసీపీపై సీఎం చంద్రబాబు ఫైర్

  • Prakash Raj Controversy

    Prakash Raj: ప్రొఫెసర్ నాగేశ్వర్‌కు ప్రకాష్ రాజ్ మద్దతు

Latest News

  • BYST : ఏపీ ప్రభుత్వంతో BYST ఒప్పందం!

  • Telangana : రాష్ట్ర రెవెన్యూ శాఖలో భారీ మార్పులు.. 12 మంది అధికారుల బదిలీ

  • BRS : కేటీఆర్, హరీష్ రావు తమ కార్యకర్తలకు బోధిస్తున్న సిద్ధాంతం ఇదేనా?.. తెలంగాణ రాజకీయాల్లో కొత్త చర్చ

  • Kerala : కేర‌ళ మాజీ సీఎం పిన‌ర‌య్ విజయన్ నివాసం వద్ద ఉద్రిక్తత.. ఈడీ బృందం వాహనాలపై దాడి

  • Mahanadu : మహిళా సాధికారతే టీడీపీ లక్ష్యం.. మహానాడులో ఎమ్మెల్యే బండారు శ్రావ‌ణి

Trending News

    • fake news: లిక్కర్ కేసులో నా భార్యకు నోటీసులు రావడం అంతా అబద్ధం.. కేశినేని చిన్ని !

    • Cm Vijay: కోయంబత్తూరులో పదేళ్ల బాలిక కిడ్నాప్, హత్య..సీఎం విజయ్ ఎమోషనల్ పోస్ట్!

    • Iran: ఇరాన్‌ గగనతలం మూసివేత.. అమెరికా దాడుల హెచ్చరికలు

    • Oil Crisis: సంక్షోభం రాబోతుంది.. ‘రెడ్‌ జోన్‌’లోకి చమురు మార్కెట్‌

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd