HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Andhra Pradesh
  • >Deputy Cm Pawan Kalyan Held A Crucial Meeting With Cm Chandrababu Was This The Reason

సీఎం చంద్రబాబుకు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కీలక భేటీ.. అందుకేనా !

  • Author : Vamsi Chowdary Korata Date : 04-02-2026 - 10:19 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Naidu, Pawan discuss politics, strategies
Naidu, Pawan discuss politics, strategies

Andhra Pradesh ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌ ఈరోజు కీలక భేటీకి సిద్ధమయ్యారు. తాజా రాజకీయ పరిణామాలతో పాటు తిరుపతి లడ్డూ వివాదం ప్రధాన అజెండాగా ఈ సమావేశంలో చర్చకు వచ్చే అవకాశం ఉందని సమాచారం. అంతేకాకుండా ఖాళీ అవుతున్న రాజ్యసభ స్థానాలు, స్థానిక సంస్థల ఎన్నికలు, కేబినెట్ విస్తరణ అంశాలపై కూడా కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశముందని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి.

ఉండవల్లిలోని సీఎం నివాసంలో ఈరోజు ఉదయం 10.40 గంటలకు వీరి సమావేశం ప్రారంభమై మధ్యాహ్నం 12 గంటల వరకు కొనసాగనుంది. హైదరాబాద్ నుంచి పవన్ కల్యాణ్ ఉదయమే నేరుగా ఉండవల్లికి చేరుకోనున్నారు. నిన్న జరిగిన కేబినెట్ సమావేశంలో చర్చించిన తిరుమల లడ్డూ అంశానికి సంబంధించి సిట్ నివేదికతో పాటు ఇతర అంశాలపై ఇద్దరి మధ్య ప్రధానంగా చర్చ తెలుస్తోంది.

తిరుమల లడ్డూ వివాదం నేపథ్యంలో గత నాలుగు రోజులుగా వైసీపీ, టీడీపీ మధ్య మాటల యుద్ధం తీవ్ర స్థాయికి చేరింది. ఇప్పటివరకు ఈ అంశంపై టీడీపీ మాత్రమే ప్రత్యక్షంగా దూకుడుగా స్పందిస్తుండగా, ఇకపై కూటమి మొత్తం కలిసి ఉమ్మడి కార్యాచరణతో ముందుకు వెళ్లాలని భావిస్తున్నట్లు సమాచారం. ముఖ్యంగా జనసేన కూడా ఈ అంశంలో మరింత యాక్టివ్‌గా పాల్గొనే దిశగా వ్యూహరచన జరిగే అవకాశముంది.

అదే సమయంలో త్వరలో నాలుగు రాజ్యసభ స్థానాలు ఖాళీ కానున్న నేపథ్యంలో వాటి పంపకం అంశంపైనా ఈ సమావేశంలో చర్చ జరగొచ్చని తెలుస్తోంది. కూటమి సమీకరణాల ప్రకారం టీడీపీకి రెండు స్థానాలు, జనసేనకు ఒకటి, బీజేపీకి ఒకటి దక్కే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో కూటమిలో సమన్వయం, అభ్యర్థుల ఎంపికపై కీలక చర్చ జరిగే అవకాశముందని సమాచారం. ఇదిలా ఉండగా రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలు కూడా అజెండాలో ఉండనున్నాయి. అలాగే త్వరలో మంత్రివర్గ విస్తరణ జరిగే అవకాశం ఉందన్న ప్రచారం నేపథ్యంలో, ఆ అంశం కూడా సమావేశంలో ప్రస్తావనకు రావచ్చని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి.

మరోవైపు మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈరోజు గుంటూరు జిల్లా పర్యటనకు వెళ్తున్నారు. అంబటి రాంబాబు నివాసంపై జరిగిన దాడి నేపథ్యంలో జగన్ పర్యటన చేపడుతున్నారని తెలుస్తోంది. ఈ పరిణామం దృష్ట్యా జగన్ పర్యటన వల్ల ఏర్పడే రాజకీయ ప్రభావం, కూటమి స్పందన ఎలా ఉండాలి? అనే అంశంపైనా చంద్రబాబు, పవన్ భేటీలో చర్చ జరిగే అవకాశముంది. అవసరమైతే పవన్ కూడా జిల్లా పర్యటనలు చేపట్టాలా? లేక కూటమి ఉమ్మడిగా కార్యాచరణతో ముందుకు వెళ్లాలా? అనే అంశాలపై స్పష్టత వచ్చే అవకాశం కనిపిస్తోంది. నిన్న కేబినెట్ సమావేశంలోనే సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, కొందరు మంత్రులు కీలక అంశాలపై చర్చించగా.. ఈరోజు జరగనున్న కీలక భేటీ రాజకీయంగా ప్రాధాన్యతను సంతరించుకుంది.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Andhrapradesh
  • Andhrapradesh Govt
  • andhrapradesh politics
  • AP CM Chandrababu Naidu
  • AP Deputy CM Pawan kalyan
  • Kutami Government
  • Tirupathi Laddu
  • YsJagan
  • YSR Congress Party

Related News

More Good News for DWCRA Women: Loans Up to ₹10 Lakhs

Dwcra Womens: డ్వాక్రా మహిళలకు మరో శుభవార్త.. రూ.10 లక్షల వరకు రుణం

రాష్ట్రంలో డ్వాక్రా మహిళలకు మంత్రి కొండపల్లి శ్రీనివాస్ తీపికబురు చెప్పారు. డ్వాక్రా మహిళలకు రూ.10 లక్షల వ్యక్తిగత రుణం అందిస్తామని అన్నారు. ఎలాంటి పూచీకత్తు లేకుండా ఈ రుణాన్ని ఇస్తారు. అర్హులైన వారు దరఖాస్తు చేసుకోవాలని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ తెలిపారు. డ్వాక్రా మహిళలు ఎంఎస్‌ఎంఈ యూనిట్లు ఏర్పాటు చేసుకునేందుకు ఈ రుణాన్ని మంజూరు చేస్తారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం

  • Chandrababu Naidu

    Chandrababu Naidu: వైసీపీపై సీఎం చంద్రబాబు ఫైర్

  • Prakash Raj Controversy

    Prakash Raj: ప్రొఫెసర్ నాగేశ్వర్‌కు ప్రకాష్ రాజ్ మద్దతు

  • Let Us Make Mahanadu a Success: Minister Nara Lokesh

    Nara Lokesh: మహానాడును విజయవంతం చేద్దాం : మంత్రి నారా లోకేశ్‌

  • Janasena MLA Arava Sridhar Resigns from Whip Post

    Arava Sridhar: జనసేన ఎమ్మెల్యే అరవ శ్రీధర్ విప్ పదవికి రాజీనామా

Latest News

  • Vaibhav : శతకం మిస్సైనా చరిత్ర సృష్టించిన వైభవ్.. ఐపీఎల్‌లో పలు రికార్డులు బద్దలు

  • IPL 2026 : సెంచరీతో చెలరేగిన గిల్.. ఐపీఎల్ ఫైనల్‌కి చేరుకున్న‌ గుజరాత్ టైటాన్స్

  • Land Scam : హైదరాబాద్ లో ప్రభుత్వ భూమి కబ్జా యత్నం.. వైసీపీ మాజీ ఎమ్మెల్యేపై కేసు

  • AP : కుప్పంలో పీఎం మిత్రా పార్క్, అమరావతిలో నిఫ్ట్.. కేంద్రానికి ఏపీ ప్రతిపాదనలు

  • Vijayawada : ఇంద్రకీలాద్రికి పోటెత్తిభ‌క్తులు.. వేసవి దృష్ట్యా ప్ర‌త్యేక ఏర్పాట్లు చేసిన అధికారులు

Trending News

    • fake news: లిక్కర్ కేసులో నా భార్యకు నోటీసులు రావడం అంతా అబద్ధం.. కేశినేని చిన్ని !

    • Cm Vijay: కోయంబత్తూరులో పదేళ్ల బాలిక కిడ్నాప్, హత్య..సీఎం విజయ్ ఎమోషనల్ పోస్ట్!

    • Iran: ఇరాన్‌ గగనతలం మూసివేత.. అమెరికా దాడుల హెచ్చరికలు

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd