HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Andhra Pradesh
  • >Let Us Make Mahanadu A Success Minister Nara Lokesh

Nara Lokesh: మహానాడును విజయవంతం చేద్దాం : మంత్రి నారా లోకేశ్‌

  • Author : Vamsi Chowdary Korata Date : 23-05-2026 - 2:50 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Let Us Make Mahanadu a Success: Minister Nara Lokesh
Let Us Make Mahanadu a Success: Minister Nara Lokesh

తెలుగుదేశం పార్టీ ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించే మహానాడును ఈసారి క్లస్టర్ల స్థాయిలో ఒక పండుగ వాతావరణంలో, కలిసికట్టుగా విజయవంతం చేయాలని పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మంత్రి నారా లోకేశ్‌ పిలుపునిచ్చారు. హైబ్రిడ్ విధానంలో ఈ నెల 27, 28 తేదీల్లో జరగనున్న మహానాడు సన్నాహకాలపై రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 1,875 క్లస్టర్ ఇంఛార్జ్‌లతో ఆయన ఆన్‌లైన్ ద్వారా సమావేశమై దిశానిర్దేశం చేశారు. ఈసారి మహానాడును ‘స్త్రీ శక్తి మహానాడు’ అనే థీమ్‌తో నిర్వహిస్తున్నామని, మహిళా సాధికారతకు పెద్దపీట వేస్తున్నామని ఆయన స్పష్టం చేశారు.

హైబ్రిడ్ విధానంలో నిర్వహణ

వాస్తవానికి ఈసారి మహానాడును నెల్లూరులో అత్యంత ఘనంగా మూడు రోజుల పాటు నిర్వహించాలని పార్టీ భావించింది. అయితే, అంతర్జాతీయ పరిస్థితుల దృష్ట్యా ఇంధన పొదుపు చర్యలు చేపట్టాలన్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపునకు స్పందించి, ఈసారి హైబ్రిడ్ విధానంలో మహానాడును రెండు రోజులు నిర్వహించాలని నిర్ణయించినట్లు లోకేశ్‌ వివరించారు. దీని ప్రకారం మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో జరిగే ప్రధాన కార్యక్రమంలో పొలిట్‌బ్యూరో, జాతీయ, రాష్ట్ర కమిటీ సభ్యులు పాల్గొంటారు. అదే సమయంలో రాష్ట్రవ్యాప్తంగా 1,875 క్లస్టర్ కేంద్రాల్లో వర్చువల్‌గా మహానాడు కార్యక్రమాలు జరుగుతాయని తెలిపారు. ప్రతి క్లస్టర్ కేంద్రంలో ఎల్ఈడీ టీవీ, స్పీకర్లు వంటి సాంకేతిక ఏర్పాట్లు చేసుకోవాలని సూచించారు.

క్లస్టర్ వ్యవస్థ బలోపేతమే లక్ష్యం

ఈ మహానాడును క్లస్టర్ వ్యవస్థను క్షేత్రస్థాయిలో బలోపేతం చేయడానికి ఒక మంచి అవకాశంగా ఉపయోగించుకోవాలని లోకేశ్‌ అన్నారు. “క్లస్టర్ ఇంఛార్జ్‌లకు ఎక్కువ బాధ్యత ఇవ్వాలన్నది పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు ఆదేశం. ఈ వ్యవస్థ ద్వారానే మనం ముందుకు వెళ్లాలి” అని ఆయన పేర్కొన్నారు. క్లస్టర్ పరిధిలోని కుటుంబ సాధికార సారథి (కేఎస్ఎస్) నుంచి బూత్ ఇంఛార్జ్‌లు, గ్రామ కమిటీలు, అనుబంధ విభాగాల సభ్యుల వరకు అందరినీ ఈ కార్యక్రమంలో భాగస్వాములను చేయాలని ఆదేశించారు. హాజరును ‘మై టీడీపీ’ యాప్ ద్వారా నమోదు చేయనున్నట్లు తెలిపారు.

స్థానిక ఎన్నికలకు సన్నద్ధం కావాలి

ప్రజా ప్రభుత్వం ఏర్పడి రెండేళ్లు పూర్తవుతున్న తరుణంలో, త్వరలో రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలకు పార్టీ శ్రేణులు సన్నద్ధం కావాల్సిన అవసరం ఉందని లోకేశ్‌ గుర్తుచేశారు. ఇందుకు మహానాడును ఒక వేదికగా వినియోగించుకోవాలని పిలుపునిచ్చారు. పార్టీలో వ్యక్తులు శాశ్వతం కాదని, వ్యవస్థే శాశ్వతమని, ఆ వ్యవస్థను పటిష్ఠం చేసేందుకే క్లస్టర్ ఇంఛార్జ్‌లకు అవకాశం కల్పించామని అన్నారు. పార్టీలో కష్టపడి పనిచేసే వారికి నామినేటెడ్ పదవుల్లో ప్రాధాన్యత ఇస్తున్నామని, వారి పనితీరును ‘మై టీడీపీ’ యాప్ ద్వారా గుర్తిస్తున్నామని తెలిపారు. ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇంఛార్జ్‌లతో సమన్వయం చేసుకుంటూ, ప్రతి ఒక్కరూ అంకితభావంతో పనిచేసి మహానాడును చారిత్రాత్మక విజయంగా నిలపాలని ఆయన కోరారు.

ఈ సమావేశంలో ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, నియోజకవర్గ ఇంఛార్జ్‌లు, జోనల్ కోఆర్డినేటర్లు, పార్లమెంట్ పార్టీ అధ్యక్షులు, ఇతర ముఖ్య నేతలు పాల్గొన్నారు.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • andhra pradesh politics
  • AP CM Chandrababu Naidu
  • ap local body elections
  • mahanadu
  • Minister Nara lokesh
  • telugu desam party

Related News

Good news for the unemployed in AP: Green signal given to fill job vacancies in the Electricity Department.

APSPDCL: ఏపీలో నిరుద్యోగులకు శుభవార్త.. విద్యుత్ శాఖలో ఉద్యోగాలు భర్తీకి గ్రీన్ సిగ్నల్

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పరిధిలోని విద్యుత్ శాఖలో ఖాళీగా ఉన్న అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ (AEE) పోస్టుల భర్తీకి భారీ నోటిఫికేషన్ విడుదలైంది, ప్రస్తుతం దరఖాస్తుల ప్రక్రియ విజయవంతంగా కొనసాగుతోంది. మొత్తం 629 ఖాళీలను భర్తీ చేసేందుకు ఈ ప్రకటన వెలువడింది. వివిధ ప్రభుత్వ విద్యుత్ సంస్థల వారీగా విభజించిన ఈ ఖాళీలలో.. ఏపీ ట్రాన్స్‌కో (AP Transco) లో అత్యధికంగా 200 పోస్టులు ఉన్నాయి. వీటి

  • Capital war reignites in AP... Amaravati versus Mavigan...

    Capital War: ఏపీలో మళ్లీ క్యాపిటల్ వార్.. అమరావతి వర్సెస్ మావిగన్..

Latest News

  • Tambulam: తాంబూలం ఎందుకు ఇస్తారు? ఏ సందర్భాల్లో ఇస్తారు? వాటి ప్రత్యేకత ఏంటి?

  • CM Revanth: టూరిజం రంగంలో భారీ మార్పులు.. సీఎం రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు

  • Skipping Dinner: రాత్రి భోజనం చేయలేదా? ఈ అనారోగ్య సమస్యలు తప్పవు.. జాగ్రత్త!!

  • Ravan: మరో కేసులో యూట్యూబర్‌ రావణ్‌ మళ్లీ అరెస్టు

  • Stress Management Tips: స్ట్రెస్ మేనేజ్‌మెంట్ కోసం.. నిద్రలేమిని అరికట్టే 7 టిప్స్

Trending News

    • Kissing Day: ఆవేశపూరితమైన ముద్దు నిమిషానికి 6.4 కేలరీల ఖర్చు చేస్తుంది

    • Kalyan Ram : సంక్రాంతి 2027కు సిద్ధమవుతున్న అనిల్ రావిపూడి.. కళ్యాణ్ రామ్ ఫస్ట్ లుక్‌ పోస్టర్ విడుదల !

    • ఇరాక్‌లో భారీ అవినీతి తిమింగలం! ఆ ఎంపీ ఇంట్లో బంగారు లోదుస్తులు లభ్యం..

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd