HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Andhra Pradesh
  • >More Good News For Dwcra Women Loans Up To %e2%82%b910 Lakhs

Dwcra Womens: డ్వాక్రా మహిళలకు మరో శుభవార్త.. రూ.10 లక్షల వరకు రుణం

  • Author : Vamsi Chowdary Korata Date : 25-05-2026 - 11:18 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
More Good News for DWCRA Women: Loans Up to ₹10 Lakhs
More Good News for DWCRA Women: Loans Up to ₹10 Lakhs

రాష్ట్రంలో డ్వాక్రా మహిళలకు మంత్రి కొండపల్లి శ్రీనివాస్ తీపికబురు చెప్పారు. డ్వాక్రా మహిళలకు రూ.10 లక్షల వ్యక్తిగత రుణం అందిస్తామని అన్నారు. ఎలాంటి పూచీకత్తు లేకుండా ఈ రుణాన్ని ఇస్తారు. అర్హులైన వారు దరఖాస్తు చేసుకోవాలని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ తెలిపారు. డ్వాక్రా మహిళలు ఎంఎస్‌ఎంఈ యూనిట్లు ఏర్పాటు చేసుకునేందుకు ఈ రుణాన్ని మంజూరు చేస్తారు.

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం డ్వాక్రా మహిళలకు అద్భుత అవకాశం కల్పించింది. ఎలాంటి పూచీకత్తు లేకుండా రూ.10 లక్షల వరకు వ్యక్తిగత రుణం అందించనుంది. డ్వాక్రా మహిళలు ఎంఎస్‌ఎంఈ యూనిట్లు ఏర్పాటు చేసుకునేందుకు వీలుగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు సెర్ప్‌ శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్‌ తెలిపారు. దీన్‌దయాల్‌ అంత్యోదయ యోజన జాతీయ గ్రామీణ జీవనోపాధి కార్యక్రమం కింద ఈ రుణాన్ని అందిస్తారన్నారు. ఈ రుణం తీసుకోవడానికి డ్వాక్రా మహిళలకు ఎలాంటి పూచీకత్తు అవసరం లేదన్నారు. కేంద్రం ఈ రుణం కోసం దరఖాస్తు చేసుకునేందుకు ఐఈఎల్‌ఏ విధానాన్ని తీసుకొచ్చిందని తెలిపారు.

ఏపీలో డ్వాక్రా మహిళలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ సూచించారు. ఎవరైనా డ్వాక్రా మహిళలు ప్రస్తుతం నిర్వహిస్తున్న, ఒకవేళ కొత్తగా ప్రారంభించే ఎంఎస్‌ఎంఈ యూనిట్ల కోసం ఈ రుణాన్ని తీసుకోవచ్చని తెలిపారు. ప్రధానంగా వ్యవసాయ అనుబంధమైన ఫుడ్‌ ప్రాసెసింగ్‌ (మునగ, తేనె, పుట్టగొడుగుల ఉత్పత్తి, నర్సరీలు, సోలార్‌ డ్రయ్యర్లు, రక్షిత సాగు, చేపలు) వంటి ప్రాసెసింగ్‌ యూనిట్లు ఏర్పాటు చేసుకోవచ్చన్నారు. దీన్‌దయాల్‌ అంత్యోదయ యోజన జాతీయ గ్రామీణ జీవనోపాధి పథకం కింద వీటిని ప్రోత్సహిస్తారన్నారు. సెర్ప్‌శాఖలోని వెలుగు విభాగం అధికారులు ఈ యూనిట్‌లకు సంబంధించిన డీపీఆర్‌ తయారీ, దరఖాస్తులోనూ సహకారం అందిస్తారని, అర్హులైన వారు దరఖాస్తు చేసుకోవాలని సూచిస్తున్నారు.

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్రంలో చిన్న, మధ్యతరహా పరిశ్రమల ఐపీవోలను ప్రోత్సహించేందుకు కీలక నిర్ణయం తీసుకుంది. ‘ఏపీ ఎస్‌ఎంఈ ఎక్స్ఛేంజ్‌’ ఏర్పాటుకు అవకాశాలపై రిపోర్ట్ ఇచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం టాస్క్‌ఫోర్స్ కమిటీని ఏర్పాటు చేసింది. ఇటీవల ఎంఎస్‌ఎంఈలకు సంస్థాగత రుణాలు పెరిగాయి. 2025-26లో రూ.1,16,274 కోట్లకు చేరడంతో ఎంఎస్‌ఎంఈల ప్రాధాన్యతను గుర్తించి కీలక నిర్ణయం తీసుకున్నారు. ఏపీ ఎస్‌ఎంఈ ఎక్స్ఛేంజ్‌ ఏర్పాటు చేసి ఈక్విటీ, ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా నిధుల లభ్యతను మరింత మెరుగుపరిచేందుకు కసరత్తు చేస్తున్నారు. దీని కోసమే కమిటీని ఏర్పాటు చేశారు. పరిశ్రమల శాఖ కార్యదర్శి ఛైర్మన్‌గా, పలు శాఖల నుంచి అధికారులు, మరికొందరితో టాస్క్‌ఫోర్స్‌ కమిటీని ఏర్పాటు చేశారు.

 


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Andhra Pradesh Dwcra Womens
  • Andhrapradesh
  • AP CM Chandrababu
  • Minister Kondapalli Srinivas
  • Personal Loans

Related News

Mavigan vs. Amaravati in the upcoming elections... YS Jagan's challenge!

Amaravati Vs MAVIGUN: వ‌చ్చే ఎన్నిక‌ల్లో మావిగన్ వర్సెస్ అమరావతి.. వైఎస్‌ జగన్‌ సవాల్..!

ఏపీ రాజధాని అమరావతిని వైసీపీ అధినేత జగన్ మరోసారి తిరస్కరిస్తూ సంచలన వ్యాఖ్యలు చేశారు. తాము మావిగన్‌కే కట్టుబడి ఉన్నామని… వచ్చే ఎన్నికలు మావిగన్ వర్సెస్ అమరావతి అని ఆయన అన్నారు. మావిగన్ ప్రతిపాదనకు తాము కట్టుబడి ఉన్నామని తెలిపారు. మావిగన్‌కు మద్దతు ఇచ్చేవారంతా వైసీపీకి ఓటు వేస్తారని చెప్పారు. ఈ రెండు రాజధానుల్లో ప్రజల మద్దతు దేనికి ఎక్కువగా ఉందో వచ్చే ఎన్నికల్లో త

  • Pawan meets Maharashtra CM Devendra Fadnavis; expresses gratitude for providing two tigresses to AP.

    Pawan Kalyan: మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవిస్ తో పవన్ భేటీ.. ఏపీకి రెండు ఆడపులులు ఇవ్వడంపై కృతజ్ఞతలు

  • Good news for the unemployed in AP: Green signal given to fill job vacancies in the Electricity Department.

    AP News: ఏపీలో మరో పెట్టుబడి.. భారీ ప్రాజెక్టు సొంతం చేసుకున్న చంద్రబాబు

Latest News

  • Tambulam: తాంబూలం ఎందుకు ఇస్తారు? ఏ సందర్భాల్లో ఇస్తారు? వాటి ప్రత్యేకత ఏంటి?

  • CM Revanth: టూరిజం రంగంలో భారీ మార్పులు.. సీఎం రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు

  • Skipping Dinner: రాత్రి భోజనం చేయలేదా? ఈ అనారోగ్య సమస్యలు తప్పవు.. జాగ్రత్త!!

  • Ravan: మరో కేసులో యూట్యూబర్‌ రావణ్‌ మళ్లీ అరెస్టు

  • Stress Management Tips: స్ట్రెస్ మేనేజ్‌మెంట్ కోసం.. నిద్రలేమిని అరికట్టే 7 టిప్స్

Trending News

    • Kissing Day: ఆవేశపూరితమైన ముద్దు నిమిషానికి 6.4 కేలరీల ఖర్చు చేస్తుంది

    • Kalyan Ram : సంక్రాంతి 2027కు సిద్ధమవుతున్న అనిల్ రావిపూడి.. కళ్యాణ్ రామ్ ఫస్ట్ లుక్‌ పోస్టర్ విడుదల !

    • ఇరాక్‌లో భారీ అవినీతి తిమింగలం! ఆ ఎంపీ ఇంట్లో బంగారు లోదుస్తులు లభ్యం..

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd