HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Andhra Pradesh
  • >Prakash Raj Extends Support To Professor Nageshwar

Prakash Raj: ప్రొఫెసర్ నాగేశ్వర్‌కు ప్రకాష్ రాజ్ మద్దతు

  • Author : Vamsi Chowdary Korata Date : 23-05-2026 - 3:46 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Complaint filed against actor Prakash Raj at the police station.
Complaint filed against actor Prakash Raj at the police station.

అమిత్ షా – పవన్ కళ్యాణ్ భేటీపై పొలిటికల్ అనలిస్ట్ ప్రొఫెసర్ కె. నాగేశ్వర్ చేసిన వ్యాఖ్యలు ఏపీ రాజకీయాల్లో దుమారం రేపాయి. పవన్, నాదెండ్ల మనోహర్ కలిసి జగన్ అరెస్ట్ గురించి అమిత్ షాను కోరారని, దానికి అమిత్ షా.. బాబు తాత్కాలిక మిత్రుడని, జగన్ చిరకాల మిత్రుడని అన్నట్లు నాగేశ్వర్ వ్యాఖ్యానించారు. దీనిపై జనసేన ఆగ్రహం వ్యక్తం చేస్తూ కేసులు పెట్టడంతో ఆయన తన వ్యాఖ్యలను ఉపసంహరించుకున్నారు. అయితే, నాగేశ్వర్‌పై ట్రోలింగ్, కేసుల నమోదును నటుడు ప్రకాష్ రాజ్ తీవ్రంగా ఖండించారు. ప్రశ్నించే గొంతులను నొక్కేయడం రాజకీయ గుండాయిజమని మండిపడుతూ.. “నాగేశ్వర్ గారు, మేము మీకు అండగా ఉన్నాం” అంటూ ప్రకాష్ రాజ్ మద్దతు ప్రకటించారు.

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ‘అమిత్ షా – పవన్ కళ్యాణ్’ భేటీపై ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ ప్రొఫెసర్ కె. నాగేశ్వర్ రావు చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపిన సంగతి తెలిసిందే. ఒక టీవీ ఛానెల్ చర్చా కార్యక్రమంలో ఆయన చేసిన కొన్ని కామెంట్స్ జనసేన శ్రేణుల్లో తీవ్ర ఆగ్రహాన్ని తెప్పించాయి. ఈ నేపథ్యంలో ఆయనపై పోలీసు కేసులు నమోదు కావడం, ఆ తర్వాత ప్రొఫెసర్ నాగేశ్వర్ తన వ్యాఖ్యలను బేషరతుగా వెనక్కి తీసుకోవడం వంటి పరిణామాలు వేగంగా జరిగిపోయాయి. తాజాగా ఈ వివాదంపై విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్ స్పందిస్తూ ప్రొఫెసర్ నాగేశ్వర్‌కు తన పూర్తి మద్దతును ప్రకటించారు.

అసలేం జరిగింది?

ఓ టీవీ ఛానల్ చర్చా కార్యక్రమంలో ప్రొఫెసర్ నాగేశ్వర్ మాట్లాడుతూ.. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, నాదెండ్ల మనోహర్ కలిసి కేంద్ర హోంమంత్రి అమిత్ షాను కలిసినప్పుడు వైఎస్ జగన్‌ను అరెస్ట్ చేయాలని కోరారని, అందుకు షా స్పందిస్తూ… చంద్రబాబు నాయుడు తాత్కాలిక మిత్రుడని, జగన్ చిరకాల మిత్రుడని అన్నట్లుగా వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలపై జనసేన పార్టీ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. అమిత్ షా అనని మాటలను కల్పించి చెప్పారని, ఇది పవన్ కళ్యాణ్ వ్యక్తిత్వ హననం చేయడమేనని మండిపడింది. జనసేన లీగల్ సెల్, సోషల్ మీడియా విభాగాల ఫిర్యాదుతో కాకినాడ జిల్లా ఇంద్రపాలెం, సర్పవరం, మచిలీపట్నం పోలీస్ స్టేషన్లలో ప్రొఫెసర్ నాగేశ్వర్‌తో పాటు ఆ కార్యక్రమాన్ని ప్రసారం చేసిన టీవీ ఛానెల్‌పై కేసులు నమోదయ్యాయి. రాజకీయంగా ఒత్తిడి పెరగడంతో నాగేశ్వర్ తాను చేసిన పొరపాటుని గ్రహించారు. దీంతో అవాస్తవ సమాచారాన్ని నమ్మి మాట్లాడటం తన పొరపాటని అంగీకరిస్తూ ఆ వ్యాఖ్యలను బేషరతుగా ఉపసంహరించుకున్నారు.

ప్రకాశ్ రాజ్ ‘ಜస్ట్ ఆస్కింగ్’

ప్రొఫెసర్ నాగేశ్వర్‌పై జరుగుతున్న ట్రోలింగ్, పొలీసు కేసుల నాదుపై నటుడు ప్రకాశ్ రాజ్ తనదైన శైలిలో ‘ಜస్ట్ ఆస్కింగ్’ అంటూ గళం విప్పారు. ప్రశ్నించే వారిని భయభ్రాంతులకు గురిచేయడం ఏ రకమైన రాజీయ సంస్కృతి అని ఆయన నిలదీశారు. ప్రొఫెసర్ నాగేశ్వర్ ఎన్నో ఎళ్ళుగా ప్రజల పక్షాన నిలబడి నిలదీస్తున్నారిని, ఆయన సుదీర్ఘ విశ్లేషణను పక్కన పెట్టి కేవలం ఒకే ఒక్క లైన్ను కట్ చేసి వేధించడం సరికాదన్నారు. “ఆయన మాటలో తప్పు ఉంటే ఆధారాలు అడగండి లేదా రాజీ౛ీయకా కౌంటర్ ఇవ్వండి. అంతే తప్ప వ్యక్తిత్వ హత్య చేయడం, పొలీసు కేసులతో భయపెట్టడం ఏంటి? మా నాయకుడిని ప్రశ్నిస్తే నాశనం చేస్తాం అనడం రాజీ౛ీయ గుండాయిజం కాదా?” అని ప్రకాశ్ రాజ్ ప్రశ్నించారు. గతలో చంద్రబాబు, పవన్ కళ్యాణ్, కేసిఆర్, జగన్, రేవంత్ రెడ్డి ఇలా అందరినీ నాగేశ్వర్ ప్రశ్నించినప్పుడు ఆయన నిజాయితీ గుర్తుకు రాలేదా అని మండిపడ్డారు. కేవలం ఒక మాట నచ్చలేదనే కారణంతో యుద్ధం ప్రకటించడం ద్వంద్వ వైఖరి అని, ప్రశ్నించే గొంతులను కేసులతో నొక్కేయాలి చూడడం సమాజానికి ప్రమాదకరమని ఆందోళన వ్యక్తం చేశారు. “నాగేశ్వరరావు గారు.. మీకు అండగా మేమున్నాం, కీప్ అప్ ద గుడ్ వర్క్” అంటూ ప్రకాశ్ రాజ్ ధైర్యం చెప్పారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన విడీయో నెట్టింట వైరల్‌గా మారింది.

ప్రశ్నించే గొంతులను కేసులతో మౌనం చేయాలని చూడటం ప్రమాదకరం.
ఈరోజు నాగేశ్వర్… రేపు ఎవరు? #justasking pic.twitter.com/DbZDHMlcjW

— Prakash Raj (@prakashraaj) May 23, 2026


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • amit shah
  • AP controversy
  • AP Deputy CM Pawan kalyan
  • ap politics
  • nageshwar rao
  • prakash raj
  • YS Jagan Arrest

Related News

Complaint filed against actor Prakash Raj at the police station.

Prakash Raj: నటుడు ప్రకాష్ రాజ్ పై పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు

ప్రముఖ నటుడు ప్రకాశ్ రాజ్‌పై ఆంధ్రప్రదేశ్ బీజేపీ ఉపాధ్యక్షుడు విష్ణువర్ధన్ రెడ్డి, ఇతర బీజేపీ నేతలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. హిందూ సమాజాన్ని కించపరిచేలా, కుల, మత విద్వేషాలను రెచ్చగొట్టేలా ప్రకాశ్ రాజ్ వ్యాఖ్యలు చేస్తున్నారని ఆరోపిస్తూ కదిరి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు దాఖలు చేసినట్లు బీజేపీ నేతలు తెలిపారు. ఈ మేరకు చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరారు. విష్ణువర్ధన

  • Prakash Raj lashes out over repeated arrests of 'Ravan'.

    Prakash Raj: రావణ్ మళ్ళీ మళ్ళీ అరెస్ట్ పై ప్రకాష్ రాజ్ ఫైర్

  • Capital war reignites in AP... Amaravati versus Mavigan...

    Capital War: ఏపీలో మళ్లీ క్యాపిటల్ వార్.. అమరావతి వర్సెస్ మావిగన్..

Latest News

  • US – Iran War: ట్రంప్ హెచ్చరించిన తర్వాత, చాబహార్ ఓడరేవుపై దాడి

  • Heavy rains: వర్షం ఎఫెక్ట్‌.. రోడ్లు నదులుగా మారాయి

  • Jobs: తెలంగాణలో నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. ఆర్టీసీ కండక్టర్ పోస్టులకు గ్రీన్ సిగ్నల్

  • Gold Rate: పసిడి ప్రియులకు గుడ్‌న్యూస్..ఒక్కసారిగా పడిపోయిన బంగారం ధరలు

  • LPG gas cylinder: భారీ వర్షాలకు కొట్టుకొస్తున్న 3,000 ఎల్‌పీజీ గ్యాస్ సిలిండర్లు

Trending News

    • Kissing Day: ఆవేశపూరితమైన ముద్దు నిమిషానికి 6.4 కేలరీల ఖర్చు చేస్తుంది

    • Kalyan Ram : సంక్రాంతి 2027కు సిద్ధమవుతున్న అనిల్ రావిపూడి.. కళ్యాణ్ రామ్ ఫస్ట్ లుక్‌ పోస్టర్ విడుదల !

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd